హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మావోయిస్టు పార్టీకి గుడ్ బై, ప్రత్యామ్నాయం కోసమే, ఓటరుగా గద్దర్ సంచలనం

మావోయిస్టు పార్టీని వీడుతున్నట్టుగా ప్రజాయుద్దనౌక గద్దర్ ప్రకటించారు. పార్లమెంటరీ పంథాలో జనం ముందుకు వెళ్ళనున్నట్టుగా ఆయన ప్రకటించారు. పల్లె పల్లెకు పార్లమెంట్ అనే నినాదంతో పర్యటిస్తానని ఆయన చెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మావోయిస్టు పార్టీని వీడుతున్నట్టుగా ప్రజాయుద్దనౌక గద్దర్ ప్రకటించారు. పార్లమెంటరీ పంథాలో జనం ముందుకు వెళ్ళనున్నట్టుగా ఆయన ప్రకటించారు. పల్లె పల్లెకు పార్లమెంట్ అనే నినాదంతో పర్యటిస్తానని ఆయన చెప్పారు.

సుధీర్ఘకాలంపాటు మావోయిస్టు పార్టీ రాజకీయాలతో పెనవేసుకొని ఉన్న ప్రజాయుద్దనౌక గద్దర్ ఆ పార్టీని వీడుతున్నట్టు గురువారం నాడు ప్రకటించారు.

అయితే గద్దర్ పై కాల్పులు జరిగి ఇరవై ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన సభలో గద్దర్ ఈ ప్రకటన చేశారు.పార్టీలో చాలా కాలంపాటు పనిచేసిన గద్దర్ ఈ నిర్ణయం తీసుకోవడానికి పలు కారణాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

పార్టీతో మిత్ర వైరుద్యం ప్రకారమే దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నట్టుగా ఆయన చెప్పారు. బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని ప్రకటించిన నోటి నుండే ఎన్నికల అంశంపై అనుకూలంగా మాట్లాడుతున్నారు గద్దర్.

English summary
Gaddar announces to leaving maoist party on thursday.he will visit 175 places in south india soon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X