• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

భార్యల మీద కోపంతో.. భర్తల క్షణికావేశం.. చంపుతున్నారు, లేదంటే..!

|

హైదరాబాద్ : భార్యల మీద కోపంతో భర్తలు క్షణికావేశంతో రగిలిపోతున్నారు. ఆ సమయంలో ఏమి చేస్తున్నారో అర్థం కాక కుటుంబ సభ్యుల ప్రాణాలు తీస్తున్నారు లేదంటే తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు చర్చానీయాంశంగా మారాయి. మొన్నటికి మొన్న భార్య మీద కోపంతో తన నాలుక కోసుకున్న భర్త ఉదంతం వెలుగుచూస్తే.. తాజాగా మరో భర్త కరెంట్ తీగలు పట్టుకుని సూసైడ్ అటెంప్ట్ చేసిన తీరు ఆందోళన కలిగిస్తోంది. చిన్న చిన్న గొడవలకే భార్యాభర్తల మధ్య ముదురుతున్న వివాదాలు చివరకు ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తున్నాయి.

భార్యతో గొడవపడి.. కరెంట్ తీగలు పట్టుకుని

భార్యతో గొడవపడి.. కరెంట్ తీగలు పట్టుకుని

భార్యతో గొడవపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ భర్త. భార్యతో తగవులాడి చివరకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. చిత్తూరు జిల్లా సి.గొల్లపల్లి పంచాయతీ కనుమలపల్లెకు చెందిన 44 సంవత్సరాల పెద్ద మల్లయ్య ఇంటి సమస్యల కారణంగా భార్యతో గొడవకు దిగాడు. ఆ క్రమంలో ఆమెపై కోపం పెంచుకుని ఇంటి సమీపంలోని కరెంట్ తీగలు పట్టుకుని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. దాంతో అతడి చేతులు కాలిపోయాయి. 108 అంబులెన్స్‌కు స్థానికులు కాల్ చేయడంతో పెద్ద మల్లయ్యను కడప జిల్లాలోని రాయచోటి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు.

అమెజాన్ అడవుల్లో మంటలు ఆర్పుతూ.. యుద్ద విమానాలతో నీళ్లు చల్లుతూ..!

భార్యతో కోపం.. తన నాలుక కోసుకున్న భర్త

భార్యతో కోపం.. తన నాలుక కోసుకున్న భర్త

వారం కిందట నాగర్ కర్నూల్ జిల్లాలో ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. అమ్రాబాద్ మండలం సార్లపల్లికి చెందిన చిగుర్ల చంద్రయ్య, లింగమ్మ దంపతులు. వీరి కాపురంలో తరచుగా గొడవలు జరుగుతుండేవి. అదే క్రమంలో వారం కిందట కూడా భార్యతో గొడవపడ్డాడు. ఆ నేపథ్యంలో భార్య తన మాట వినలేదని కోపంతో ఊగిపోయాడు. ఆ క్రమంలో కత్తితో నాలుక కోసుకున్నాడు. మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. క్షణికావేశంలో చంద్రయ్య తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆయనకు మాటల్లేకుండా చేసింది.

భార్య మీద కోపంతో తల్లిని చంపిన ఘటన

భార్య మీద కోపంతో తల్లిని చంపిన ఘటన

జులై చివరి వారంలో నిజామాబాద్ జిల్లా లో దారుణం జరిగింది. ఎడపల్లి మండలం మంగల్ పాడ్ గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం తాగి భార్య కళావతితో గొడవ పడి కొట్టబోయాడు. అతడి నుంచి తప్పించుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. అయితే మత్తులో ఉన్న గంగాధర్ తాను ఏం చేస్తున్నాడో తెలియక.. భార్య మీద కోపం తల్లి మీద చూపించాడు. ఆమె వృద్ధురాలు కావడంతో కొడుకు కొట్టిన దెబ్బలు తాళలేక స్పాట్‌లో చనిపోయింది.

భార్య మీద కోపంతో మామను మర్డర్ చేసిన అల్లుడు..!

భార్య మీద కోపంతో మామను మర్డర్ చేసిన అల్లుడు..!

మే నెల చివరి వారంలో భార్యతో జరిగిన గొడవ కారణంగా మామను అంతమొందించాడు ఓ అల్లుడు. జనగామ జిల్లా కడగుట్ట తండాకు చెందిన 48 ఏళ్ల ధారవత్ సోముల కూతురు మంజులను, దేవరుప్పల మండలంలోని ధర్మాపురం గ్రామానికి చెందిన దేవాకు ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఒకరోజు భర్తతో గొడవ పెట్టుకుని తల్లి గారింటికి వెళ్లిపోయింది. తనకు చెప్పాపెట్టకుండా భార్య పుట్టింటికి వెళ్లిపోయిందనే కోపంతో వాళ్లింటికి వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఆ క్రమంలో మామ సోముతో మాటామాట పెరిగి ఆయనపై కర్రతో దాడి చేశాడు. దాంతో సోము అక్కడికక్కడే మృతి చెందాడు.

కోమటిరెడ్డి ప్లాన్‌కు పోలీసులు బ్రేక్.. హైకోర్టును ఆశ్రయిస్తానంటూ సవాల్..!

క్షణికావేశం వద్దు.. ఆలోచన ముద్దు..!

క్షణికావేశం వద్దు.. ఆలోచన ముద్దు..!

కుటుంబం అన్నాక గొడవలు, తగాదాలు సహజం. ఇక భార్యాభర్తలంటే అవి కాస్తా ఎక్కువని చెప్పొచ్చు. ఒకే దగ్గర ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఏదో విషయంలో తగవు పడటం సహజం. అయితే వాటిని ఓర్పుతో, సామరస్యంగా పరిష్కరించుకుంటే ఖేల్ ఖతం, దుకాణం బంద్ అనే రీతిలో అవి అక్కడికక్కడే సమసిపోతాయి. అయితే కొందరు చిన్న చిన్న తగాదాలను భూతద్దంలో చూస్తూ లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నారు. గొడవ సద్దుమణిగాక కాస్తా ఓపిగ్గా ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది. అంతేగానీ క్షణికావేశానికి లోనై మనఃశాంతి లేకుండా చేసుకోవడం సరికాదంటున్నారు సైకాలజిస్టులు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Furious husbands burst into rage over wives. Without realizing what they were doing at the time, family members came into risk. A series of recent events have been the subject of discussion. When a husband who cuts his tongue angrily over the wife, the latest incident of another husband holding the current wires, Suicide Attempt is concerned. Growing conflicts between the husband and wife eventually lead to similar situations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more