వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెట్రో ఉద్యోగాల పేరిట బురిడీ! రూ. లక్షల్లో నిరుద్యోగులకు కుచ్చుటోపీ!!

సరిగ్గా మరో నెల రోజుల్లో హైదరాబాద్ మెట్రో రైలు పట్టాలెక్కనున్నది. వచ్చేనెల 18న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మెట్రో రైలు.. భాగ్య నగర వాసుల కలల ప్రాజెక్టు. వచ్చేనెల 28న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ముహూర్తం కుదిరింది. హైదరాబాద్ నగరంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుతో భారీగా ఉద్యోగాలు లభిస్తాయని నిరుద్యోగ యువత భావించింది. నాగోల్ ‌- అమీర్‌పేట్‌ (17కి.మీ.), మియాపూర్‌ - ఎస్‌ఆర్‌ నగర్‌ (13 కి.మీ.) మార్గంలోని 24 మెట్రో స్టేషన్లు, ఉప్పల్, మియాపూర్‌ మెట్రో డిపోలు, ఉప్పల్‌లోని ఆపరేషన్‌ కంట్రోల్‌ సెంటర్‌తోపాటు మెట్రో రైళ్లు నడిపే లోకో పైలట్ల వంటి హోదాల్లో ఇప్పటికే సుమారు రెండు వేల ఉద్యోగ నియామక ప్రక్రియను నిర్వహణ సంస్థ కియోలిస్‌ దాదాపు పూర్తిచేసినట్లు విశ్వసనీయం సమాచారం.

వివిధ కాలేజీల్లో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ విధానంలోనే వీటిని భర్తీ చేసినట్లు మెట్రో రైలు అధికారులు చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్ మెట్రో ఉగ్యోగాలంటూ మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్న నిరుద్యోగులు లక్షల రూపాయలు నష్టపోతున్నారు. ప్రత్యక్షంగా భర్తీ చేసిన ఉద్యోగాలు, భవిష్యత్‌లో భర్తీ చేయబోయే ఉద్యోగాలపై రాష్ట్ర ప్రభుత్వంగానీ, హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్‌ఎంఆర్), దాని నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ, కియోలిస్‌ గానీ స్పష్టత ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది.

 నకిలీ కాల్ లెటర్లతో ఇలా నిలువునా మోసం

నకిలీ కాల్ లెటర్లతో ఇలా నిలువునా మోసం

మెట్రో రైలు ప్రాజెక్టును సాకుగా చూపి నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టేందుకు ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన పలు అంతర్రాష్ట్ర ముఠాలు రంగంలోకి దిగాయి. టికెట్‌ కలెక్టర్లు, స్టేషన్‌ మేనేజర్ల ఉద్యోగాలని సోషల్‌ మీడియాలో ప్రచారం చేసి.. ఫోన్‌ ఇంటర్వ్యూలు, ఫేక్‌ కాల్‌లెటర్లతో నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు దండుకుని నిలువునా ముంచేస్తున్నాయి. మెట్రో రైలు ప్రాజెక్టులో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు వల వేస్తున్న పలువురు మోసగాళ్ల గుట్టును ఇప్పటికే పోలీసులు రట్టు చేశారు. మెట్రో ప్రాజెక్టులో అవసరమైన ఉద్యోగాల భర్తీలో ఎల్‌అండ్‌టీ, హెచ్‌ఎంఆర్‌ సంస్థల పాత్ర నామమాత్రమేనని ఆయా సంస్థలు చెబుతున్నాయి. నిర్వహణ సంస్థ కియోలిస్‌ అవసరమైన ఉద్యోగుల ఎంపిక కోసం క్యాంపస్ నియామకాలు మాత్రమే చేపడుతుందని స్పష్టం చేస్తున్నాయి.

