వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా టెస్టు భయంతో కారు రాంగ్ టర్న్.. వాగులో గర్భిణి గల్లంతు.. కొద్ది దూరంలో తుంగభద్ర..తీవ్ర ఉత్కంఠ

|
Google Oneindia TeluguNews

ఆమెది కడప జిల్లా పొద్దుటూరు.. అతనిది హైదరాబాద్.. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా బెంగళూరులో పనిచేస్తున్నారు.. ఏడాది కిందటే పెళ్లైంది.. ఆమె ఇప్పుడు గర్భవతి కూడా.. స్నేహితుడైన ఓ వ్యక్తి కారు నడపగా బెంగళూరు నుంచి హైదరాబాద్ బయల్దేరారు. ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులోని చెక్ పోస్టు వద్ద కరోనా టెస్టులు చేస్తారేమోనని, హోం క్వారంటైన్ స్టాంపు వేస్తారేమోనని భయపడి అడ్డదారిలో వచ్చేందుకు ప్రయత్నించారు. ఆ రాంగ్ టర్న్ ఇప్పుడామె ప్రాణాలమీదకు తెచ్చింది.. పోలీసుల కథనం ప్రకారం..

జగన్ తీరు పెద్ద జోక్..నిమ్మగడ్డను కూర్చోనిద్దాం..సహజీవనానికి బెడ్లు చాలవు..సాయిరెడ్డి వల్లే: రఘురామజగన్ తీరు పెద్ద జోక్..నిమ్మగడ్డను కూర్చోనిద్దాం..సహజీవనానికి బెడ్లు చాలవు..సాయిరెడ్డి వల్లే: రఘురామ

తప్పు అంచనాతో కారు పల్టీ..

తప్పు అంచనాతో కారు పల్టీ..

నాగ సింధూరెడ్డి(28) తన భర్త శివశంకర్ రెడ్డితో కలిసి హైదరాబాద్ లోని అత్తగారింటికి బయలుదేరింది. లాంగ్ డ్రైవ్ లో తోడు కోసం శివశంకర్ స్నేహితుడైన జిలానీ బాషా కూడా వాళ్లతో పయనమయ్యాడు. జాతీయ రహదారి మీదుగా కర్నూలు దాటి తెలంగాణలోని పుల్లూరు చెక్‌పోస్టు సమీపం వరకు వచ్చారు. అయితే, చెక్‌పోస్టు వద్ద కరోనా పరీక్షలు చేసి, హోం క్వారంటైన్ విధిస్తారేమో అనే భయంతో పాటు ఆలస్యమవుతుందని భావించి డ్రైవింగ్‌ చేస్తున్న జిలానీబాషా జాతీయ రహదారి నుంచి కారును గ్రామాల మీదుగా మళ్లించాడు. పైనుంచి జోరుగా వర్షం కురుస్తుండటంతో రోడ్డు మీద పారుతోన్న వరదని సరిగా అచనా వేయలేక కారును చెప్టాపైకి దూసుకుపోనిచ్చారు. అప్పటికే వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కారు అదుపు తప్పి వాగులో పల్టీ కొట్టింది..

సినీ ఫక్కీలో సింధూ గల్లంతు..

సినీ ఫక్కీలో సింధూ గల్లంతు..

జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ నియోజకవర్గం పరిధిలోని ఉండవెల్లి మండలం కలుగొట్ల గ్రామంలో శనివారం తెల్లవారుజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఉండవెల్లి మండలం పుల్లూరు నుంచి కలుగొట్ల మీదుగా కారుని పోనిచ్చిన జిలానీ.. వాగు ఉధృతిని అంచనా వేయలేక వేగంగా దాటే ప్రయత్నం చేశాడు. కారు పల్టీకొట్టి వాగులోకి దూసుకెళ్లిన సమయలో సింధూ నిద్రలో ఉంది. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే నీట మునిగారు. భార్యను కాపాడేందుకు శివశంకర్ రెడ్డి అతి కష్టంమీద డోర్ తెరిచి, ఆమెను బయటికి లాగే ప్రయత్నం చేశాడు. కానీ వరద ఉధృతి తీవ్రంగా ఉండటంతో చేయి పట్టు తప్పి సింధూ వాగులో కొట్టుకుపోయింది..

