వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పథకాల పేరుతో పచ్చి మోసం..! గేదెలకు భీమా మాటున అధికారుల చేతి వాటం..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రభుత్వ పథకాలు అవినీతి మయం అవుతున్నాయి. ఉన్నత ఆశయంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రవేశ పెట్టిన పథకాలు నీరుగారి పోతున్నాయి.ఆఖరి మూగ జావాలన మాటున కూడా అవినీతి చేస్తున్నారు అదికారులు. బర్రె చనిపోవడంతో అధికారుల అవినీతి బయటపడిన ఘటన కామారెడ్డి జిల్లాల్లో జరిగింది. వివరాల్లోకి వెలితే... కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎంఎస్‌కేవై ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలం పెద్దగుల్లా గ్రామానికి చెందిన 22 మంది రైతులకు ఒక్కొక్కరికి రెండు చొప్పున 44 గేదెలను అందజేశారు.

ఒక్కోదాని ధర 80 వేల రూపాయాలు. 50 శాతం రాయితీ ఉండటంతో రైతులు 40 వేల రూపాయల చొప్పున చెల్లించారు. గేదె చనిపోతే భీమా వస్తుందంటూ అధికారులు ఒక్కో రైతు వద్ద 6 వేలరూపాయలు వసూలు చేశారు. భీమా చేసినట్లు రెండు గేదెల చెవులకు పోగులు వేశారు.ఇటీవల పెద్దగుల్లా గ్రామానికే చెందిన రైతు వెంకట్‌కు చెందిన గేదె మృతి చెందింది. భీమా ఉందని, సొమ్ము వస్తుందని బాన్సువాడలోని కార్యాలయానికి వెళ్లగా అసలు విషయం బయటపడింది.

 Fraud with the name of schemes..!cheating farmers on the name of buffalos insurance..!

మృతి చెందిన ఆ గేదెకు వ్యవసాయాధికారులు భీమా చేయించలేదని చెప్పడంతో రైతు అవాక్కయ్యారు. ఇలా ఆ అధికారుల అవినీతి భయటపడింది. అసలు కథ భయటకొచ్చింది. రెండు గేదెలకు భీమా చేశామని చెప్పి ఒక గేదెకు మాత్రమే భీమా చేశారు. దీంతో రైతులు ఆందోలనకు దిగారు. వ్యవసాయ అధికారులు తమ దగ్గర డబ్బులు వసూళ్లు చేసి మోసం చేశారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

English summary
Only a buffalo insurance was done instead of many more.Thus the farmers got angry. Farmers say govt officials have earned their money and cheated them. The farmers are demanding immediate action against officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X