హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విదేశీ మద్యం అమ్మకాల్లో మాజీ ఎమ్మెల్సీ అరెస్ట్: దోపిడీ దొంగల ఆటకట్టు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అక్రమంగా విదేశీ మద్యాన్ని విక్రయిస్తున్న మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధాకృష్ణయ్య అలియా రాధయ్య సహా అతడికి సహకరిస్తున్న నలుగురిని ధూల్‌పేట ఎక్సైజ్‌ పోలీస్‌లు శనివారం అరెస్ట్‌చేశారు. వీరి నుంచి రూ.1.61కోట్ల విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ కమిషనర్‌ సి వివేకానందరెడ్డి ఈ మేరకు వివరాలను వెల్లడించారు.

నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధాకృష్ణయ్య గవర్నర్‌కోటాలో 2010లో ఎమ్మెల్సీగా నామినేట్‌ అయ్యారు. ఎమ్మెల్సీగా నామినేట్‌ కాకముందు సాఫల్య బేవరేజెస్‌, డిస్టిలరీస్‌పేరుతో ఒక కంపెనీ ప్రారంభించారు. ఉక్రెయిన్‌ నుంచి వోడ్కా, స్కాట్లాండ్‌ నుంచి విస్కీ దిగుమతి చేసుకుని దేశవ్యాప్తంగా విక్రయించాలనుకున్నారు.

2009 డిసెంబరులో 720పెట్టెల వోడ్కాను రూ.2కోట్లు చెల్లించి హైదరాబాద్‌కు తెప్పించుకున్నారు. కస్టమ్స్‌ అనుమతితో వాటిని బాలానగర్‌లోని ఓ గోదాంలో ఉంచారు. స్విస్కో లిమిటెడ్‌పేరుతో మరో ఏజెన్సీ ప్రారంభించి స్కాట్లాండ్‌ నుంచి 1250 పెట్టెల జామ్స్‌కింగ్‌, కాసిల్‌రాక్‌ విస్కీ తెప్పించారు. వీటిని కస్టమ్స్‌ గోదాంలోనే ఉంచారు. ఆ మద్యాన్ని వోడ్కాను విక్రయించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చున్నారు.

అమ్మకపుపన్ను, వ్యాట్‌, ఎక్సైజ్‌ అనుమతులతో పాటు ఇతరరాష్ట్రాల్లో అమ్మకాల కోసం పన్నులు చెల్లించేందుకు డబ్బు లేకపోవడంతో మద్యాన్ని గోదాముల్లోనే ఉంచారు. విక్రయించే స్తోమత లేకపోవడంతో తన ఏజెన్సీ పేరుమీదే ఎవరైనా సరే విక్రయించుకోవచ్చంటూ ఉపగుత్తేదారుల కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ బ్యాంకు నుంచి తెచ్చిన రుణానికి వాయిదాలు చెల్లించేందుకు డబ్బు లేకపోవడంతో వోడ్కా సీసాలు అమ్మేద్దామనుకున్నారు.

బాలానగర్‌లోని గోదాం నుంచి పెట్టెలను మౌలాలిలోని ఇంటికి తరలించి తన డ్రైవర్‌ సునీల్‌కుమార్‌ ద్వారా అమ్మేయడం మొదలుపెట్టారు. ఒక మద్యం సీసా రూ.1500ల నుంచి రూ.2వేల వరకూ విక్రయించి ఆ డబ్బుతో వాయిదాలు చెల్లిస్తున్నారు. పాత వోడ్కాకు గిరాకీ పెరగడంతో ఎవరైనా మార్కెటింగ్‌ చేసేవారుంటే డబ్బులొస్తాయని సునీల్‌కుమార్‌తో చెప్పగా.. మంగళ్‌హాట్‌లో ఉండే హర్మేందర్‌సింగ్‌, అభినయ్‌కుమార్‌లను డ్రైవర్‌ పరిచయం చేశాడు. వీరితోపాటు మహేశ్‌సింగ్‌ అనే మరోయువకుడు కలిశాడు.

గోదాం నుంచి మౌలాలికి మద్యం తెచ్చి ఆర్డర్‌ ఇచ్చినవారికి చేరవేస్తున్నారు. ఇలా 15నెలల వ్యవధిలో 265పెట్టెల వోడ్కాను విక్రయించి రూ.కోటి వరకూ సంపాదించుకున్నారు. విదేశీమద్యం విక్రయిస్తున్నారంటూ ఎక్సైజ్‌శాఖ అధికారులకు సమాచారం రావడంతో వారు నిఘా ఉంచారు. గురువారం సునీల్‌ను కారుతో సహా అదుపులోకి తీసుకున్నారు.

కారులోని 120 వోడ్కాసీసాలపై ప్రశ్నించగా.. రాధయ్యకు చెందినవని చెప్పగా ఎ.ఈ.ఎస్‌.నంద్యాల అంజిరెడ్డి తన బృందంతో మౌలాలికి వెళ్లారు. అక్కడ రాధయ్య ఇంట్లో 160మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో హర్మేందర్‌, అభినయ్‌లను అరెస్ట్‌చేశారు. విచారణ సందర్భంగా..రాధయ్యకు రక్తపోటు పెరగడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. మహేశ్‌సింగ్‌ పరారీలో ఉన్నారు. బాలానగర్‌ గోదాంలో ఉన్న 455 మద్యం పెట్టెలను స్వాధీనం చేసుకున్నామని వివేకానందరెడ్డి వివరించారు.

