హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైటెక్ సిటీలో 25 అడుగుల లోతు మ్యాన్‌హోల్లో నల్గురు మృతి (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని హైటెక్ సిటీ అయ్యప్పసొసైటీ సమీపంలో శనివారం సాయంత్రం విషాద సంఘటన జరిగింది. అయ్యప్ప సొసైటీలోని 100ఫీట్ రోడ్డులో మ్యాన్ హోల్‌‌లోకి దిగిన కార్మికులు అందులో చిక్కుకుపోయారు. ఆ మ్యాన్ హోల్ 25అడుగుల లోతులో ఉంది.

ఇద్దరు కార్మికులు కార్మికులు చిక్కుకుపోవడంతో వారిని రక్షించేందుకు వెళ్లిన ఇద్దరు స్థానికులు అందులో పడిపోయారు. హోల్‌‌లో పడినవారిలో 108 సిబ్బందికి చెందిన ఒకతను ఉన్నట్లు సమాచారం. విషవాయువులు వెలువడటంతో నలుగురు మరణించినట్లు తెలుస్తోంది.

స్థానిక సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికి వారి వల్ల కావట్లేదు. దీంతో బోరు బావిలో చిన్నపిల్లలు పడిపోతే ఎలాగైతే బయటికి తీసేందుకు ప్రొక్లైన్లతో, జేసీబీలతో హోల్ చుట్టుప్రక్కలా తవ్వుతున్నారు.

నలుగురి ప్రాణాలు తీసిన మ్యాన్ హోల్

నలుగురి ప్రాణాలు తీసిన మ్యాన్ హోల్

మ్యాన్‌హోల్‌ నాలుగు నిండు ప్రాణాలు బలితీసుకున్న ఘటన హైదరాబాద్‌లోని అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో శనివారం జరిగింది.

నలుగురి ప్రాణాలు తీసిన మ్యాన్ హోల్

నలుగురి ప్రాణాలు తీసిన మ్యాన్ హోల్

అయ్యప్పసొసైటీ ప్రాంతంలో మురుగునీటి వ్యవస్థను ఆధునికీకరించాలని జలమండలి నిర్ణయించింది.

నలుగురి ప్రాణాలు తీసిన మ్యాన్ హోల్

నలుగురి ప్రాణాలు తీసిన మ్యాన్ హోల్

కొత్త మురుగు వ్యవస్థ అనుసంధానంలో భాగంగా..శనివారం ఓ గోడను పగులగొట్టాలని గుత్తేదారు సంస్థ నిర్ణయించింది.

నలుగురి ప్రాణాలు తీసిన మ్యాన్ హోల్

నలుగురి ప్రాణాలు తీసిన మ్యాన్ హోల్

నిజానికి మ్యాన్‌హోల్‌ లోపలికి మనుషుల్ని దింపే క్రమంలో.. అందులో విష వాయువులున్నాయా? లేదా? అన్నది పరీక్షించాల్సి ఉంది.

నలుగురి ప్రాణాలు తీసిన మ్యాన్ హోల్

నలుగురి ప్రాణాలు తీసిన మ్యాన్ హోల్

ఇలాంటివేమీ చేయకుండానే గుత్తేదారు ఓయూ మాణికేశ్వరినగర్‌కు చెందిన కార్మికులు వర్సు నగేశ్‌(35), పల్లపు సత్యనారాయణ(42), పల్లపు శ్రీనివాస్‌(40)లను పనుల కోసం పురమాయించాడు.

నలుగురి ప్రాణాలు తీసిన మ్యాన్ హోల్

నలుగురి ప్రాణాలు తీసిన మ్యాన్ హోల్

తొలుత నగేష్‌ గుంతలో దిగి అందులో చిక్కుకున్నాడు. అతన్ని రక్షించాలన్న ఆతృతలో సత్యనారాయణ, అటు తర్వాత శ్రీనివాస్‌లు లోపలికి దిగి ఇరుక్కుపోయారు.

నలుగురి ప్రాణాలు తీసిన మ్యాన్ హోల్

నలుగురి ప్రాణాలు తీసిన మ్యాన్ హోల్

ఊపిరాడక ‘కాపాడాలంటూ' ఆర్తనాదాలు చేశారు. కాపాడే వాళ్లు లేక, విషవాయుల ప్రభావంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

నలుగురి ప్రాణాలు తీసిన మ్యాన్ హోల్

నలుగురి ప్రాణాలు తీసిన మ్యాన్ హోల్

ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న కర్నూలు ప్రాంతానికి చెందిన కారు చోదకుడు గంగాధర్‌(35).. కార్మికులను రక్షించేందుకు అందులోకి దిగి అక్కడే ప్రాణాలు వదిలాడు.

సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ మేయర్, ఉన్నతాధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతుల్లో శ్రీనివాస్‌, సత్యనారాయణ, నగేష్‌ ఉన్నట్లు తెలుస్తోంది. వారు సికింద్రాబాదులోని తార్నాకాకు చెందినవారని అంటున్నారు. గతంలోకూడా ఇలాంటి ఘటనలు ఇదే ప్రాంతంలో జరిగాయి.

అనేక సముద్రాల నుంచి, పరిశ్రమల నుంచి వ్యర్థాలు ఈ డంపింగ్‌‌కు వస్తాయి. దాంతో శుభ్రం చేసేందుకు కార్మికులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. తగిన జాగ్రత్త చర్యలు తీసుకుని శుద్ధి చేయాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి వసతులు, సౌకర్యాలు, వస్తువులు లేకపోవడంతో దాంట్లోకి దిగడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.

English summary
Four dead in a manhole at Ayyappa society in Hitech of Hyderabad. The manhole depth is about 25 feet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X