పోలీసుశాఖకు సెక్యూరిటీ బాధ్యత

పోలీసుశాఖకు సెక్యూరిటీ బాధ్యత

నగరంలో ఎల్బీనగర్‌ - మియాపూర్, జేబీఎస్ ‌- ఫలక్‌నుమా, నాగోల్‌ - రాయదుర్గం కారిడార్లలో 72 కి.మీ. మెట్రో ప్రాజెక్టు చేపడుతున్నారు. ఈ మార్గంలో మొత్తం 65 స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి స్టేషన్‌లో స్టేషన్‌ మేనేజర్, అనౌన్సర్, టికెట్‌ జారీ చేసేవారు, ప్రధాన సెక్యూరిటీ, సాంకేతిక అధికారి ఇలా ప్రతి షిఫ్టుకు ఐదుగురు ఉద్యోగులు మాత్రమే విధుల్లో ఉంటారు. ఇక స్టేషన్‌ లోపల, బయట భద్రతా బాధ్యతలను పోలీసు శాఖ చేపడుతుంది. ఇక 57 మెట్రో రైళ్లను నడిపేందుకు అవసరమైన లోకో పైలట్లను కియోలిస్‌ సంస్థ ఇప్పటికే క్యాంపస్ నియామకాల ద్వారా ఎంపిక చేసి.. వారికి ఉప్పల్‌ మెట్రో డిపోలో శిక్షణ సైతం ఇచ్చింది. ఇక ఉప్పల్, మియాపూర్‌ మెట్రో డిపోల్లో సిగ్నలింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, మేనేజ్‌మెంట్‌ తదితర విభాగాల్లో పనిచేసే సిబ్బందిలో దాదాపు 50 శాతం నియామకాలు పూర్తిచేసినట్లు సమాచారం. దాదాపు అన్ని ఉద్యోగాలను ఔట్‌సోర్సింగ్‌ విధానంలోనే భర్తీ చేయనున్నారు.

 ఎంపికైన వారికి మల్టీ టాస్కింగ్ ట్రైనింగ్ ఇలా

ఎంపికైన వారికి మల్టీ టాస్కింగ్ ట్రైనింగ్ ఇలా

మెట్రో రైళ్లు, స్టేషన్లు, డిపోల్లో పనిచేసేందుకు అవసరమైన సిబ్బంది నియామకాలను కియోలిస్‌ సంస్థ క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారానే భర్తీ చేస్తోంది. ఆయా కళాశాలలకు ముందే సమాచారం అందించి నేరుగా సంస్థ ప్రతినిధులు వెళ్లి విద్యార్థులకు వివిధ అంశాల్లో మూడు దశల రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూలు, బృంద చర్చల ద్వారా నియామక పత్రాలు అందజేస్తారు. ఇలా ఎంపికైన వారికి ఉప్పల్‌ మెట్రో డిపోలో ఆరు నెలల పాటు స్టైఫెండ్‌ ఇచ్చి శిక్షణ ఇస్తారు. ఒక ఉద్యోగికి వివిధ అంశాల్లో(మల్టీ టాస్కింగ్‌) శిక్షణ ఇస్తారు. భవిష్యత్‌లో భర్తీ చేసే ఉద్యోగాల వివరాలను సంస్థ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారని హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

 కియోలిస్ ప్రజా రవాణా సామర్థ్యం ఇలా

కియోలిస్ ప్రజా రవాణా సామర్థ్యం ఇలా

ఫ్రాన్స్‌కు చెందిన కియోలిస్‌ సంస్థ ప్రజారవాణా రంగంలో విశేష అనుభవం గడించింది. 12 దేశాల్లోని పలు ప్రజారవాణా వ్యవస్థలను నిర్వహిస్తోంది. నగర మెట్రో ప్రాజెక్టు నిర్వహణలోనూ కీలక భాగస్వామిగా మారింది. 15 ఏళ్ల పాటు మెట్రో నిర్వహణ బాధ్యతలను కాంట్రాక్టు విధానంలో స్వీకరించింది. అవసరమైన ఉద్యోగుల భర్తీ, వారి శిక్షణ, రోజువారీగా రైళ్లను నడపడం, వాటి నిర్వహణ, మరమ్మతు పనులను ఈ సంస్థ సిబ్బందే చేపడతారు. మెట్రో ప్రాజెక్టులో అన్ని ఉద్యోగాలనూ స్థానికులకే కేటాయించాలని నిరుద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మానవతారాయ్ డిమాండ్ చేశారు.. మెట్రో ప్రాజెక్టులో వివిధ హోదాల్లో ప్రత్యక్షంగా భర్తీ చేయనున్న, ఇప్పటివరకు భర్తీ చేసిన పోస్టులు, ఏఏ కళాశాలల్లో క్యాంపస్ నియామకాలు చేపట్టారన్న విషయంతోపాటు భవిష్యత్‌లో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలపై తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలని పేర్కొన్నారు. నిరుద్యోగులను మోసగిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ మానవతారాయ్ అన్నారు.

English summary
HYDERABAD: A little over a month ahead of its official launch date, it is a job fraud that has come to haunt the Hyderabad Metro Rail Limited (HMRL). On Friday, Metro authorities were compelled to lodge two police complaints against miscreants found duping job seekers of lakhs of rupees under the pretext of offering them employment as ticket collectors on Metro Rail. Speaking about the resurfacing of this type of fraud, which first came to light in March, HMRL authorities said that apart from Delhi-based gangs that ran this scam previously , even local gangs are found indulging in them now.While the Rachakonda Police have arrested two Nagpur-based fraudsters, involved in a similar crime, the scare, officials maintain, is far from over.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X