విదేశీ మద్యం

విదేశీ మద్యం

అక్రమంగా విదేశీ మద్యాన్ని విక్రయిస్తున్న మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధాకృష్ణయ్య అలియా రాధయ్య సహా అతడికి సహకరిస్తున్న నలుగురిని ధూల్‌పేట ఎక్సైజ్‌ పోలీస్‌లు శనివారం అరెస్ట్‌చేశారు.

విదేశీ మద్యం

విదేశీ మద్యం

వీరి నుంచి రూ.1.61కోట్ల విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ కమిషనర్‌ సి వివేకానందరెడ్డి ఈ మేరకు వివరాలను వెల్లడించారు.

విదేశీ మద్యం

విదేశీ మద్యం

నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధాకృష్ణయ్య గవర్నర్‌కోటాలో 2010లో ఎమ్మెల్సీగా నామినేట్‌ అయ్యారు.

విదేశీ మద్యం నిందితులు

విదేశీ మద్యం నిందితులు

ఎమ్మెల్సీగా నామినేట్‌ కాకముందు సాఫల్య బేవరేజెస్‌, డిస్టిలరీస్‌పేరుతో ఒక కంపెనీ ప్రారంభించారు. ఉక్రెయిన్‌ నుంచి వోడ్కా, స్కాట్లాండ్‌ నుంచి విస్కీ దిగుమతి చేసుకుని దేశవ్యాప్తంగా విక్రయించాలనుకున్నారు.

నిందితుడి ఫొటో ఇదే

నిందితుడి ఫొటో ఇదే

2009 డిసెంబరులో 720పెట్టెల వోడ్కాను రూ.2కోట్లు చెల్లించి హైదరాబాద్‌కు తెప్పించుకున్నారు. కస్టమ్స్‌ అనుమతితో వాటిని బాలానగర్‌లోని ఓ గోదాంలో ఉంచారు.

గొలుసు దొంగల అరెస్ట్

గొలుసు దొంగల అరెస్ట్

హైదరాబాద్ నగరంలో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న రెండు ముఠాలకు చెందిన నలుగురిని పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

గొలుసులు సీజ్

గొలుసులు సీజ్

91 తులాల బంగారు నగలు, 3 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

బైక్స్ స్వాధీనం

బైక్స్ స్వాధీనం

శనివారం టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ లింబారెడ్డి, వెస్ట్‌జోన్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజావెంకటరెడ్డిలు నిందితుల వివరాలు వెల్లడించారు. నిందితుల్లో కాచిగూడ చప్పల్‌బజార్‌కు చెందిన మొబైల్ మెకానిక్ మహ్మద్‌ మోసిన్‌ అలిషా అలియాస్‌ షరీఫ్‌ అలియాస్‌ మోసిన్‌(25), కోఠి ప్రాంతానికి చెందిన డిగ్రీ విద్యార్థి సయ్యద్‌ జమీల్‌ హుస్సేన్‌(19) ఉన్నారు.

దొంగల అరెస్ట్

దొంగల అరెస్ట్

విజయ్‌నగర్‌ కాలనీకి చెందిన ఖాజా ఫరీదుద్ధీన్‌(20) మొహిదీపట్నంలోను, జిర్రా ఆసిఫ్‌నగర్‌కు చెందిన ముస్తఫాఖాన్‌(20) జూపార్క్‌ సమీపంలోని కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. ఫరీదుద్దీన్‌పై పీడీ చట్టం నమోదై ఉంది.

సీజ్ చేసిన వస్తువులు

సీజ్ చేసిన వస్తువులు

గతంలో జైలు నుంచి బయటకు వచ్చిన ఇతను ముస్తఫాఖాన్‌తో జత కలిసి ఈనెల 8వతేదీ శ్రీనగర్‌కాలనీలో గొలుసు చోరీ చేశారు. గతంలో మరో రెండు గొలుసులు లాక్కెళ్లారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని టాస్క్‌పోర్స్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

సీజ్ చేసిన నగలు

సీజ్ చేసిన నగలు

వీరి నుంచి 13.1 తులాల బంగారం, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈనలుగురు దొంగలను సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగానే అరెస్టు చేశామని డీసీపీ లింబారెడ్డి తెలిపారు.

దొంగల అరెస్ట్

దొంగల అరెస్ట్

జంట నరాల్లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

సీజ్ చేసిన నగలు

సీజ్ చేసిన నగలు

నిందితులు రెండు నిందితులు రెండు బృందాలుగా ఏర్పడి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్టు వెల్లడించారు. వారి నుంచి 91 తులాల బంగారు ఆభరణాలు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

English summary
Former MLC Budati Radhakrishnaiah on Saturday arrested for illegal foreign liquor sale.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X