బాపూఘాట్లో గాంధీని నివాళులు
హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని లంగర్ హౌస్‌లోని బాపూఘాట్లో ఆయనకు అంజలి ఘటించారు. పలువురు ప్రముఖులు బాపూఘాట్‌లోని గాంధీ విగ్రహాం ఎదుట పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. గవర్నర్ నరసింహాన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయలతో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు అంజలి ఘటించిన వారిలో ఉన్నారు.