వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉచిత స్కూటీ పథకం .. మీ సేవా కేంద్రాల వద్ద మహిళల క్యూ .. ఫేక్ న్యూస్ అంటున్న అధికారులు

|
Google Oneindia TeluguNews

ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగేస్తాం.. పది రూపాయల చీర దొరుకుతుంది అంటే పది కిలోమీటర్ల మేర క్యూలో నిల్చుంటాం.. ఇక ఏకంగా ఉచితంగా స్కూటీ దొరుకుతుంది అంటే ఇక మన వాళ్ళ సంతోషం అంతా ఇంతా కాదు.. అందుకోసం తెగ హడావిడి చేసేసున్నారు . కష్టపడి సంపాదించుకున్న దానిలో పొందే ఆనందం కంటే ఫ్రీగా వచ్చిన దాంట్లో బోలెడంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు .. అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ వైరల్ అవుతుంది.

పార్టీ మారే ఆలోచనలో కొండా దంపతులు ? .. బీజేపీలోకి జంప్ అంటూ ప్రచారంపార్టీ మారే ఆలోచనలో కొండా దంపతులు ? .. బీజేపీలోకి జంప్ అంటూ ప్రచారం

 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రీ స్కూటీ పథకం పేరుతో ఫేక్ న్యూస్ .. మీ సేవా కేంద్రాలకు పరుగులు పెడుతున్న మహిళలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రీ స్కూటీ పథకం పేరుతో ఫేక్ న్యూస్ .. మీ సేవా కేంద్రాలకు పరుగులు పెడుతున్న మహిళలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త పథకాన్ని ప్రారంభించారని మహిళలకు ఉచితంగా స్కూటీలు ఇస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక ఈ స్కూటీలు పొందాలనుకునేవారు మీసేవ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని ప్రచారం జరగడంతో లక్షలాది మంది మహిళలు మీ సేవ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. పదో తరగతి పాస్ అయి 18 ఏళ్ల నుండి 40 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ పథకాన్ని పొందడానికి అర్హులు అని వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్త పత్రికలలో సైతం ప్రచురితమైంది. ఇక దీంతో ఉచిత స్కూటీ పథకాన్ని పొందడం కోసం మీ సేవ కేంద్రాల వద్దకు మహిళలు పరుగులు పెడుతున్నారు.

 ఉచిత స్కూటీ పథకం ఫేక్ అని తేల్చిన ఫ్యాక్ట్ లీ సంస్థ .. అలాంటి స్కీం లేదన్న సర్కార్

ఉచిత స్కూటీ పథకం ఫేక్ అని తేల్చిన ఫ్యాక్ట్ లీ సంస్థ .. అలాంటి స్కీం లేదన్న సర్కార్

అయితే ఈ ప్రకటన వైరల్ కావడం, మరియు మీ సేవ కేంద్రాల వద్ద పరిస్థితులు తెలియడంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర సర్కార్ అలాంటిది ఏమీ లేదంటూ ప్రకటన చేసింది. కేంద్రం ఎటువంటి పధకం ప్రకటించలేదని , ఉచిత స్కూటీ పథకం ఫేక్ అని , ఇక ఈ వార్తలు అవాస్తవమని , ఎవరు స్కూటీల కోసం మీ సేవ కేంద్రాల వద్దకు వెళ్లవద్దని మహిళా శిశు సంక్షేమ శాఖ స్పష్టంగా చెప్పింది. సామాజిక మాధ్యమాలలో తప్పుడు వార్తలు గుర్తించే సంస్థ అయిన ' ఫ్యాక్ట్ లీ ' సైతం ఇదే విషయాన్ని ప్రకటించింది. అయితే ఇదంతా కొందరు ఆకతాయిలు సృష్టించిన ప్రచారం అని తెలియడంతో ఈ విషయంలో మహిళలు అప్రమత్తం చేయడానికి, ఫేక్ న్యూస్ ను నమ్మొద్దని చెప్పడానికే అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది.

అధికారిక వెబ్ సైట్స్ లోనూ కనిపించని స్కీం .... ఫేక్ వార్తలు నమ్మొద్దని అధికారుల సూచన

అధికారిక వెబ్ సైట్స్ లోనూ కనిపించని స్కీం .... ఫేక్ వార్తలు నమ్మొద్దని అధికారుల సూచన

మోడీ దేశవ్యాప్తంగా ఇలాంటి పథకాన్ని ప్రారంభించి ఉంటే, దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన వార్తాపత్రికలలో కనిపించేది . ఈ పథకం గురించి వివరాలను శోధించటానికి చేయడానికి ప్రభుత్వ వెబ్‌సైట్లలో చూసినా అటువంటి పథకం ఏ వెబ్ సైట్ లోనూ లేదు . సాధారణంగా, కేంద్ర ప్రభుత్వం ఏదైనా పథకాన్ని ప్రారంభించినప్పుడు, దాని గురించి సమాచారం ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో' ద్వారా విడుదల అవుతుంది. కానీ అలాంటిదేమీ లేదు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ‘స్కూటీ యోజన' పథకం అందించటం లేదు అన్నది వాస్తవం . తమిళనాడులో ‘అమ్మ స్కూటర్ పథకం' ఉంది కాని లబ్ధిదారులు ఆ రాష్ట్రానికే పరిమితం. జమ్మూ కాశ్మీర్‌లో కూడా అలాంటి పథకం ఉంది కాని లబ్ధిదారులు ఆ రాష్ట్ర పరిధిలోనే ఉన్నారు. ఇక మిగతా రాష్ట్రాలలో కానీ, కేంద్రం ద్వారా గానీ ఎలాంటీ ఫ్రీ స్కూటీ పథకాలు లేవని తెలుస్తుంది. ఇక ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మొద్దని చెప్తున్నారు అధికారులు .

English summary
Modi government has launched ‘Scooty Yojana’ scheme to distribute scooters to all the girls across the country, who passed 10th standard. There is no such ‘Scooty Yojana’ scheme launched by the Central Government. In Tamilnadu, there is ‘Amma Scooter Scheme’ but the beneficiaries are restricted to that state itself. In Jammu & Kashmir, also, there is such a scheme but the beneficiaries are covered within that state. Hence, the claims made in the post stands FALSE.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X