వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ ఎంపీ కవిత అభిమానుల ఆగ్రహం..! పీఏ పై పిడిగుద్దుల వర్షం..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఉరుము ఉరిమి మంగళం మీద పడడం అంటే ఇదే..! నిజామాబాద్ మాజీ ఎంపి కవితకు ఆమె అభిమానుల నుంచి విచిత్రమైన అనుభవం ఎదురైంది.కవిత పీ ఏ శరత్ పై ఆమె ఇంటికి వచ్చిన అభిమానుల్లో ఒకరు దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న మాదాపూర్ లోని కవిత ను కలవడానికి ఆమె అభిమానులు వచ్చారు. అక్కడే ఉన్న కవిత పీ ఏ శరత్ ను చూడగానే కోపోద్రిక్తులైన అభిమానులు వాదనకు దిగినట్టు తెలుస్తోంది.

బండ బూతులు తిడుతూ మీ ప్రవర్తనతో మా అక్క ఓటమికి కారకులైయ్యారు కదరా అంటూ ఓ అభిమాని పిడిగుద్దులు గుద్దారట.. తీవ్రంగా చితకబాదేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడ ఉన్న వారు వారించినట్టు సమాచారం. కవిత ఇంటి ముందే జరిగిన ఈ సంఘటన కవిత దృష్టికి వెల్లింది. కోపంతో ఊగిపోతున్న తన అభిమానులను లోపలికి పిలిచి కూర్చోబెట్టి మాజీ ఎంపీ కవిత సముదాయించినట్టు తెలుస్తోంది.

తాజా సమీకరణాలు..! ప్రాభల్యం కోల్పోయిన గులాబీ పార్టీ..!!తాజా సమీకరణాలు..! ప్రాభల్యం కోల్పోయిన గులాబీ పార్టీ..!!

Former MP Kavitha fans angry.! punches on PApa..!!

కాసేపటి తర్వాత బయటికి వచ్చిన అభిమానులు నవీనాచారీ కోసం ఎదురు చూశారట.. మా అక్క నవీనా చారీ ని ఎక్కువ నమ్మిందని వాడు అంతా తప్పుడు సమాచారం ఇస్తూ, ఎన్ ఆర్ ఐ ల దగ్గర ఐ ఫోన్ లు, ఎలక్ట్రానిక్, విలువైన వస్తువులకు ఆశపడి నిజమైన కార్యకర్తలను అక్కకు దూరం చేశాడని , వాడి పిచ్చి చేష్టల వల్ల కష్టకాలంలో అక్కతో ఉన్న వారు ఎంపీ అయ్యాక అక్కను విడిచి వెళ్ళారని తెలిపారు.

వాడు ఇక్కడికి వస్తే తన్నిపోదామని చాలా సేపు ఎదురు చూశారట... అతడు నివాసముండే బోయిన్ పల్లి కి వెల్లి తందామని అనుకున్నారట, కాని అక్క ఇంటి ముందే వాడిని తన్నాలని చాలాసేపు చూసి , ఆకలి కావడంతో వెళ్ళిపోయారట , అనంతరం శరత్ వాడుతున్న సిం కార్డును తీసుకొని ఇంకోసారి అక్క కవిత ఇంటి పరిసరాల్లోకి రావద్దని కవిత సిబ్బంది శరత్ ను ఇంటి నుంచి పంపించారన్న సమాచారం వైరల్ అవుతోంది.

English summary
The incident that led to one of the fans who came to Kalvakuntla Kavitha home.Yesterday afternoon, her fans came to meet Kavita in Madapur. Few of the fans who are angry at the sight of the Kavitha pa Sharat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X