వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రాణం తీసిన వేగం: మాజీ ఎమ్మెల్యే కుమారుడు సహా ఇద్దరు మృతి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

నల్గొండ: జిల్లాలోని కట్టంగూర్‌ మండలం ఎర్రసానిగూడెం స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్‌ కుమారుడు సహా ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

అక్కడికక్కడే మృతి..

అక్కడికక్కడే మృతి..

కొత్తగూడెం నుంచి జడ్చర్ల వైపు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న భద్రాద్రి- కొత్తగూడేనికి చెందిన వైద్యుడు మద్దికాయల విజయ్‌కుమార్‌ (55), ఆయన అత్త సావిత్రి భాయి (78) అక్కడికక్కడే మృతిచెందారు.

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

విజయ్‌కుమార్‌ భార్య, వైద్యురాలు ఝాన్సీ (55), మరో యువతి శోభ (18) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఝాన్సీ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు.

అతివేగమే..

అతివేగమే..

జడ్చర్లలో ఓ శుభకార్యానికి వెళుతుండగా ఈ ప్రమాదంచోటుచేసుకుంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

సహాయక చర్యల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వీరేశం

సహాయక చర్యల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వీరేశం

ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న నకిరేకల్‌ ఎమ్మెల్యే వీరేశం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. మృతదేహాలను నకిరేకల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
In a tragic road accident, Dr. Vijay Kumar, the son of the communist leader and ex-MLA of the Narasampet constituency in Warangal district M. Omkar, died, when their car hit into an oil tanker from behind in Kattangur mandal of Nalgonda district on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X