హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో ఆకర్షణ: ఇక హైదరాబాద్‌లోనూ ట్రామ్‌వే, బీఆర్‌టీఎస్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరాని మరో కొత్త ఆకర్షణ చేరుతోంది. అధునాతన సాంకేతిక సొబగులతో కూడిన మెట్రో రైలు పరుగులు తీసేందుకు సిద్ధంగా ఉండగా.. రోడ్డుపై నడిచే ట్రామ్‌ రైలును సైతం హైదరాబాద్‌లో ప్రవేశపెట్టేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. మొదటి దశలో మొజంజాహీ మార్కెట్‌ నుంచి చార్మినార్‌ వరకు పనులు ప్రారంభమవుతాయి.

అభివృద్ధి చెందిన దేశాలతోపాటు కోల్‌కతా, ముంబై వంటి నగరాల్లో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోన్న ట్రామ్‌ రైలు హైదరాబాద్‌కు వస్తోందని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి సోమవారం బంజారాహిల్స్‌ ఆస్కీలో జరిగిన ఇండో-ఫ్రెంచ్‌ సదస్సులో పేర్కొన్నారు.

చార్మినార్ పరిరక్షణ

చార్మినార్ పరిరక్షణ

రెండు రోజులపాటు ఇంజినీరింగ్‌ నిపుణులు ప్రతిపాదిత మార్గాల్లో పర్యటించి ప్రాజెక్టు వివరాలు పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తారని స్పష్టం చేశారు. చారిత్రక చార్మినార్‌ను పరిరక్షించడంతోపాటు పర్యాటకులను మరింతగా ఆకర్షించే ఉద్దేశంతో చార్మినార్ పాదచారుల ప్రాజెక్టుతోపాటు ట్రామ్స్‌వేను కూడా చేపడుతున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు.

బోర్డెక్స్ తరహాలో...

బోర్డెక్స్ తరహాలో...

ఫ్రాన్స్‌లోని బోర్డెక్స్ నగరం తరహాలో, అక్కడి నిపుణుల సహకారంతో ఈ ప్రాజక్టును చేపడుతున్నట్లు మేయర్ చెప్పారు. అంతేగాకుండా ప్రజారవాణా వ్యవస్థను మరింతగా అభివృద్ధి చేసేందుకు సుమారు 50కిలోమీటర్లమేర బీఆర్‌టీఎస్(బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం)ను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు.

ట్రామ్ వే

ట్రామ్ వే

నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడంతోపాటు రవాణా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మెట్రోరైలు, ట్రామ్‌వే, బీఆర్‌టీఎస్ తదితర ప్రజా రవాణా వ్యవస్థలను చేపట్టనున్నట్లు స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు జీహెచ్‌ఎంసీ, బోర్డెక్స్ మెట్రోపోల్‌ల సంయుక్తాధ్వర్యంలో సోమవారం బంజారాహిల్స్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ)లో చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు, న్యూ జనరేషన్ ట్రామ్‌వే అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

బోర్డెక్స్‌తో సారూప్యత

బోర్డెక్స్‌తో సారూప్యత

చారిత్రక కట్టడాలకు నష్టం జరగకుండా అభివృద్ధి ప్రాజెక్టు లు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా సుమారు ఆరు వందల సంవత్సరాల చరిత్రగల బోర్డెక్స్ నగరంతో మన నగరానికి ఎంతో సారుప్యత ఉందని, అందుకే అక్కడ అభివృద్ధి పనులు చేపట్టిన నిపుణుల సహకారం తీసుకుంటున్నామన్నారు. కేవలం 30-40అడుగుల వెడల్పుగల రోడ్లపైనే అక్కడ ట్రామ్స్‌వే నిర్మించినందున మన నగరంలో కూడా అదే తరహాలో ఏర్పాటు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా చార్మినార్‌సహా పరిసరాల్లోని చారిత్రక ప్రాంతాలను కలుపుతూ ట్రామ్‌వే నిర్మించేందుకు ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధితో పాతనగరం రూపురేఖలు మారిపోవడమే కాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగవుతాయని అభిప్రాయపడ్డారు.

