వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత .. కరోనా కారణంగా తలెత్తిన అనారోగ్య సమస్యలతో మృతి

|
Google Oneindia TeluguNews

కరోనామహమ్మారి రాజకీయనేతల ఉసురు తీస్తోంది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన ఘటన మరువకముందే మాజీ ఎంపీ నంది ఎల్లయ్య నేడు కరోనా కారణంగా తలెత్తిన అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు .

78 ఏళ్ల నంది ఎల్లయ్య రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గం నుండి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు . జులై 29న కరోనా బారినపడి అనారోగ్యంతో నిమ్స్ లో చేరిన నంది ఎల్లయ్య కరోనాతో పోరాటం సాగించారు. కరోనా నెగిటివ్ రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నా కరోనా కారణంగా తలెత్తిన ఇతర అనారోగ్య సమస్యలతో పోరాడిన నంది ఎల్లయ్య చివరకు నేడు కన్నుమూశారు. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల్లో పనిచేసిన నంది ఎల్లయ్య టిపిసిసి ఉపాధ్యక్షుడుగా కూడా పని చేశారు.నంది ఎల్లయ్య ఇప్పటివరకు ఐదు సార్లు లోక్ సభ సభ్యుడిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు.

Former MP Nandi yellaiah died due to health problems with corona affect

Recommended Video

ప్రజా వాగ్గేయకారుడు వంగపండు మృతికి CM Jagan సహా సంతాపాన్ని తెలిపిన పలువురు రాజకీయ ప్రముఖులు !

2014 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి మంద జగన్నాథం ను ఓడించి 16వ లోక్సభకు ఎన్నికయ్యారు. ఐదు సార్లు లోక్ సభలో ప్రాతినిధ్యం వహించారు. రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిన నేతగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది .గత ఎన్నికల్లో కూడా పార్టీ కోసం కీలకంగా పనిచేశారు నంది ఎల్లయ్య. నంది ఎల్లయ్య మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

English summary
Former MP Nandi yellaiah died with health issues with the affect of covid 19 .Nandi yellaiah has been a member of the Lok Sabha five times and a member of the Rajya Sabha twice. He worked in Congress party .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X