వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'తలసాని రాజీనామా విషయం నిజమైతే 8నెలలు ఎందుకు దాచారు?'

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్: తన జోలికి వస్తే ఎవర్నీ వదిలి పెట్టనన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గండ్ర వెంకటరమణా రెడ్డి మంగళవారం నాడు కౌంటర్ ఇచ్చారు. రాజీనామా విషయంలో తలసాని చెప్పింది నిజమైతే 8 నెలలుగా దానిని ఎందుకు దాచిపెట్టుకున్నారో స్పీకర్ సమాధానం చెప్పాలన్నారు.

వ్యక్తిగత ఆరోపణలు చేయడం ద్వారా రాజీనామా వివాదం నుంచి తలసాని తప్పించుకోలేరని గండ్ర అన్నారు. తలసాని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, పార్టీ ఫిరాయించడం లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గవర్నర్ నరసింహన్‌కు రికమండ్ చేసి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారని గండ్ర ఆరోపించారు.

Gandra Venkata Ramana Reddy question to Talasani

టిడిపి నుంచి గెలిచినా ఆయన రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించారన్నారు. చట్టాలను పరిరక్షించే బాధ్యత సభాపతి, గవర్నర్‌ల పైన ఉందని చెప్పారు. ఎంపీ పదవికి కడియం శ్రీహరి చేసిన రాజీనామాను లోకసభ స్పీకర్ ఆమోదించినప్పుడు, తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ ఎందుకు ఆమోదించరన్నారు.

సమాచారహక్కు చట్టం ప్రకారం తాను దరఖాస్తు చేసినప్పుడు తలసాని రాజీనామా లేఖ తమ కార్యాలయంలో లేదని, అందుకే దాని ప్రతిని అందివ్వలేకపోతున్నామని స్పీకర్‌ కార్యాలయం చెప్పిందని వివరించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం కేసీఆర్‌కు తగదన్నారు.

English summary
Congress Party senior leader Gandra Venkata Ramana Reddy has questioned, Why Speaker hide about Talasani Srinivas Yadav resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X