ప్రజా రవాణా మెరుగుదల

ప్రజా రవాణా మెరుగుదల

ట్రామ్‌వే వంటి సులభమైన ప్రజారవాణా వ్యవస్థ ఉంటే పేదల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రాజక్టునుసైతం నగరం వెలుపల చేపట్టవచ్చని పేర్కొన్నారు. ముందుగా పాతబస్తీలో ట్రామ్‌వేను చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు సుమారు 50కిలోమీటర్ల వరకు బీఆర్‌టీఎస్ ప్రాజెక్టు ను కూడా చేపడతామన్నారు. అలాగే మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టును సైతం ఫ్రాన్స్ సహకారంతో చేపడతామన్నారు.

పార్కింగ్ సమస్యకు చెక్..

పార్కింగ్ సమస్యకు చెక్..

పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు ఐదు-ఆరు అంతస్తులమేర పార్కింగ్ కాంప్లెక్స్‌లను నిర్మించేందుకు ఇప్పటికే టెండర్లు ఆహ్వానించామన్నారు. అక్కడే నదికి ఇరువైపులా ట్రామ్‌వే ఏర్పాటు చేసినట్లు, ఇక్కడ సైతం అన్ని అవకాశాలనూ పరిశీలించనున్నట్లు చెప్పారు. పాదచారుల ప్రాజెక్టు ను త్వరితగతిన పూర్తిచేయడంతోపాటు దానికి అనుబంధంగా రవాణా వ్యవస్థను కూడా అభివృద్ధి చేసేందుకు సమ గ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించాలని కోరినట్లు చెప్పా రు. ఒకటి రెండు రోజులు నగరంలో పర్యటించి అధ్యయ నం చేసిన తరువాత నివేదిక రూపొందిస్తారని
తెలిపారు.

త్వరలోనే పూర్తి

త్వరలోనే పూర్తి

సిస్టర్ సిటీ ఒప్పందంలో భాగంగా బోర్డెక్స్ నగరం భాగస్వామ్యంతో పర్యాటక, రవాణా అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి తెలిపారు. బోర్డెక్స్‌లో సైతం పర్యాటక ప్రాంతాల అభివృద్ధి లో భాగంగా విద్యుత్, మంచినీరు, డ్రైనేజీ తదితర అన్నిరకాల కేబుల్ లైన్లు భూగర్భంగుండానే ఏర్పాటుచేసినట్లు చెప్పారు. చార్మినార్ వద్ద సైతం అదే తరహాలో ఏర్పాటుచేయాలని నిశ్చయించినట్లు ఆయన పేర్కొన్నారు. చార్మినార్ పాదచారుల ప్రాజక్టు మొదటిదశను వచ్చే రెండు-మూడు నెలల్లో పూర్తిచేస్తామన్నారు. రవాణా కనెక్టివిటీలో భాగంగా ఇప్పటికే ఇన్నర్, ఔటర్ రింగ్‌రోడ్ల అభివృద్ధి పూర్తయిందన్నారు. మోజంజాహీ మార్కెట్-చార్మినార్, సెవెన్ టూంబ్స్-గోల్కొండ మార్గాల్లో ట్రామ్‌వే చేపట్టేందుకు వీలవుతుందని చెప్పారు.

తక్కువ వ్యయంతోనే ట్రామ్‌వే....

తక్కువ వ్యయంతోనే ట్రామ్‌వే....

ఇతర రవాణా వ్యవస్థ ఏర్పాటుతో పోల్చుకుంటే ట్రామ్‌వేకు అతితక్కువ వ్యయం అవుతుందని, కనీస మౌలిక వసతులతో దీన్ని పూర్తిచేయవచ్చని బోర్డెక్స్ మెట్రోపోల్ కౌన్సిలర్ మైఖేల్ వెర్నెజోల్ పేర్కొన్నారు. చారిత్రక, పర్యాటక ప్రాంతాలను కాపాడాల్సిన అవసరముందని, హైదరాబాద్ వంటి నగరాలకు ట్రామ్‌వే ఎంతో అవసరమన్నారు. హైదరాబాద్ నగరం దేశంలోనే ఉత్తమ స్నేహపూర్వక నగరమని ఢిల్లీలోని ఫ్రాన్స్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ బెట్రాండ్ హర్టింగ్ పేర్కొన్నారు. నగరాభివృద్ధి ఫ్రాన్స్ సహాయ సహకారాలు అందిస్తుందని, దేశంలోని పలు నగరాల్లో ఫాన్స్‌కు చెందిన పలు ప్రాజెక్టులు విజయవంతంగా నడుస్తున్నట్లు ఆయన వివరించారు.

English summary
Soon, the Moazzam Jahi Market to Charminar stretch could flaunt a new-age tramway, much like the one ferrying passengers in the French city of Bordeaux.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X