హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేతలు, అనుచరులతో కిక్కిరిసన రేవంత్ నివాసం: నేడే ఢిల్లీకి..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక లాంఛనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నివాసం సోమవారం ఉదయం నుంచే నేతలు, అభిమానులతో కిక్కిరిసిపోయింది.

గుండెకోతే: ఇదీ రేవంత్ రెడ్డి లేఖ పూర్తి పాఠంగుండెకోతే: ఇదీ రేవంత్ రెడ్డి లేఖ పూర్తి పాఠం

జలవిహార్ లో అభిమానులు, కార్యకర్తలతో సోమవారం సమావేశం అయ్యేందుకు రేవంత్ రెడ్డిఅనుమతి కోరగా.. అసెంబ్లీ సమావేశాలను కారణంగా చూపిన పోలీసులు, అనుమతులు నిరాకరించిన సంగతి తెలిసిందే.

 followers reaches revanth reddy's house

ఈ నేపథ్యంలో తన ఇంటి వద్దే భేటీ అవుదామని చెబుతూ.. 2 వేల మందికి రేవంత్ ఆహ్వానం పంపారు. అయితే, దాదాపు 5 నుంచి 10 వేల మంది వరకూ వస్తారని అంచనా వేశారు. కాగా, ఇప్పటికే ఆయన నివాసం వద్ద 1వేల మందికి పైగా కార్యకర్తలు, పలు జిల్లాల నుంచి వచ్చిన చోటా, మోటా నేతలు చేరడంతో సందడిగా మారింది.

ఇప్పటికే రేవంత్ కు మద్దతుగా పలువురు రాజీనామాలు చేయగా, మరికొందరు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. సోమవారం కార్యకర్తలతో సమావేశం అనంతరం ఢిల్లీకి వెళ్లే రేవంత్.. మంగళవారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో అధికారికంగా చేరనున్నట్లు తెలిసింది.

English summary
Huge number of followers of Revanth Reddy reached his house in Hyderabad on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X