వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్ ఉప ఎన్నికల్లో గద్దరే!: కెసిఆర్‌కి షాకిస్తారా, కాంగ్రెస్-టిడిపి ఏం చేస్తాయి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రజా యుద్ద నౌక గద్దర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు షాకిచ్చేనా? ఆయన ఉప ఎన్నికల్లో నిలిచేనా? దీనిపై చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా, ఆయన వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సానుకూలత వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సీతారాం మంగళవారం నాడు చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు గద్దర్ సానుకూలత వ్యక్తం చేశారని చెప్పారు. ఒకటి రెండురోజుల్లో ఆయనే ఈ విషయాన్ని వెల్లడిస్తారని చెప్పారు.

వంరగల్ జిల్లా పాలకుర్తిలో ఎల్లుండి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణకు గద్దర్ వచ్చే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఆ సభలోనే గద్దర్ పేరును ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలిపారు. వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గద్దర్ బరిలోకి దిగవచ్చునని అభిప్రాయపడ్డారు.

Gaddar may contest in Warangal by polls

నారాయణ ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సిపిఎం పోటీ చేస్తుందన్నారు. కాగా, వరంగల్ ఉప ఎన్నికల్లో గద్దర్ పోటీ విషయం చాలా రోజులుగా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు ఆయన అంగీకరించినట్లుగా చెబుతున్నారు.

వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ గద్దర్ పోటీ పడితే ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తాయి. తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించిన గద్దర్ బరిలోకి దిగితే... టిడిపి, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు విరమించుకుంటాయా? కెసిఆర్‌కు గట్టి షాక్ ఇచ్చేందుకైనా లేదా గద్దర్ పైన సానుకూలతతో వారు వెనక్కి తగ్గుతారా? గద్దర్ ముఖ్యమంత్రికి షాకిస్తారా? అనే చర్చ సాగుతోంది.

English summary
Gaddar may contest in Warangal by polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X