హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంగీత కేసులో ట్విస్ట్: ఎంపీ వెళ్లగానే అరెస్ట్, ప్రశ్నలెన్నో, హోటల్లో సెటిల్మెంట్ యత్నం

భార్య సంగీతను కొట్టిన మాజీ టీఆర్ఎస్ యువనేత శ్రీనివాస్ రెడ్డి కేసులో నిందితుడి తల్లిదండ్రులు బాల్ రెడ్డి, ఐలమ్మ, సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. వారి అరెస్టుకు ముందు హైడ్రామా చోటు చేసుకుంది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

సంగీత కేసు : ఎన్నో అనుమానాలు, ఎంపీ మల్లారెడ్డి వ్యాఖ్యలపై వాగ్వాదం

హైదరాబాద్: భార్య సంగీతను కొట్టిన మాజీ టీఆర్ఎస్ యువనేత శ్రీనివాస్ రెడ్డి కేసులో నిందితుడి తల్లిదండ్రులు బాల్ రెడ్డి, ఐలమ్మ, సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. వారి అరెస్టుకు ముందు హైడ్రామా చోటు చేసుకుంది.

మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి బోడుప్పల్‌లోని ఓ హోటల్లో ఇరు కుటుంబాలకు రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఇరు కుటుంబాల బంధువులతో సమావేశమయ్యారు. చర్చలు ఫలించకపోవడంతో సంగీత వద్దకు వెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

చదవండి: సంగీత అత్తమామలు, మరిది అరెస్ట్: హోటల్లో ఎంపీ మల్లారెడ్డి రాజీయత్నం

చదవండి: సంగీత కేసులో ట్విస్ట్: రూ.3 కోట్లు డిమాండ్ చేసిందని ఆరోపణలు

ఎంపీ హామీ ఇచ్చిన గంటల్లో అరెస్ట్

ఎంపీ హామీ ఇచ్చిన గంటల్లో అరెస్ట్

సంగీతకు మహిళా సంఘాలు, తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం తదితరులు మద్దతు పలికారు. సంగీత ఆందోళన బుధవారానికి నాలుగో రోజుకు చేరుకుంది. అయితే ఎంపీ మల్లా రెడ్డి తనకు హామీ ఇచ్చి వెళ్లిన గంటల్లోనే అత్తామామలను అరెస్టు చేయడంపై సంగీత, మహిళా సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

మీడియా ఎదుట మాట్లాడుతానని సంగీత

మీడియా ఎదుట మాట్లాడుతానని సంగీత

అత్తమామ, మరిది అరెస్ట్ విషయం తెలిసి సంగీత స్పందించారు. తాను మీడియా ముఖంగా వారితో మాట్లాడాలనుకున్నానని, వారిని తన ముందుకు తీసుకు రావాలని డిమాండ్ చేశారు. కానీ వారు ఇప్పుడు అరెస్టయితే, కోర్టులో ప్రవేశపెడితే మాట్లాడటానికి వీలు కాదని చెప్పారు.

మల్లారెడ్డి ఏం చేయలేక వెళ్లిపోయారు, అరెస్ట్ వెనుక

మల్లారెడ్డి ఏం చేయలేక వెళ్లిపోయారు, అరెస్ట్ వెనుక

ఇదిలా ఉండగా ఎంపీ మల్లారెడ్డి వెళ్లిన కాసేపటికి అరెస్టు కావడంపై మహిళా సంఘాలు అనుమానం వ్యక్తం చేశాయి. తొలుత మల్లా రెడ్డి స్టార్ హోటల్లో రాజీ కుదిర్చే ప్రయత్నం చేశాడని, అది కుదరక సంగీత వద్దకు వచ్చి నచ్చచెప్పే ప్రయత్నం చేసారని, కానీ తాము గట్టిగా నిలదీయడంతో, అలాగే, అత్తామామల అరెస్టు, తనకు న్యాయం కోసం సంగీత గట్టిగా అడగడంతో మల్లారెడ్డి ఏం చేయలేక వెళ్లిపోయాడని ఆరోపించారు. సంగీత అత్తామామలను తన వద్దకు తీసుకు రమ్మంటే ఈ సమయంలో ఎందుకు అరెస్టు చేయించారని ప్రశ్నించారు. అంటే ఈ సమయంలో అరెస్టు చేయిస్తే, ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్తారని, సంగీతతో మాట్లాడనీయకుండా చేసేందుకే అలా చేశారని వాపోయారు. డీజీపీ, మీడియా సమక్షంలో వారితో సంగీతను మాట్లాడేందుకు అవకాశమివ్వాలన్నారు. లేదంటే తమ నిరసనకు ఫలితం లేదన్నారు.

సంగీత ఏం డిమాండ్ చేస్తోంది

సంగీత ఏం డిమాండ్ చేస్తోంది

పోలీసులది ఏముందని, అధికార పార్టీ వారు చేయిస్తున్నట్లుగా ఉందని మహిళా సంఘాలు ఆరోపించాయి. అత్తమామల అరెస్టుతో సంగీత ఓ మెట్టు మాత్రమే ఎక్కారని, కానీ జరగాల్సింది ఎంతో ఉందన్నారు. సంగీత తన హక్కులు, తన బిడ్డ హక్కుల కోసం, రక్షణ కోసం డిమాండ్ చేస్తోందని గుర్తు చేశారు.

