వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంగదేవిపల్లి మరో ఘనత: సంక్రాంతి నుంచి ఉచిత వైఫై సేవలు

ఆదర్శగ్రామంగా జాతీయస్థాయిలో గుర్తింపుపొందిన వరంగల్‌ గ్రామీణ జిల్లాలోని గంగదేవిపల్లి త్వరలో ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్‌ విలేజ్‌)గా మరో ఘనత సాధించనుంది.

|
Google Oneindia TeluguNews

వరంగల్‌: ఆదర్శగ్రామంగా జాతీయస్థాయిలో గుర్తింపుపొందిన వరంగల్‌ గ్రామీణ జిల్లాలోని గంగదేవిపల్లి త్వరలో ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్‌ విలేజ్‌)గా మరో ఘనత సాధించనుంది. గీసుకొండ మండల పరిధిలో ఉన్న ఈ గ్రామం వివిధ అంశాల్లో ఆదర్శంగా నిలుస్తూ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రసిద్ధిచెందింది.

కేంద్ర ప్రభుత్వం 2014లో ఆదర్శగ్రామంగా ప్రకటించింది. తాజాగా గ్రామస్థులంతా సాంకేతికంగా మరో అడుగు ముందుకేశారు. త్వరలో ఉచిత వైఫై సేవలు అందుకోనున్నారు. స్వేచ్ఛ అనే స్వచ్ఛంద సంస్థ గంగదేవిపల్లిలో వైఫై సేవలు అందించడానికి ముందుకొచ్చింది. పంచాయతీకి ఈ స్వచ్ఛంద సంస్థ డిజిటల్‌ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

గ్రామంలో ఫ్రీడం బాక్స్‌ సర్వర్‌ ద్వారా ఆరు వైఫై యాంటీనా టవర్లు బిగించారు. వీటి ద్వారా గ్రామస్థులందరికీ డిజిటల్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి. అంతర్జాలమే కాకుండా ఫ్రీడం బాక్సుతో డిజిటల్‌ గ్రంథాలయం, గ్రామానికి సొంత ఆడియో ఛానెల్‌, ఉచిత వాయిస్‌ కాల్స్‌ చేసుకునే అవకాశమూ లభిస్తుంది. ఈసేవల్ని సంక్రాంతి నుంచి ప్రారంభించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సేవల కోసం 106 మంది గ్రామస్థులు స్మార్ట్‌ఫోన్ల ద్వారా నమోదు చేసుకున్నారు.

Free wifi soon in gangadevipally.

అక్షర శిక్షణకు అరుదైన ఘనత: ఫేస్‌బుక్‌లో కోటి లైకులు
సిద్ధిపేట ఉపాధ్యాయుని రికార్డు

ఇంగ్లీషు అక్షరాలను అందంగా పొందికగా ఎలా రాయాలనే దానిపై ఒక ఉపాధ్యాయుడు రూపొందించిన రెండు నిమిషాల మీడియో అరుదైన ఘనతను దక్కించుకుంది. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌లో అత్యధిక మంది వీక్షించిన దానిలో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. రెండున్నర నెలల్లో కోటి మంది వీక్షించగా 3,61,446 మంది ఫేస్‌ బుక్‌ వీక్షకులు దీన్ని షేర్‌ చేయడం గమనార్హం.

ఈ ఘనత సాధించింది సిద్దిపేట పట్టణానికి చెందిన ఎజాజ్‌ అహ్మద్‌ అనే ఉపాధ్యాయుడు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం విద్యార్థులకు అందమైన చేతి రాతను అలవాటు చేయాలనే తపనతో ఎజాజ్‌ అహ్మద్‌ ప్రారంభించిన చిరు ప్రయత్నం నేడు విశ్వవ్యాప్తమైంది.

ఎజాజ్‌ అహ్మద్‌ ఇంగ్లీషులో కలిపి రాతను సులువుగా ఎలా రాయాలో వివరించే లైవ్‌ వీడియో ఇది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొడుతూ అందరి మన్ననలు పొందుతోంది. ఫేస్‌బుక్‌లో ఫోన్లు చేసిన కొద్ది గంటల్లోనే ఈ వీడియోకు లక్షల్లో లైకులు పడటం విశేషం. ఇప్పటి వరకు ముఖ్యమంత్రులు, మంత్రుల చేత ఎజాజ్‌ అహ్మద్‌ సన్మానాలు అందుకున్నారు.

English summary
Free wifi soon in gangadevipally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X