వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ ఋణం తీర్చుకోలేనన్న రాజయ్య .. నేను ఏ వ్యాఖ్యలు చెయ్యలేదన్న మాజీ మంత్రి

|
Google Oneindia TeluguNews

టిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి అని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే , మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇక ఈ విషయం పై క్లారిటీ ఇచ్చిన తాటికొండ రాజయ్య తాను అన్ని మాటలు అన్నట్టుగా మీడియాలో వక్రీకరించడం తనకు బాధ కలిగించిందని పేర్కొన్నారు. తాను కేసీఆర్ ,కేటీఆర్ ల నాయకత్వాన్ని బలపరుస్తున్నానని తెలంగాణకు తొలి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఇచ్చినా కేసీఆర్ కు ఎప్పటికీ కృతజ్ఞుడు గా ఉంటానని తెలిపారు.

 అజ్ఞాతం వీడిన యరపతినేని ..ఆ భూముల కోసమే నాపై కేసులు అని సంచలనం అజ్ఞాతం వీడిన యరపతినేని ..ఆ భూముల కోసమే నాపై కేసులు అని సంచలనం

 కెసిఆర్ తెలంగాణ రాజన్న గా తనను తీర్చిదిద్దారన్న రాజయ్య

కెసిఆర్ తెలంగాణ రాజన్న గా తనను తీర్చిదిద్దారన్న రాజయ్య

మీడియా అంటే తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పిన రాజయ్య తనను కెసిఆర్ తెలంగాణ రాజన్న గా తీర్చిదిద్దారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనను గుర్తించి తెలంగాణ కు తొలి ఉప ముఖ్యమంత్రి గా పని చేసే అవకాశమిచ్చారని , తాను ఆ విషయాన్ని ఎప్పటికీ మరిచిపోలేని చెప్పుకొచ్చారు. ఇక అంతే కాదు తనకు వైద్య వృత్తి ఇష్టమైనదని చెప్పి వైద్య శాఖకు నన్ను కెసిఆర్ మంత్రి ని చేయడం మరచిపోలేనన్నారు . తాను ఎమ్మెల్యేగా ఇన్ని సార్లు భారీ మెజారిటీ లతో గెలవడానికి కెసిఆర్ నే కారణం అన్న రాజయ్య ఎమ్మెల్యేగా తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు అని పేర్కొన్నారు.

 తమ సామాజిక వర్గానికి ఉన్నత పదవులు వస్తాయని ఆశిస్తున్నానన్న నాడు బర్తరఫ్ అయిన మంత్రి రాజయ్య

తమ సామాజిక వర్గానికి ఉన్నత పదవులు వస్తాయని ఆశిస్తున్నానన్న నాడు బర్తరఫ్ అయిన మంత్రి రాజయ్య

జడ్పీటీసీ ,ఎంపీటీసీ టికెట్ ల విషయంలో తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్లే 80 శాతం విజయాన్ని సాధించాను అంటూ ఆయన పేర్కొన్నారు. తమ సామాజిక వర్గానికి ఉన్నత పదవులు వస్తాయని ఆశిస్తున్నానని నాడు బర్తరఫ్ అయిన రాజయ్య పేర్కొన్నారు. కెసిఆర్ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తారని, ఇక కెసిఆర్ కి ఏమి ఇచ్చినా తన రుణం తీర్చుకోలేనని భావోద్వేగంతో మాట్లాడారు రాజయ్య. ఇక తన హోదాకు తగ్గట్టుగా తగిన పదవి ఇస్తామని కెసిఆర్ , కేటీఆర్ ను భరోసా ఇచ్చారని గుర్తు చేశారు.

మందా కృష్ణ మాదిగ కంటే నేను పెద్దవాడినే..ఓర్చుకున్న వారిదే వరంగల్ అన్న రాజయ్య

మందా కృష్ణ మాదిగ కంటే నేను పెద్దవాడినే..ఓర్చుకున్న వారిదే వరంగల్ అన్న రాజయ్య


మాదిగ లకు మంద కృష్ణ ఒక్కడే ప్రతినిధి కాదన్న రాజయ్య నేను అంతకన్నా పెద్ద వాడినే అంటూ చెప్పుకొచ్చారు. ఇక అంతే కాదు తాను కెసిఆర్ కు, టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తాను మాట్లాడినట్టు ఆడియోలు కానీ వీడియోలు కానీ ఎక్కడా లేవని పేర్కొన్నారు. ఓర్చుకున్న వారిదే వరంగల్ అని మా దగ్గర సామెత ఉంది .ఆ ఓర్పు కొనసాగిస్తే మంచిదనుకుంటున్నా అంటూ తన కెసిఆర్ కు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించనని ఆయన మాటల ద్వారా తేటతెల్లం చేశారు.
మొత్తానికి రాజయ్య సైతం ఈటెల , రసమయి , నాయిని బాటలో అని జరిగిన ప్రచారానికి రాజయ్య క్లారిటీ ఇచ్చి ఫుల్ స్టాప్ పెట్టారు.

English summary
Tatikonda Rajaiah said he was disturbed by the media distortion as he was saying all the words. He said that he was strengthening the leadership of KCR and KTR, said that given the opportunity to serve as the first Deputy Chief Minister of Telangana, he was forever grateful to KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X