కేసీఆర్ ఖబడ్దార్, ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరిక

కేసీఆర్ ఖబడ్దార్, ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరిక

అసలు వారు మల్కాజిగిరిలో ఎలా అరెస్టయ్యారని మహిళా సంఘాలు ప్రశ్నించాయి. ఇదంతా డ్రామాలాగా కనిపిస్తోందన్నారు. మల్లారెడ్డి, తెరాస నాయకులపై వారు మండిపడ్డారు. ఓ సమయంలో కేసీఆర్ ఖబడ్దార్, ప్రగతి భవన్ ముట్టడిస్తామంటూ ఆగ్రహించారు. సంగీతకు న్యాయం జరగకుంటే కిరోసిన్ పోసుకొని తమను తామే తగులబెట్టుకుంటామన్నారు. శబరిమల వెళ్ళారని, ఈ రోజే వచ్చారని చెబుతూ నాటకాలు ఆడుతున్నారన్నారు. ఎవరి వల్లా కాకుంటే మంత్రి కేటీఆర్ రావాలని వారు డిమాండ్ చేశారు.

సెటిల్మెంట్ చేద్దామనుకున్నారు కానీ

సెటిల్మెంట్ చేద్దామనుకున్నారు కానీ

ప్రతి రోజు చాలామంది వచ్చి సంగీతకు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. సెటిల్మెంట్ చేద్దామని అనుకున్నారని, కానీ కుదరలేదని, సంగీత సోదరుడిని కూడా తీసుకెళ్లారని, అతను లొంగలేదని, తర్వాత సంగీత వద్దకు వచ్చి బుజ్జగించారని, ఇక్కడా తగ్గకపోవడంతో మల్లారెడ్డి వెళ్లిపోయారన్నారు.

స్టార్ హోటల్లో మంతనాలు

స్టార్ హోటల్లో మంతనాలు

సెటిల్మెంట్ కోసం స్టార్ హోటల్లో మంతనాలు జరిపారని, నిందితుడి బావమరిది, అల్లుడు వచ్చారని తెలిసిందని, ఈ విషయం తనకు తెలిసి తాను అక్కడి పోలీసు అధికారిని నిలదీశానని ఓ మహిళా సంఘం నాయకురాలు చెప్పారు. పోలీసు అధికారి మహేష్ భాగవత్ మాట్లాడుతూ సంగీత రూ.3 కోట్లు డిమాండ్ చేసిందని చెబుతున్నారని, ఆమెపై ఆరోపణలు సరికాదన్నారు.

మరెందరి ఆడవారి జీవితాలతో ఆడుకున్నాడో

మరెందరి ఆడవారి జీవితాలతో ఆడుకున్నాడో

నిందితుడు శ్రీనివాస్ రెడ్డి పైనా వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనకు తెలిసి ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకున్నాడని, తెలియకుండా ఇంకా ఎన్ని చేశాడోనని, ఎంతమంది ఆడవారి జీవితాలతో ఆడుకున్నాడోనని మండిపడ్డారు. అతని తల్లి తమ ముందుకు వస్తే.. ఓ తల్లిగా కొడుకును ఇలాగే పెంచావా అని నిలదీస్తామన్నారు.

సంగీత మాట్లాడుతూ

సంగీత మాట్లాడుతూ

సంగీత మాట్లాడుతూ.. తన తమ్ముడిని, తన తల్లిని చంపేస్తానని బెదిరించారని వాపోయారు. మల్కాజిగిరి ఎంపీ వచ్చారని, తనకు హామీ ఇచ్చారన్నారు. కానీ ఆయన వెళ్లిన కాసేపటికే వారు మల్కాజిగిరిలో ఎలా అరెస్టయ్యారని ప్రశ్నించారు. నాలుగు రోజులుగా దొరకని వారు ఎంపీ వచ్చి వెళ్లగానే ఎలా దొరికారని ప్రశ్నించారు. అదే సమయంలో తాను ఆధారాలు లేకుండా ఎవరినీ నిందించదల్చుకోలేదని చెప్పారు.

చదవండి: మాజీ టీఆర్ఎస్ నేత ఇష్యూ: 'సంగీత ప్లాన్ ప్రకారమే వచ్చింది, సంపాదించిందేం లేదు'

చదవండి: రిలేషన్‌షిప్ వదిలేస్తా, 20ఏళ్ళ యువతివల్లే చిచ్చు: భార్యని కొట్టిన టీఆర్ఎస్ నేత కేసులో ట్విస్ట్‌లు

చదవండి: టీఆర్ఎస్ నేత లీలలు: సంగీతకు మూడో యువతి పేరెంట్స్ అండ, 'కూతురిని లోబర్చుకున్నాడు'

English summary
Sangeetha Protest Reaches 4th Day on Wednesday in former TRS leader Srinivas Reddy's case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X