వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు షాక్: టిఆర్ఎస్‌లోకి ఉమా మాధవరెడ్డి, కొడుకు కోసమేనా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి, ఆమె తనయుడు సందీప్‌రెడ్డి డిసెంబర్ 14వ, తేదిన టిఆర్ఎస్‌లో చేరనున్నారు.అయితే స్థానికంగా ఉన్న పరిస్థితులతో పాటు కుటుంబ కారణాల రీత్యా ఉమా మాధవరెడ్డి టిఆర్ఎస్‌లో చేరలేదనే ప్రచారం కూడ సాగుతోంది.

ఉమా మాధవరెడ్డిని టిడిపి నుండి టిఆర్ఎస్‌లో చేరాలని చాలా కాలం నుండి పిలుపు వస్తోంది. అయితే ఆమె మాత్రం టిడిపిని వీడలేదు. దీనికి చాలా కారణాలున్నాయని చెబుతున్నారు ఆమె సన్నిహితులు.

2014 ఎన్నికల సమయంలో కూడ ఉమా మాధవరెడ్డిని టిఆర్ఎస్‌లో చేరాలని కోరాలని పిలుపు వచ్చింది. స్వయంగా ఈ విషయాన్ని ఉమా మాధవరెడ్డి ప్రకటించారు. కానీ, ఆమె మాత్రం టిడిపి తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆమె పోటీ చేసిన తర్వాత ఓడిపోవడం ఇదే తొలిసారి.

ఉమా మాధవరెడ్డి: 'టిఆర్ఎస్‌కు నో చెప్పడానికి కారణమిదే, ఆలోచిస్తా' ఉమా మాధవరెడ్డి: 'టిఆర్ఎస్‌కు నో చెప్పడానికి కారణమిదే, ఆలోచిస్తా'

టిడిపిని ఎందుకు వీడలేదంటే

టిడిపిని ఎందుకు వీడలేదంటే

చాలా కాలం నుండి టిఆర్ఎస్ లో చేరాలని ఉమా మాధవరెడ్డికి ఆహ్వనాలు వస్తున్నాయి. అయితే ఆమె మాత్రం టిడిపిని వీడలేదు. అయితే ఎలిమినేటి మాధవరెడ్డి మరణించిన తర్వాత ఉమా మాధవరెడ్డి రాజకీయాల్లోకి రావాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఎలిమినేటి మాధవరెడ్డి సోదరుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి కూడ తొలుత టిడిపితో సంబంధాలు కొనసాగించేవాడు. అయితే టిఆర్ఎస్ ఏర్పాటైన కొంతకాలానికి ఎలిమినేటి కృష్ణారెడ్డి టిఆర్ఎస్‌లో చేరారు. అయితే కృష్ణారెడ్డి ఆ సమయంలో టిడిపిపై విమర్శలు గుప్పించారు. ఈ రెండు కుటుంబాల మధ్య కూడ సంబంధాలు దెబ్బతిన్నాయనే ప్రచారం కూడ అప్పట్లో సాగింది. ఈ కారణాలతోనే ఉమా మాధవరెడ్డి టిడిపిని వీడలేదంటారు.

మోత్కుపల్లి, ఉమా మాధవరెడ్డి వర్గాల పోరు

మోత్కుపల్లి, ఉమా మాధవరెడ్డి వర్గాల పోరు

నల్గొండ జిల్లాలో చాలా కాలంగా మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహ్ములు, ఉమా మాధవరెడ్డి వర్గాల మధ్య అంతర్గతంగా పోరు సాగింది.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలో ఉన్న కాలం నుండి కొంత కాలం పాటు ఈ రెండు గ్రూపుల మధ్య కొంతకాలంపాటు మాత్రమే సయోధ్య ఉంది. కానీ, ఆ తర్వాత రెండు గ్రూపుల మధ్య ఆధిపత్యపోరు సాగింది. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి టిడిపిలో ఉన్న కాలంలో ఆయనన్ను దెబ్బతీసేందుకు ఈ రెండు గ్రూపులు వ్యూహత్మకంగా కలిసి పనిచేశారనే ప్రచారం కూడ లేకపోలేదు.

ప్రత్యామ్నాయం లేకనే

ప్రత్యామ్నాయం లేకనే

తెలంగాణలో టిడిపికి రాజకీయంగా భవిష్యత్తు లేదనే ఉద్దేశ్యంతోనే ఉమా మాధవరెడ్డి టిడిపిని వీడాలని నిర్ణయం తీసుకొన్నారని అంటున్నారు.. అయితే కాంగ్రెస్ పార్టీలో కూడ ఉమా మాధవరెడ్డి చేరుతారనే ప్రచారం కూడ సాగింది. కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉమా మాధవరెడ్డి చేరకపోవడానికి కాంగ్రెస్ పార్టీ నుండి స్పష్టమైన హమీ రాకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఉమా మాధవరెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుండి స్పష్టమైన హమీ వస్తే తాను కూడ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరేదాణ్ణని ఉమా మాధవరెడ్డి ప్రకటించారు.

ఉమా మాధవరెడ్డి ఎక్కడి నుండి పోటీ చేస్తారు

ఉమా మాధవరెడ్డి ఎక్కడి నుండి పోటీ చేస్తారు

భువనగిరి అసెంబ్లీ స్థానం నుండి ప్రస్తుతం పైళ్ళ శేఖర్ రెడ్డి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే టిఆర్ఎస్‌లో ఉమా మాధవరెడ్డి టిఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకొన్నారని ప్రచారం సాగుతోంది. అయితే పైళ్ళ శేఖర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. శేఖర్ రెడ్డిని కాదని ఉమా మాధవరెడ్డికి టిఆర్ఎస్ టిక్కెట్టు దక్కుతోందా అనే విషయాలపై చర్చ సాగుతోంది.కానీ, ఈ విషయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని టిఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

కొడుకు సందీప్ రాజకీయ భవితవ్యం కోసమేనా

కొడుకు సందీప్ రాజకీయ భవితవ్యం కోసమేనా


తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా సందీప్ రెడ్డిని బరిలోకి దింపాలని ఉమా మాధవరెడ్డి భావిస్తున్నారు. అయితే ఇప్పటికే టిడిపి భువనగిరి జిల్లా అధ్యక్షుడుగా సందీప్ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే ఎలిమినేటి మాధవరెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు గాను టిడిపిలో కొనసాగితే రాజకీయ మనుగడ కష్టమని ఉమా మాధవరెడ్డి భావించారు. ఈ మేరకు ఆమె టిఆర్ఎస్ ను ఎంచుకొన్నారు. ఈ మేరకు సీఎం కెసిఆర్ తో రాజకీయ భవిష్యత్ పై చర్చించారు.

English summary
senior TDP leader and ex-minister A. Uma Madhava Reddy is all set to join TRS. Wife of the late former Home Minister A. Madhava Reddy, Uma is believed to have decided to join TRS mainly for the political future of her son Sandeep Reddy after her parent party TDP was disintegrated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X