వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌కు షాక్: మల్కాజ్‌గిరి ముఖ్య నేతల రాజీనామా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికలు రానున్న వేళ మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఐదుగురు ముఖ్య నాయకులు పార్టీకి రాజీనామా చేశారు.

 Five Malkajgiri leaders resigns for Congress

కాంగ్రెస్‌ పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు, ఓబీసీ సెల్‌ రాష్ట్ర జాయింట్‌ కన్వీనర్‌ సీత బాబుయాదవ్‌, ఆయనతోపాటు జిల్లా కార్యదర్శులు ఎల్‌ లవకుమార్‌, రోహిత్‌ నాయుడు, ప్రవీణ్ కుమార్‌, రాష్ట్ర మైనారిటీ సెల్‌ కన్వీనర్‌ ముజీబ్‌లు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీలో నాయకులకు, కార్యకర్తలకు సరైన గుర్తింపు లేకపోవడంతోనే పార్టీకి రాజీనామా చేశామని అన్నారు. తమ రాజీనామాలను ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పంపనున్నట్టు తెలిపారు. త్వరలోనే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

English summary
Five Malkajgiri leaders resigns for Congress on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X