హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

23న పోలింగ్: రేపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వరంగల్ జిల్లాపై టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. జిల్లాలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారో సీఎం కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దేవాదుల ప్రాజెక్టును ఎందుకు పూర్తిచేయడం లేదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కంతనపల్లిని రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల మృతిపై కేసీఆర్‌ స్పందించాలని, వరంగల్‌కు ఔటర్‌ రింగ్‌రోడ్డు వేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆదివారం సాయంత్రం జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌?

ఆదివారం సాయంత్రం జీహెచ్ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడుతుందని అందరూ భావిస్తున్నారు. శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయం జీహెచ్‌ఎంసీ వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంది. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికలను జనవరి 23న పోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉంది.

Gandra slams kcr govt over discrimination on warangal district

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందనే సమాచారంతో అన్ని పక్షాల నేతలు ఎన్నికలకు సమాయత్తమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారానికి సిద్ధమైంది. నోటిఫికేషన్ రాకపోయినా ప్రచార కార్యక్రమాలను ఖరారు చేసుకుంది. ఆదివారం నుంచి గ్రేటర్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టబోతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.

గ్రేటర్ పరిధిలో 150 డివిజన్లలో 84 హైదరాబాద్ సిటీ పరిధిలో ఉండగా, 64 రంగారెడ్డి పరిధిలో, 2 మెదక్ జిల్లా పరిధిలో ఉన్నాయి. మరోవైపు ఎన్నికల ప్రణాళికను ఖరారు చేసుకు న్న నాయకులు ఆదివారం గాంధీభవన్‌లో 150 డివిజన్లకు కాంగ్రెస్ నియమించిన ఎన్నికల పార్టీ పరిశీలకులు, డివిజన్ కమిటీలతో సమావేశమవుతున్నారు.

ఈ నెల 5న ఉదయం 11 గంటలకు గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల్లో డివిజన్ కమిటీలు, బూత్ కమిటీల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 7నుంచి అన్ని డివిజన్లలో ఇంటింటి ప్రచారం చేపట్టాలని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది.

English summary
Gandra slams kcr govt over discrimination on warangal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X