వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్నేహంలోని మాధుర్యం, బంధుత్వంలోని గొప్పదనం, ఆర్థిక క్రమశిక్షణ.. ఎన్నో నేర్పిన లాక్ డౌన్..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కరోనా వైరస్ ను కట్టడిచేసేందకు భారత ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం ఆశించిన ఫలితాలు ఇవ్వడంతో పాటు, ఎన్నో కొత్త అంశాలను స్పృశించినట్టు తెలుస్తోంది. ఇరవై నాలుగు గంటల్లో దాదాపు 15గంటలు తీరిక లేకుండా గడిపే యాంత్రిక జీవనంలో కనుమరగైన ఎన్నో బంధాల గొప్పతనాన్ని, విలువైన అంశాల పట్ల వహించే నిర్లక్ష్యాన్ని, దూరమైన బందుత్వాల అనుబంధాలను, స్నేహం లో ఉన్న మాధుర్యాన్ని, పిల్లల పసితనంలో ఉన్న నిష్కల్మషాన్ని అన్నిటికి మించి ఆర్ధిక క్రమశిక్షణను ఈ లాక్ డౌన్ మరొక్కసారి కళ్లెదుట సాక్షాత్కరింపజేసింది. అనవసర ఆర్బాటాల వల్ల వ్యయప్రయాసలు తప్ప ఒరిగేదేమి ఉండదనే సత్యాన్ని కూడా లాక్ డౌన్ కళ్లకు కట్టినట్టు తెలియజేసింది.

లాక్ డౌన్ చాలా నేర్పింది..

లాక్ డౌన్ చాలా నేర్పింది..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న స్వీయ నియంత్రణ చర్యలు అడుగంటిన ఎన్నో అనుభవాలను తిరిగి గుర్తుచేసినట్టైంది. వర్క్ ఫ్రం హోమ్ కావడంతో తెలియని క్రమశిక్షణకు అలవాటుపడిపోయారు ఉద్యోగులు. అవసరం ఉన్నా లేకపోయినా గంటల గంటలు మాట్లాడే సొల్లు పురాణానికి కూడా లాక్ డౌన్ తెరదించింది. అవసరం ఉన్న మేరకు, అవసరమైన స్నేహితులతో మితంగా మాట్లాడే నైజాన్ని కూడా స్వీయ నియంత్రణ నేర్పింది. అసలు బాహ్యప్రపంచంలోకి రావడం, కాలూష్య భారిన పడడం వంటి అంశాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండే విషయాన్ని లాక్ డౌన్ గుర్తుచేసింది. అసలు మానవాళికి ఒక రకమైన క్రమశిక్షణను ఈ లాక్ డౌన్ నేర్పినట్టు తెలుస్తోంది.

 స్నేహితులతో సొల్లు పురాణానికి చెక్..

స్నేహితులతో సొల్లు పురాణానికి చెక్..

నిత్యం కలిసే స్నేహితులతో పిచ్చాపాటి పనికి మాలిన మీటింగులకు అనుకోకుండా తెరపడింది. ఆఫీస్ నుండి బయటకి రాగానే అరె మామా.. జూబ్లి హిల్స్ చెక్ పోస్టు దగ్గర శ్రీనుగాడు నేను ఉన్నాం.. సత్తిగాన్ని తీసుకొని తొందరగా రా.. అంటూ చేసే ఫోన్ కాల్స్ కు అనుకోకుండా బ్రేకులు పడ్డాయి. ఇక రెస్టారెంట్ లో 6బీర్లు, 4 పెగ్గులు, ఫ్రైడ్ పల్లీ, చికెన్65, చికెన్ పకోడి, బట్టర్ నాన్, పన్నిర్ బట్టర్ మసాలా.. కట్ చేస్తే 2వేల బిల్లు.. ఈ తరహా అలవాట్ల నుండి దాదాపు బయటపడ్డ సందర్బాలు లాక డౌన్ నేర్పినట్టైంది. క్లబ్బులు, పబ్బులు, మద్యం లేనిదే ఎలా బతకడం అనే అపోహ నుండి అద్బుత జీవనం వైపు అడుగులు వేయించింది లాక్ డౌన్. మితమైన జీవనం, కమ్మని ఇంటి వంట, మమకారాల మద్య భోజనం చేయడం కూడా లాక్ డౌన్ అలవాటు చేసింది.

బలగం,బంధువులను గుర్తు చేసిన లాక్ డౌన్..

బలగం,బంధువులను గుర్తు చేసిన లాక్ డౌన్..

ఇక ఇంటి నుండే పని చేయడం కాబట్టి బంధువులను పలకరించాలని, వాళ్లతో మాట్లడి దూర ప్రాంతాల్లో ఆంక్షలు ఏ విధంగా అమలుతున్నాయి, యోగక్షేమాల గురించి తెలుసుకోవాలనే కుతూహలం కూడా స్వీయ నియంత్రణ నేర్పింది. ఎవరు సొంత వాళ్లు, ఎవరు పరాయి వారనే వాస్తవాన్ని కూడా లాక్ డౌన్ కళ్లకు కట్టినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ ఆంక్షలు ముగిసిన తర్వాత పిల్లలను తీసుకును ఒకసారి వచ్చి వెళ్లు అన్న బంధువుల మాటలోని ఆప్యాయత, గొప్పతనం కూడా తెలిసొచ్చింది. ఓవరాల్ గా దేనికి ప్రాధాన్యతనివ్వాలి, దేనికి ఇవ్వకూడదనే అంశాలను కూడా లాక్ డౌన్ నేర్పినట్టు తెలుస్తోంది.

Recommended Video

Lockdown Until June మరో రెండు నెలలు కరోనా మీద యుద్దం, లాక్‌డౌన్ జూన్ వరకు పొడగించే అవకాశం!!
ఆర్థిక క్రమశిక్షణ నేర్పిన లాక్ డౌన్..

ఆర్థిక క్రమశిక్షణ నేర్పిన లాక్ డౌన్..

ఇక అన్నిటికి మించి ఆర్థిక క్రమశిక్షణను కూడా స్వీయ నియంత్రణ నేర్పింది. పబ్బుల్లో, క్లబ్బుల్లో , రెస్టారెంట్లలో కట్టే వేలకు వేల బిల్లులతో జేబులకు పడే చిల్లులు కూడా చిన్నబోయాయి. రెస్టారెంట్లో తందూరి రోటీ, బట్టర్ చికెన్, చికెన్ డ్రమ్ స్టిక్స్, తర్వాత బిర్యాని.. ఈ చెత్త భోజనానికి, ఇంట్లో పాలకూరతో చేసిన పప్పులో ఉన్న కమ్మటి రుచి ముందు బలాదూరనిపించే అనుభవాన్ని కూడా లాక్ డౌన్ నేర్పింది. లాక్ డౌన్ ఒకటేమిటి జీవితంలో కోల్పోతున్న ఎన్నో సన్నిహిత సంబంధాలను కూడా దగ్గర చేసింది. అవసరం ఉన్నా లేకున్నా నిత్యం బాహ్యప్రపంచంలో అనేక అనర్ధాలకు కారణమయ్యే సంఘటనలనుండి క్రమశిక్షణతో కూడుకున్న వసుదైక జీవనం యొక్క గొప్పదనాన్ని నేర్పింది ఈ లాక్ డౌన్.

English summary
The lockdown decision by the Government of India to contain the coronavirus has given rise to the expected results and seems to have touched on many new things. This lock-down has once again witnessed the greatness of the many bonds that disappeared in mechanical life, the carelessness of precious things, the attachments of distant kinship, the sweetness of friendship, and the indifference of childlessness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X