వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించిన గ‌ద్ద‌ర్..! కేసీఆర్ పైన స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా పోటీ..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్: ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ త‌న ఉన్న‌త స్వ‌భావాన్ని చాటుకున్నారు. రాజ‌కీయాల్లో చిన్న అవాకాశం వ‌స్తే ఆకాశానికి నిచ్చెన వేయ‌డ‌మే కాకుండా ప‌క్క వ్య‌క్తి ఎంత ఆప్తుడైనా నిర్దాక్షిణ్యంగా తొక్కేసి ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో విలువ‌ల‌తో కూడిన హుందాత‌నాన్ని ప్ర‌ద‌ర్శించారు. స్వ‌యంగా ఎఐసీసీ అద్య‌క్షుడి హోదాలో రాహుల్ గాంధీ ఇచ్చిన అవ‌కాశాన్ని సున్నితంగా తిర‌స్క‌రించి త‌న ప‌రిప‌క్వ‌త‌ను చాటుకున్నారు.

ఇటీవ‌ల ఢిల్లీ లో రాహుల్ క‌లిసిన గ‌ద్ద‌ర్ ఆయ‌న పెట్టిన ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించ‌డ‌మే కాకుండా పోటీ చేస్తే మ‌ద్ద‌త్తు ఇస్తామ‌న్న హామీని తీసుకోగ‌లిగారు. గ‌జ్వేల్ లో నెల‌కొన్న ప్ర‌త్యేక రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను తాను ఎట్టి ప‌రిస్థితుల్లో చెడ‌గొట్ట‌న‌నే సంకేతాలు ఇచ్చారు. ఇంత‌కీ గ‌జ్వేల్ రాజ‌కీయాలు ఏ మ‌లుపు తీసుకున్నాయి..? అక్క‌డ పోటీ చేస్తానంటున్న గ‌ద్ద‌ర్ ఏం చేయ‌బోతున్నారు..? తెలుసుకుందాం..!!

 గ‌జ్వేల్ లో స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా గ‌ద్ద‌ర్..! కాంగ్రెస్ మ‌ద్ద‌త్తు..!

గ‌జ్వేల్ లో స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా గ‌ద్ద‌ర్..! కాంగ్రెస్ మ‌ద్ద‌త్తు..!

గ‌జ్వేల్ లో ఆప‌థ‌ర్మ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు వ‌ర్సెస్ వంటేరు ప్ర‌తాప్ రెడ్డి గా కొన‌సాగుతున్న రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో తాను అసంబ‌ద్దంగా దూర‌బోన‌నే సంకేతాలు ఇచ్చారు ప్ర‌జాగాయ‌కుడు గ‌ద్ద‌ర్. అదే క్ర‌మంలో తాను గ‌జ్వేల్ లో స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా పోటీ చేస్తే మాత్రం కాంగ్రెస్ మ‌ద్ద‌త్తు కావాల‌ని చేసిన ప్ర‌తిపాద‌న‌కు కాంగ్రెస్ అదిష్టానం సుముఖ‌త వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది. దీంతో నొప్పించ‌క తానొవ్వ‌క త‌న కార్యాన్ని చ‌క్క‌బెట్టుకుంటున్నారు గ‌ద్ద‌ర్. గ‌ద్ద‌ర్ తీసుకున్న నిర్ణ‌యానికి అటు వంటేరు ప్ర‌తాప్చ రెడ్డి తో పాటు కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్న‌ట్టు తెలుస్తోంది. కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు గద్దర్. తన ఆట పాటలతో ప్రజలను చైతన్య పరిచిన ఆయన ఎన్నికలకు సిద్ధమంటూ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. తెలంగాణ వచ్చిన తర్వాతే ఆయన రాజకీయ పార్టీ స్థాపించాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా కుదరలేదు.

 ల‌క్ష్యం కేసీఆర్..! గ‌జ్వేల్ లో గ‌జ్జె ఘ‌ల్లుమ‌నిపించ‌నున్న గ‌ద్ద‌ర్..!!

ల‌క్ష్యం కేసీఆర్..! గ‌జ్వేల్ లో గ‌జ్జె ఘ‌ల్లుమ‌నిపించ‌నున్న గ‌ద్ద‌ర్..!!

