వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడి నుండే కెసిఆర్ కు సెగ, ఆందోళనకారులకు విపక్షాల మద్దతు

మల్లన్నసాగర్ కు వ్యతిరేకంగా 40 కేసులు కాదు, ఏకంగా 150 కేసులు వేసైనా కేసీఆర్ కు తమ తడాఖా చూపిస్తామన్నారు మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ.

By Narsimha
|
Google Oneindia TeluguNews

మెదక్: మల్లన్నసాగర్ కు వ్యతిరేకంగా 40 కేసులు కాదు, ఏకంగా 150 కేసులు వేసైనా కేసీఆర్ కు తమ తడాఖా చూపిస్తామన్నారు మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ.

మల్లన్నసాగర్ కు వ్యతిరేకంగా తొగుట మండలంలోని వేములఘాట్ గ్రామంలో స్థానికులు చేపట్టిన రిలేదీక్షలు ప్రారంభించి ఏడాదైనా సందర్భంగా గ్రామస్థులు ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దళారీ వ్యవస్థను ఏర్పాటుచేసకొని ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములను బలవంతంగా లాక్కొంటున్నారని ఆయన ఆరోపించారు.

mallanna sagar protest

ప్రభుత్వం రైతుల నుండి బలవంతంగా లాక్కొని రియల్ ఏస్టేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారని టీజెఎసి ఛైర్మెన్ కోదండరామ్ ఆరోపించారు. కెసిఆర్ క్యాబినెట్ లోని మంత్రులు కళ్ళుండి కూడ చూడలేని కబోదులుగా మారారని హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ ఆరోపించారు.మంత్రులకు దివ్యాంగులుగా పెన్షన్ ఇవ్వాలని ఆయన కోరారు.

టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య , మాజీ మంత్రి డికె అరుణ, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్ రెడ్డి , మాజీ ఎంపి వి.హనుమంతరావు లు దీక్షలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.

English summary
former deputy cm Damadara Raja narsimha slams Telangana chief minister Kcr, He participated Vemulaghat villagers protest sabha on sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X