హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐదు రోజుల క్రితం అదృశ్యం: సరస్సులో శవంగా తేలిన ఐబీఎం ఉద్యోగి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఐదు రోజుల క్రితం అదృశ్యమైన 28ఏళ్ల ఐటీ ఉద్యోగి అవకాశ్ మహంత కూకట్‌పల్లిలోని ముళ్లకుంట సరస్సులో శవమై తేలాడు. కంప్యూటర్ హార్డ్‌వేర్ కంపెనీ ఐబీఎంలో పనిచేస్తున్న మహంత.. మిగితా సమయంలో థియేటర్ ఆర్టిస్టుగా కూడా చేస్తుండేవాడు.

ఘోర పడవ ప్రమాదం: 34 మంది మృతుల్లో భారతీయ జంట, రెండేళ్ల క్రితమే పెళ్లిఘోర పడవ ప్రమాదం: 34 మంది మృతుల్లో భారతీయ జంట, రెండేళ్ల క్రితమే పెళ్లి

హర్యానాకు చెందిన మహంత హైదరాబాద్ నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే గత ఐదు రోజుల నుంచి అతని ఆచూకీ లేకుండా పోయింది. మంగళవారం అతని మృతదేహాన్ని ముళ్లకుంట సరస్సులో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Five days after he went missing, body of Hyderabad IBM employee found in lake

ప్రమాదవశాత్తు ఆ యువకుడు సరస్సులో పడివుంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం దగ్గర బాధితుడి బైక్ గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోస్టుమార్టం అనంతరం మహంత మృతదేహాన్ని అతని తల్లిదండ్రులకు అప్పగించారు. మహంతను ఎవరైనా హత్య చేసివుంటారా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతి చెందిన సమయంలో ఆఫీస్ బ్యాగ్, చెప్పులు కూడా అతనితోనే ఉన్నాయని పోలీసులు చెప్పారు. పొరపాటున కాలు జారి సరస్సులో పడివుంటాడా? అని కూడా భావిస్తున్నారు.

English summary
A 28 years old Avakash Mahanta, an IT employee and part-time theatre artist was found dead in Mullakunta lake in Kukatpally on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X