వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్దపల్లి ప్రజలకు సేవ చేయాలనుంది...అందుకే రాజీనామా: గడ్డం వివేక్

|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: మాజీ ఎంపీ తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు గడ్డం వివేక్ తన పదవికి రాజీనామా చేశారు. ఇదే విషయాన్ని తెలుపుతూ తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపారు. 2019 ఎన్నికల్లో పెద్దపల్లి టికెట్ తనకే కేటాయిస్తానని చెప్పడంతో టీఆర్ఎస్‌కు తిరిగి వచ్చినట్లు తన లేఖలో పేర్కొన్న వివేక్... తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు తన తండ్రి ఎలాగైతే పెద్దపల్లి ప్రజలకు సేవ చేశారో... ఎంపీగా తాను కూడా సేవచేయాలని భావిస్తున్నట్లు చెప్పారు వివేక్.

ఇక పెద్దపల్లి సీటుపై వివేక్ ఆశలు పెట్టుకున్నప్పటికీ కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడంపై మనస్తాపానికి గురయ్యారు వివేక్. కొందరు తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని వివేక్ తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందుగా ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇక పెద్దపల్లి టికెట్‌ను పార్టీలో కొత్తగా చేరిన వెంకటేష్ నేతకు కేసీఆర్ కేటాయించారు.

గల్లీలో తెలంగాణ సేవకులం, ఢిల్లీలో తెలంగాణ సైనికులం. ఏదీచేసినా రాష్ట్రం కోసమే : కవిత నామినేషన్ దాఖలుగల్లీలో తెలంగాణ సేవకులం, ఢిల్లీలో తెలంగాణ సైనికులం. ఏదీచేసినా రాష్ట్రం కోసమే : కవిత నామినేషన్ దాఖలు

G.Vivek resigned to his post

ఇక వివేక్ తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇండిపెండెంట్‌గానే ఆయన పెద్దపల్లి బరిలో నిలుస్తారని సమాచారం. 2014లో అప్పుడు కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీచేసిన వివేక్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన బాల్కా సుమన్‌పై ఓటమి చవిచూశారు.

English summary
In a shock to CM KCR, Advisor to Telangana government G.Vivek resigned to his post. Vivek who did not get the Peddapalli TRS ticket decided to resign for his post. In this backdrop Vivek submitted his resignation letter to CM KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X