వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో సాయం: కేరళ చిన్నారుల కోసం 100టన్నుల తెలంగాణ ‘బాలామృతం’

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న కేరళ ప్రజలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి చేయూతనిచ్చింది. వరద భాదితుల సహాయార్థం ఇప్పటికే రూ.25కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

కేరళకు భారీ విరాళం: రూ.25కోట్లు ప్రకటించిన తెలంగాణ, 2.5కోట్ల విలువైన పరికరాలుకేరళకు భారీ విరాళం: రూ.25కోట్లు ప్రకటించిన తెలంగాణ, 2.5కోట్ల విలువైన పరికరాలు

ప్రస్తుతం కేరళ చిన్నారుల ఆకలిబాధలు తీర్చేందుకు రూ.52.5 లక్షల విలువ చేసే వంద మెట్రిక్‌ టన్నుల బాలామృతం ఆహారాన్ని కేరళకు తరలిస్తోంది. బాలామృతం పథకం కింద నాచారంలోని తెలంగాణ ఫుడ్స్‌లో సిద్ధం చేసిన పౌష్టికాహారాన్ని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక సైనిక విమానంలో కేరళకు తరలిస్తున్నారు.

Flood fury: Telangana foods dispatch 100 tons of Balamrutham to Kerala

సైనిక విమానం వద్దకు వెళ్లే బాలామృతం వాహనాలను తెలంగాణ ఫుడ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విజయేంద్ర బోయే, ఛైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. కేరళ వరద బాధితుల సహాయార్థం బాలామృతం పౌష్టికాహారాన్ని ముఖ్యమంత్రి ఆదేశానుసారం పంపిస్తున్నామని విజయేంద్రబోయే తెలిపారు.

Recommended Video

324కు చేరిన మృతులు..వందేళ్లలో ఇదే తొలిసారి.

ఏడు నెలల పిల్లల నుంచి మూడేళ్ల వయస్సున్న పిల్లలకు ఈ సమయంలో పౌష్టికాహారంగా బాలామృతం ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. లక్షలాది మంది కేరళ ప్రజలు భారీ వర్షాల కారణంగా నిరాశ్రయులైన విషయం తెలిసిందే. ఇప్పటికే 325కుపైగా మృతి చెందారు. లక్షలాది మంది సురక్షిత శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

English summary
Telangana Foods dispatched 100 metric Tonnes of Balamrutham(A nutritiou food for children manufactured by Telangana Foods ) costing Rs. 52.5lakh free of cost to feed the flood stranded children in Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X