వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్య, భర్త, కూతురు, తాతా .. డెంగీకి ఒకే కుటుంబంలో నలుగురు బలి

|
Google Oneindia TeluguNews

డెంగీ ఒకే కుటుంబాన్ని పగపట్టింది. ఒకే కుటుంబంలోని నలుగురుని బలి తీసుకుంది. పదిహేను రోజుల తేడాలోనే చిన్నపాపతో సహ నలుగురు మృతి చెందిన సంఘటన కలకలం రేపుతోంది. ఆరునెలల చిన్న పాప నుండి 70 సంవత్సరాల తాత మరియు ఇద్దరు భార్యభర్తలు మృతి చెందారు. కొద్ది రోజుల క్రితమే ఓకే కుటుంబంలోని బిడ్డ, భర్తతోపాటు మామ కూడ మృతి చెందగా తాజాగా డెంగ్యూకు గురైన మహిళ మరోపాపకు జన్మనిచ్చి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. డెంగీ వ్యాధి మొత్తం మూడు తరాల వారిని మింగడంతో మృతుల కుటుంబసభ్యులు గ్రామస్తులు శోకసముద్రంలో మునిగిపోయారు.

డెంగీతో మరణాలకు క్యూ కట్టిన కుటుంబం

డెంగీతో మరణాలకు క్యూ కట్టిన కుటుంబం

మంచిర్యాల జిల్లా శ్రీనగర్ కాలనీకి చెందిన గుడిమల్ల రాజగట్టు అనే ముప్పయి సంవత్సరాల వ్యక్తి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. అయితే ఆయన ఇటివల డెంగీకి గురి కావడంతో కరీంనగర్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 16న మృతి చెందాడు. అప్పటికే ఇంట్లో విషాదం నిండుకుంది. అయితే రాజు దినకర్మ పూర్తికాక ముందే రాజగట్టు తాతా లింగయ్య కూడ డెంగ్యూ వ్యాధిన పడి మృతి చెందాడు. ఇక తాత మరణించిన అయిదు రోజులకే ఆరునెలల వయస్సున్న రాజగట్టు కుమార్తే సైతం దిపావళీ రోజున మృత్యువాత పడింది.

బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి

బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి

ఇప్పటికే మూడు తరాల వారిని మింగిన డెంగీ వ్యాధి రాజగట్టు భార్య అయిన సోనికి సైతం సోకింది. అయితే సోని అప్పటికే తొమ్మిది నెలల గర్భవతి . దీంతో గ్రామస్తులు మరియు ఇతర కుటుంబ సభ్యులు సోనినైనా కాపాడుకునేందుకు ప్రయత్నం చేశారు. మెరుగైన చికిత్స కోసం ఆమేను హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మృత్యువు ఆమేను కూడ వదిలి పెట్టలేదు. యశోదలో చికిత్స పొందుతున్న సోని మంగళవారం మగబిడ్డకు జన్మనిచ్చి, తన బిడ్డను తనివి తీరా చూసుకోక ముందే తాను సైతం బుధవారం సాయంత్రం ప్రాణాలు విడిచింది. ఇలా పదిహేను రోజుల్లోనే ఓకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తలు చనిపోవడంతో అంత్యంత విషాదంగా మారింది.

డెంగీపై హైకోర్టు సీరియస్

డెంగీపై హైకోర్టు సీరియస్

కాగా డెంగీపై ఇటివల రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే.. ఏకంగా రాష్ట్ర సీఎస్ తో పాటు ఇతర ఐఏఎస్ అధికారులకు కోర్టు మొట్టికాయలు వేసింది. దీంతో సీఎస్ స్వయంగా డెంగీపై సమీక్షను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ వ్యాధితో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. సరైన బెడ్స్ లేక ఆరుబయటే చికిత్సలు అందిస్తున్న వైనం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది.

English summary
Four of the same family were killed by Dengue. within fifteen days four member lost thair lives in manchiryala district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X