అయితే ఇటీవల, రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని వెల్లడించారు. అంతేకాదు, పోటీ చేయడానికి ముందు అన్ని పార్టీల నేతలు, ప్రజలను కలిసి మాట్లాడి, త‌న‌ను ఉమ్మడి అభ్యర్ధిగా నిలబెట్టాలని కోరతానని చెప్పారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని సైతం కలిశారు. అప్పటి నుంచి కొన్నియ రోజులు మౌనంగా ఉన్న గద్దర్ తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని వెల్లడించారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదన్నారు. గద్దర్ ఈ ప్రకటన చేయడం వెనుక పెద్ద కారణం ఉందని తెలుస్తోంది.

 రాహుల్ ప్ర‌దిపాద‌నకు ఓకే చెప్తే ఇబ్బందులే..! గ‌జ్వేల్ లో రాజ‌కీయ విచ్చినం వ‌ద్దంటున్న గ‌ద్ద‌ర్..!!

రాహుల్ ప్ర‌దిపాద‌నకు ఓకే చెప్తే ఇబ్బందులే..! గ‌జ్వేల్ లో రాజ‌కీయ విచ్చినం వ‌ద్దంటున్న గ‌ద్ద‌ర్..!!

అన్ని పార్టీలు మద్దతిస్తే గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన గద్దర్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి శ‌ర‌తుల‌తో కూడిన మద్దతు లభించిన‌ట్టు సమాచారం. ఇటీవల ఢిల్లీ వెళ్లి మరీ రాహుల్‌తో భేటీ అయిన ఆయనకు కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి సానుకూల హామీ వ‌చ్చినా అది గ‌ద్ద‌ర్ కి న‌చ్చ‌లేద‌ని తెలిసింది. ఈ భేటీలో ప్రస్తుతం చాలా మంది తనను కేసీఆర్‌పై పోటీ చేయాలని అడుగుతున్నారని, దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు కావాలని గద్దర్, రాహుల్‌ను కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి రాహుల్ మద్దతు ఇవ్వ‌డ‌మే కాకుండా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన‌ట్టు తెలుస్తోంది.

గ‌జ్వేల్ లో త్రిముఖ పోటీ..! గ‌ద్ద‌ర్ ఎంట్రీతో వెడెక్కిన రాజ‌కీయం..!!

గ‌జ్వేల్ లో త్రిముఖ పోటీ..! గ‌ద్ద‌ర్ ఎంట్రీతో వెడెక్కిన రాజ‌కీయం..!!

రాహుల్ కోరికను ఆయన సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. గద్దర్ ప్ర‌జాజీవితాన్ని నిశితంగా తెలుసుకున్న రాహుల్ ఆయ‌న‌కు మద్దతివ్వడానికి సిద్ధమయ్యారని, అయితే స్వాతంత్ర అభ్యర్థిగా కాకుండా కాంగ్రెస్ పార్టీ గుర్తుపై పోటీ చేయాలనే కండీషన్ పెట్టారని, దీనికి కూడా గద్దర్ ఒప్పుకోలేదనే టెన్ జ‌న్ ప‌థ్ వ‌ర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఈ కారణంగానే గద్దర్ స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. గ‌జ్వేల్ లో నెల‌కొన్న ప్ర‌త్యేక రాజ‌కీయాలు తెలంగాణ వ్యాప్తంగా సంచ‌ల‌నాల‌కు దారితీస్తున్న విశ‌యం తెలిసిందే..! ఆప‌థ‌ర్మ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు, వంటేరు ప్ర‌తాప్ రెడ్డి మ‌ద్య ర‌గులుతున్న రాజ‌కీయం లో తాను ఎంట‌ర్ అయ్యే ఉద్దేశం లేక‌నే రాహుల్ ప్ర‌తిపాద‌న తిర‌స్క‌రించిన‌ట్టు తెలుస్తోంది. గ‌ద్ద‌ర్ స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా గ‌జ్వేల్ బ‌రిలో దిగితే త్రిముక పోటీ త‌ప్ప‌దంటున్నారు విశ్లేష‌కులు.

English summary
In the upcoming elections, he said he would contest as an independent candidate from Gajewal constituency, represented by KCR.If he is contesting as an independent candidate in Gajewal. The Congress seems to be willing to give a proposal to Congress supporting it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X