గాలింపు చర్యలు వేగవంతం

గాలింపు చర్యలు వేగవంతం

సింధూ నదిలో గల్లంతైపోగా, భర్త శివశంకర్ రెడ్డి, స్నేహితుడు జిలానీ గాయాలతో ఒడ్డుకు చేరగలిగారు. సింధూ గల్లంతైన వాగు నేరుగా తుంగభద్ర నదిలో కలుస్తుంది. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి కేవలం 500 మీటర్ల దూరంలోనే నది ఉండటంతో ఆమె సురక్షితంగా బయటపడుతుందో లేదోననే అనుమానాలు రేకెత్తాయి. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే గద్వాల ఎస్పీ రంజన్‌రతన్, అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ రాములు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రొక్లెయినర్‌ సాయంతో కారును బయటికి తీయించారు. మహిళ ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.

చైనా గుట్టు రట్టు.. రీసెర్చర్ వేషంలో స్పై - కాన్సులేట్‌లో నక్కి ఎఫ్‌బీఐకి చిక్కి - ట్రంప్ సీరియస్..చైనా గుట్టు రట్టు.. రీసెర్చర్ వేషంలో స్పై - కాన్సులేట్‌లో నక్కి ఎఫ్‌బీఐకి చిక్కి - ట్రంప్ సీరియస్..

అక్కడిలా జరగడం మొదటిసారి..

అక్కడిలా జరగడం మొదటిసారి..

శనివారమంతా గాలించినా సింధూ ఆచూకీ లభించలేదు. ప్రమాదం గురించి తెలుసుకున్న ఆలంపూర్ టీఆఎస్ఎస్ ఎమ్మెల్యే అబ్రహాం అక్కడికెళ్లి బాధితులను పరామర్శించారు. వాగులో కారు కొట్టుకుపోయిన నేపథ్యంలో చుట్టుపక్కల ఆ మార్గం గుండా వాహనాలను రానీయకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. బెంగళూరు-హైదరాబాద్ హైవేకు ప్రత్యామ్నాయంగా ఉన్న ఆ రోడ్డుపై నిత్యం వాహనాలు తిరుగుతూనే ఉంటాయని, ఇలాంటి ప్రమాదం జరగడం తొలిసారని కలుగొట్ల గ్రామస్తులు మీడియాకు తెలిపారు.

Recommended Video

After #Elephant, Now Pregnant Cow | Video Surfaces Online!
రెండు రాష్ట్రాల్లో ఉత్కంఠ..

రెండు రాష్ట్రాల్లో ఉత్కంఠ..

వాగులో సింధు గల్లంతైందన్న సమాచారంతో ఏపీలోని ఆమె తల్లిగారి హైదరాబాద్ లోని అత్తగారి కుటుంబం ఘటనాస్థలికి వెళ్లారు. తన కూతురు సింధు ప్రస్తుతం గర్భిణి అని ఆమె తండ్రి రామాంజనేయ రెడ్డే వెల్లడించారు. హైదరాబాద్‌ లో ఉంటున్న అత్తగారింటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. వాగులో గల్లంతైన ప్రదేశానికి చుట్టుపక్కల సింధు ఆచూకీ లభించకపోవడంతో.. బహుశా తుంగభద్ర నదిలోకి కొట్టుకుపోయి ఉంటుందేమోనని అధికారులు భావిస్తున్నారు. రెస్క్యూ సిబ్బంది, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని సీఐ వెంకట్రామయ్య తెలిపారు. నాగసింధూ రెడ్డి క్షేమ సమాచారంపై రెండు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

English summary
A possible ploy to avoid getting stamped for home quarantine while entering the State, went tragically wrong after a woman passenger of a car got swept away in flash floods in a rivulet which was in spate in Jogulamba Gadwal district on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X