• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రోడ్డున పడ్డ 250మంది టెక్కీలు: బోర్డు తిప్పేసిన 4కంపెనీలు, దిక్కులేని స్థితిలో!..

|

హైదరాబాద్: ఐటీలో ఉద్యోగమంటే దర్జాకు కేరాఫ్ అన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ పరిస్థితి చూస్తుంటే.. ఐటీ అంటే టెన్షన్‌కు కేరాఫ్ అని అభిప్రాయం కూడా కలగకమానదు. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని గందరగోళం కొందరిలో.. కంపెనీ ఉంటుందా? బోర్డు తిప్పేస్తుందా? అన్న ఆందోళన మరికొందరిలో..

<strong>ఐటీ సంక్షోభం: టెక్కీలది పెద్ద వాటానే, హైదరాబాద్ రియాల్టీపై ఎఫెక్ట్</strong>ఐటీ సంక్షోభం: టెక్కీలది పెద్ద వాటానే, హైదరాబాద్ రియాల్టీపై ఎఫెక్ట్

తాజాగా హైదరాబాద్‌కు చెందిన నాలుగు ఐటీ కంపెనీలు బోర్డు తిప్పేయడంతో 250మంది టెక్కీలు రోడ్డునపడ్డారు. ఇందులో కొంతమంది డబ్బులు పోసి మరీ జాబ్ కొనుక్కున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా కంపెనీ బోర్డు తిప్పేయడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

వారం రోజులు ఆగమన్నారు!:

వారం రోజులు ఆగమన్నారు!:

ఎప్పటిలాగే యథావిధిగా ఆఫీస్ కు వెళ్లిన ఉద్యోగులు.. ఇంకా తాళం వేసి ఉండటంతో షాక్ తిన్నారు. అనుమానం వచ్చి యాజమాన్యానికి ఫోన్ చేస్తే.. ప్రస్తుతానికి ప్రాజెక్టులేమి లేవని, ఒక వారం రోజులు ఆగాలని చెప్పారు. వాళ్లు చెప్పినట్లు వారం రోజులు వేచి చూసినా.. ఆఫీస్ మాత్రం తిరిగి తెరుచుకోలేదు. దీంతో వాళ్లకు సీన్ అర్థమైంది. రూ.2లక్షలు పోసి జాబ్ కొనుక్కున్నవాళ్లంతా ఇప్పుడు లబోదిబోమంటున్న పరిస్థితి.

బోర్డు తిప్పేసిన 'అవెన్యూ'..

బోర్డు తిప్పేసిన 'అవెన్యూ'..

ఇటీవలి కాలంలో నాలుగు ఐటీ కంపెనీలో హైదరాబాద్ లో బోర్డు తిప్పేయగా.. అందులో అవెన్యూ ఒకటి. బహుళ అంతస్తుల భవనంలో ఆఫీస్.. ఆకర్షణీయ జీతం అనగానే చాలామంది అటువైపు క్యూ కట్టారు. మూడు దశల్లో ఇంటర్వ్యూ నిర్వహించిన అవెన్యూ యాజమాన్యం కొంతమందిని సెలెక్ట్ చేసుకుంది.

అయితే కొన్ని షరతులు మాత్రం విధించింది. నేరుగా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినవారు రూ.1.5లక్షలు, కన్సల్టెన్సీల ద్వారా కంపెనీకి వచ్చినవారు రూ.2లక్షలు చెల్లించాలన్న షరతు పెట్టింది. రూ.3లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేయడంతో.. చాలామంది అడిగినంత మొత్తం కంపెనీ ఖాతాలో జమ చేసి కొలువులో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత కొద్దిరోజులకే కంపెనీ బోర్డు తిప్పేయడంతో ఉద్యోగులంతా రోడ్డునపడ్డారు.

పోలీసులకు చెప్పినా ఫర్వాలేదన్నకంపెనీ:

పోలీసులకు చెప్పినా ఫర్వాలేదన్నకంపెనీ:

కంపెనీలో జాయిన్ అయిన తర్వాత తొలి రెండు నెలలు ట్రైనింగ్ తో వెల్లదీసిన కంపెనీ.. ఆ తర్వాత నెలకు రూ.10వేలు మాత్రమే ఇచ్చేది. వారం క్రితం ఒక లీగల్ అడ్వైజర్ ను తీసుకొచ్చి.. కొన్ని అనివార్య కారణాల వల్ల కంపెనీ మూసేస్తున్నాం అని బాంబు పేల్చింది.

వేరే ఉద్యోగం చూసుకోవాలని, పోలీసులకు ఫిర్యాదు చేసినా తమకేం నష్టం లేదన్నట్లుగా యాజమాన్యం మాట్లాడింది. అంత లీగల్ గానే చేశామని చెప్పుకొచ్చింది. అయితే ఎదురుతిరిగిన కొంతమందికి ఎంతో కొంత చేతిలో పెట్టి నోరు మూయించింది. దీంతో 120మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు.

దీనిపై కంపెనీ ఉద్యోగులంతా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా, ఇదివరకే ఇలాంటి కేసులు మరో రెండు నమోదైనట్లు పోలీసులు పేర్కొనడం గమనార్హం. రాయదుర్గంలోను మరో కంపెనీ ఇలాగే మూతపడగా 40మంది ఉద్యోగాలు కోల్పోయారు.

స్టార్టప్ పేరుతో కుచ్చుటోపీ:

స్టార్టప్ పేరుతో కుచ్చుటోపీ:

బోర్డు తిప్పేసిన కంపెనీలన్ని స్టార్టప్ పేరిటే రిజిస్టర్ అయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్ లకు ప్రోత్సాహం అందిస్తుండంతో.. కన్సల్టెన్సీల ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి స్టార్టప్ కంపెనీల చేతిలో బాధితులుగా మిగిలిపోతున్నవాళ్లలో ఎక్కువ మంది బీటెక్ ఉద్యోగులే కావడం గమనార్హం.

అలాంటి వాటిని నమ్మవద్దు:

అలాంటి వాటిని నమ్మవద్దు:

ఐటీ కారిడార్‌లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే స్టార్టప్ లను నమ్మి మోసపోవద్దని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి కంపెనీలన్ని మహా అయితే ఓ గదిని అద్దెకు తీసుకుని, అభ్యర్థుల నుంచి డబ్బులు లక్షల్లో డబ్బులు వసూలు చేసి, ఆ తర్వాత బోర్డు తిప్పేస్తాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి బ్యాక్ డోర్ నియామకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

English summary
Avenue a startup company was pull down the shutters, 250employees are impacted. Now they are on the road
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X