వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాట మారుస్తున్న నాయిని ... ఆ పదవి ఇచ్చినా చేస్తారట !!

|
Google Oneindia TeluguNews

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి మంత్రివర్గ విస్తరణ నేపధ్యంలో సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తనకు మంత్రిగా అవకాశం కల్పిస్తానని చెప్పి ఇచ్చిన మాట తప్పారని ఆయన మండిపడ్డారు. హోం మంత్రిగా చేసిన తాను ఆర్టీసీ చైర్మన్ వంటి చిన్న పదవి చేస్తానా అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయిన నాయిని నరసింహా రెడ్డి మాట మార్చారు. గులాబీ పార్టీ కి ఓనర్ నని చెప్పిన ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

ఆ కలెక్టర్ స్టైలే వేరు .. సైకిల్ పై ములుగు కలెక్టర్ .. పనితీరుతో ప్రజలు ఫిదాఆ కలెక్టర్ స్టైలే వేరు .. సైకిల్ పై ములుగు కలెక్టర్ .. పనితీరుతో ప్రజలు ఫిదా

ఇటీవల కేసీఆర్ మాట తప్పారని తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన నాయిని నరసింహారెడ్డి

ఇటీవల కేసీఆర్ మాట తప్పారని తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన నాయిని నరసింహారెడ్డి

మొన్నటికి మొన్న తాను కూడా గులాబీ పార్టీ ఓనర్ నేనని , కిరాయికి వచ్చిన వాళ్ళు ఎంతకాలం ఉంటారో చూస్తానని మంత్రులను ఉద్దేశించి చేసిన నాయిని నరసింహారెడ్డి వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు కారణం అయ్యాయి. ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం ఇస్తారని తాజాగా ప్రచారం జరుగుతున్న నేపద్యంలో తనకు ఏ కార్పోరేషన్ పదవి వద్దని నాయిని నర్సింహరెడ్డి తేల్చి చెప్పారు.హోం మంత్రి పదవి నిర్వహించిన తాను కార్పోరేషన్ ఛైర్మెన్ పదవిని చేస్తానా అని నాయిని నరసింహారెడ్డి ప్రశ్నించారు. కార్పోరేషన్ ఛైర్మెన్ పదవి ఎవరికి కావాలని ఆయన మండిపడ్డారు. అయితే ఇదంతా మీడియా సృష్టే అని నాయిని మరోమారు మాట మార్చి చెప్పారు.

 ఆర్టీసీ కార్పొరేషన్ పదవి ఇచ్చినా రసం వాళ్లే పోస్తారని మాట మార్చిన నాయిని నర్సింహారెడ్డి

ఆర్టీసీ కార్పొరేషన్ పదవి ఇచ్చినా రసం వాళ్లే పోస్తారని మాట మార్చిన నాయిని నర్సింహారెడ్డి

టీఆర్ఎస్ పార్టీ తమదేనని, అందులో ఉన్న పదవులు కూడా తమకే వస్తాయని మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో తాజాగా మీడియాలో వచ్చిన వార్తలపై తనను కేటీఆర్‌ ప్రశ్నించారని చెప్పిన ఆయన తాను మీడియాతో ఏదో చిన్నగా చిట్‌చాట్‌ చేస్తే చాలా పెద్ద వార్తగా రాశారని చెప్పారు. తాజాగా మంత్రి వర్గ విస్తరణ అనంతరం ఆయన ఆర్టీసీ ఆర్టీసీ కార్పొరేషన్‌ పదవిలో రసం లేదని వ్యాఖ్యానించారు. ఇక ఇప్పుడు మాట మార్చిన నాయిని ఇప్పుడు అదే ఆర్టీసీ కార్పొరేషన్ పదవి ఇచ్చినా రసం వాళ్లే పోస్తారని వ్యాఖ్యానించారు. తనని సీఎం పిలిస్తే వెళ్తానని మాట్లాడతానని నాయిని అన్నారు.ఇక ఆ పదవి ఇచ్చినా చేసేందుకు నాయిని సిద్ధం అయిపోయారు.

అసంతృప్తులను బుజ్జగించిన గులాబీ బాస్ .. రాజకీయాల్లో మాట తప్పటం, మాట మార్చటం కామన్

అసంతృప్తులను బుజ్జగించిన గులాబీ బాస్ .. రాజకీయాల్లో మాట తప్పటం, మాట మార్చటం కామన్

ఒక్క నాయిని మాత్రమే కాదు అసంతృప్తి వెళ్ళగక్కిన నేతలు అందరూ కేసీఆర్ ఏం చెప్తే అది శిరసావహిస్తామని , ఆయన అడుగుజాడల్లో నడుస్తామని చెప్పి ప్రకటనలు చేశారు. సోషల్‌ మీడియా వేదికగా తాను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్న వ్యక్తులపై అసహనం వ్యక్తం చేశారు. మొత్తానికి అసంతృప్తులను బుజ్జగించటంలో గులాబీబాస్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు . కానీ కేసీఆర్ మాట తప్పారని మండిపడిన నాయిని ఇప్పుడు మాట మార్చి సర్దుకుపోవటం చూస్తుంటే రాజకీయ నాయకులకు ఇదంతా కామన్ అని అనిపించకమానదు .

English summary
Former Home Minister Naini Narsimhareddy has expressed outrage over CM KCR in the wake of ministerial expansion. CM KCR said that he would give him a chance to become a minister. Narasimha Reddy has changed the tone of a rage that has made him a Home Minister and whether he will take up a small post like RTC chairman. His latest comments to the TRS party are now under discussion in political circles
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X