వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాంధీ ఆసుపత్రిలో రాసలీలలు, రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకొన్న రోగులు

గాంధీ ఆసుపత్రిలో కాపలా విధులు నిర్వహించాల్సిన సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రి ఆవరణలోనే ఉద్యోగులతో రాసలీలలు కొనసాగిస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో కాపలా విధులు నిర్వహించాల్సిన సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రి ఆవరణలోనే ఉద్యోగులతో రాసలీలలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ తతంగాన్ని గమనించిన రోగుల బంధువులు వారిని రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకొన్నారు. ఈ ఘటన గురువారం నాడు చోటుచేసుకొంది.

Recommended Video

Gandhi Hospital, Secunderabad : Sai Pravalika Died - Fungus-Infected Saline | Oneindia Telugu

నిరుపేద రోగులకు ఇబ్బందులు కలగకుండా కాపలాకాయాల్సిన సెక్యూరిటీ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో రోగులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించిన సంఘటన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. గాంధీ ఆస్పత్రిలో ఎజిల్‌ గ్రూప్‌ సంస్థ సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్‌ కంట్రోల్, పేషెంట్‌ కేర్‌ విభాగాలను కాంట్రాక్టు పద్ధతిలో నిర్వహిస్తోంది.

 Gandhi Hospital security guard caught with a woman

సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన రాంకిలాన్‌ పాండే , రాజు, సదానంద్‌పాండే, భరత్‌మోహన్, సందీప్‌పాండే ఆస్పత్రి సెల్లార్‌లోని ఓ గదిలో ఉంటున్నారు. రాంకిలాన్‌పాండే సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ . మిగిలిన వారంతా గార్డులు.

15 రోజుల క్రితం ఓ మహిళ ఎజిల్‌ సంస్థ తరుపున ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా చేరింది. ఆమెపై కన్నెసిన సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ రాంకిలాన్‌ పాండే ఉద్యోగంలోంచి తీసేస్తానని బెదిరించి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. బుధవారం రాత్రి ఆమె గైనకాలజీ ఇన్‌పేషెంట్‌వార్డులో విధులు నిర్వహిస్తుంది, అక్కడికి వచ్చిన పాండే ఆమెను తీసుకుని ఫ్యామిలీప్లానింగ్‌ విభాగంలోని ఓ గదిలోకి వెళ్లాడు. దీనిని గుర్తించిన రోగులు గదికి బయట నుంచి గడియ పెట్టి ఆస్పత్రి అధికారులు, అవుట్‌పోస్టు పోలీసులకు సమాచారం అందించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం ఉదయం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఎదుట హాజరుపరిచారు.

అసభ్యకరమైన రీతిలో పట్టుబడిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులను తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నామని ఇంఛార్జీ సూపరింటెండ్ నర్సింహ్మారావు ప్రకటించారు. బీహార్‌కు చెందిన మరో నలుగురు సెక్యూరిటీగార్డులపై నిర్వహణ సంస్థ ఎజిల్‌ గ్రూప్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు..

English summary
A security guard at Gandhi Hospital named Ramkilon Pandey was caught by patients in a compromising position with a woman on the second floor of the hospital on Wednesday night. The two were in the changing room in the gynaecology ward when a patient noticed them. The patient locked the door from outside and raised a hue and cry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X