హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇందిర, రాజీవ్‌లకు అత్యంత సన్నిహితుడైన మాజీ కేంద్రమంత్రి మృతి

కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ సోమవారం ఉదయం కన్నుమూశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 52లోని స్వగృహంలో ఆయన మృతదేహాన్ని సందర్శనార్థం ఉంచారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ సోమవారం ఉదయం కన్నుమూశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 52లోని స్వగృహంలో ఆయన మృతదేహాన్ని సందర్శనార్థం ఉంచారు.

శివశంకర్.. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ కేబినెట్లో కేంద్రమంత్రిగా పని చేశారు. ఆయన 1929 ఆగస్టు 10న జన్మించారు. తొలి నుంచి 2008 వరకు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. తర్వాత 2008-11 మధ్యలో ఆయన ప్రజారాజ్యంలో ఉన్నారు.

Former Union Minister Shiv Shankar dies

అనంతరం తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, న్యాయశాఖ, పెట్రోలియం శాఖ మంత్రిగా ఆయన విధులు నిర్వహించారు. ఇందిర, రాజీవ్‌లకు శివశంకర్‌ అత్యంత సన్నిహితుడిగా చలామణి అయ్యారు. ఆయన సిక్కిం, కేరళ రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.

శివశంకర్ మృతికి తెలుగు రాష్ట్రాల నేతలు సంతాపం తెలిపారు. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, వైసిపి అధినేత వైయస్ జగన్, కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య తదితరులు సంతాపం తెలిపారు.

English summary
Former Union Minister Shiv Shankar dead on Monday morning in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X