వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేగంగా మారుతున్న తెలంగాణ రాజకీయ పరిణామాలు..! అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరిన వివేక్‌..!!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్ :తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శర వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్, టీడిపి ముఖ్యనేతలంతా తమకు అనుకూల పార్టీలోకి మారిపోయారు. తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల తర్వాత రాజకీయ ముఖచిత్రం ఒక్క సారిగా మారొపోయినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ నాలుగు స్థానాల్లో గెలవడంతో భవిష్యత్ రాజకీయాలపై భారీ ఎత్తున అంచనాలు పెట్టుకుంది బీజేపీ. అందుకు తగ్గట్టే ఇప్పటినుండే పావులు కదుపుతోంది బీజేపీ.

తెలంగాణ లోని టీడిపి, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నుండి బలమైన నేతలను బీజేపిలో చేర్చుకునేందుకు చురుగ్గా పావులు కదుపుతోంది. 2024సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపి అదికారంలోకి రావడాపనికి వ్యూహాత్యకంగా అడుగులు వేస్తోంది. అంతుకోసం బలమైన నేతలకు గాలం వేస్తోంది బీజేపి. మోదీ అమిత్ షా తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సాద్యమైనంత వరకు ఎక్కువ మంది నేతలను పార్టీలో చేర్చుకోవడమే బీజేపి లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం.

Former MP Vivek Joins BJP In Presence Of Amit Shah..!

తెలంగాణలో అదికార గులాబీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. పార్టీ బలోపేతంగా కనిపిస్తున్నప్పటికి భారతీయ జనతా పార్టీ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇందులో బాగంగా ముఖ్యనేతలు తమ పార్టీలో చేర్చుకుని అదికార పార్టీని నిర్వీర్యం చేసేందుకు పావులు కదుపుతోంది బీజేపి. కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలో మాజీ ఎంపీ జి.వివేక్‌ శుక్రవారం కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో ఆయన బీజేపీలో చేరారు. కాగా టీఆర్‌ఎస్‌ను వీడిన అనంతరం వివేక్‌...

బీజేపీలో చేరతారా? కాంగ్రెస్‌లో చేరతారా? అన్న గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ గందరగోళానికి ఆయన ఎట్టకేలకు తెరదించారు. కాగా కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరిక సాంకేతిక కారణాలతో ఆగిపోయిందని, కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి కూడా తమ పార్టీలోకి రావాల్సిన వారేనని, దారి తప్పి అటు వెళ్లారని బీజేపీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించడం ఆసక్తి రేపుతోంది.

English summary
Former MP G Vivek on Friday covered the saffron scarf in the presence of Amit Shah. He joined the BJP under the aegis of Union Assistant Minister Kishan Reddy, Telangana State president Laxman, BJP national general secretary Ram Madhav and MP Dharmapuri Arvind. And after the TRS, Vivek... Join BJP? Join the Congress? There is a confusion. He was finally open to that dilemma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X