వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘రైతు దత్తత’కు ముందుకొచ్చిన ఫీనిక్స్: రూ. 5లక్షల విరాళం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ జాగృతి చేపట్టిన కార్యక్రమం ‘ఈచ్‌వన్-అడాప్ట్' వన్‌కు విశేష స్పందన లభిస్తోంది. రైతు కుటుంబాల్ని దత్తత తీసుకునేందుకు స్పందించాలంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపి కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపునకు స్పందించి అనేక మంది దాతలు ముందుకొస్తున్నారు.

తాజాగా ఫీనిక్స్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గోపీకృష్ణ స్పందించారు. డైరెక్టర్ చుక్కపల్లి అవినాశ్‌, ఎంఎస్ రావులతో కలిసి మంగళవారం జాగృతి అధ్యక్షురాలు కవితను ఆమె నివాసంలో కలిసి రూ.5 లక్షల చెక్కును అందించారు.

Forum donates Rs 5 lakh for farmers' cause

కాగా, ఎంపీ కవిత ఫీనిక్స్ ప్రతినిధులను అభినందించారు. ప్రముఖ వ్యక్తులు, సంస్థలు రైతు కుటుంబాలను ఆదుకునేందుకుగాను తమను సంప్రదిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ఇప్పటికే పలువురు క్రీడా రంగ ప్రముఖులు, ఎన్నారైలు, వివిధ దేశాల జాగృతి విభాగాల సభ్యులు ఉదారంగా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

English summary
Phoenix Foundation on Tuesday donated Rs 5 lakh for the cause of farmers following a call given by Telangana Jagruti president and Nizamabad MP K Kavitha. Phoenix Foundation MD Gopi Krishna, directors Ch Avinash, M S Rao handed over the cheque of Rs 5 lakh to Telangana Jagruti president K Kavitha at her residence here on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X