హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

27నే గణేష్ నిమజ్జనం: ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు, సమీక్ష(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సెప్టెంబర్ 27న గణేశ్ నిమజ్జనోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నామని తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తెలిపారు. ఎప్పటిమాదిరిగానే ట్యాంక్‌బండ్‌లోనే నిమజ్జనం జరుగుతుందని ఎలాంటి సందేహాలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు.

హోంమంత్రి మంగళవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, వాణిజ్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లతో కలిసి మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.

సెక్రటేరియట్‌లో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీతో సమీక్షా సమావేశం నిర్వహించామని, శాంతియుతంగా ఈ ఉత్సవాలను జరిపేందుకు కావాల్సిన చర్యలపై చర్చించామని నాయిని తెలిపారు. గణపతి నవరాత్రులను, అనంతరం నిమజ్జనోత్సవాన్ని కన్నులపండవగా నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీకి సమన్వయ బాధ్యతలను అప్పగించామని హోంమంత్రి వివరించారు.

అన్ని రాజకీయ పార్టీలు, అన్ని మతాలు, ఉత్సవ కమిటీలను ప్రభుత్వానికి పూర్తి సహకరాం అందించాలని ఆయన కోరారు. సెప్టెంబర్ 24న బక్రీద్ పండగ కూడా వస్తున్నదని, ఈ రెండు పండుగలను హిందూ ముస్లింలు కలిసిమెలిసి చేసుకుంటారని, ఇందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లను చేస్తున్నదని హోంమంత్రి చెప్పారు.

సమీక్షా సమావేశం

సమీక్షా సమావేశం

సెప్టెంబర్ 27న గణేశ్ నిమజ్జనోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నామని తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తెలిపారు.

సమీక్షా సమావేశం

సమీక్షా సమావేశం


ఎప్పటిమాదిరిగానే ట్యాంక్‌బండ్‌లోనే నిమజ్జనం జరుగుతుందని ఎలాంటి సందేహాలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు.

సమీక్షా సమావేశం

సమీక్షా సమావేశం

హోంమంత్రి మంగళవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, వాణిజ్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లతో కలిసి మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.

సమీక్షా సమావేశం

సమీక్షా సమావేశం

సెక్రటేరియట్‌లో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీతో సమీక్షా సమావేశం నిర్వహించామని, శాంతియుతంగా ఈ ఉత్సవాలను జరిపేందుకు కావాల్సిన చర్యలపై చర్చించామని నాయిని తెలిపారు.

సమీక్షా సమావేశం

సమీక్షా సమావేశం

గణపతి నవరాత్రులను, అనంతరం నిమజ్జనోత్సవాన్ని కన్నులపండవగా నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీకి సమన్వయ బాధ్యతలను అప్పగించామని హోంమంత్రి వివరించారు.

సమీక్షా సమావేశం

సమీక్షా సమావేశం

అన్ని రాజకీయ పార్టీలు, అన్ని మతాలు, ఉత్సవ కమిటీలను ప్రభుత్వానికి పూర్తి సహకరాం అందించాలని ఆయన కోరారు.

గణేశ్ పందిళ్లకు పోలీసుల అనుమతికి సంబంధించి నిబంధనల్లో సడలింపులు ఉంటాయని ఆయన తెలిపారు. గణపతి నిమజ్జనోత్సవాన్ని మహోన్నతంగా నిర్వహించి మరోసారి హైదరాబాద్ పేరుప్రతిష్ఠలను, ఘనచరిత్రను చాటిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్బంగా మంచినీటిసరఫరా, విద్యుత్తు, బందోబస్తు, కాలుష్యనియంత్రణ, దేవాదాయ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ, రోడ్లు, భవనాలు తదితర శాఖలన్నింటినీ అప్రమత్తం చేశామని హోంమంత్రి చెప్పారు.

వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు క్రేన్‌ల కొరత లేకుండా చూస్తామని, చూడటానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తామని, భద్రత కట్టుదిట్టంగా ఉంటుందని హోంమంత్రి హామీ ఇచ్చారు. కాగా, గణేష్ మండలపాల ఏర్పాట్లపై పోలీసులు అమితమైన ఆంక్షలు విధించడంపై భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రతినిధులు సమీక్షా సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

English summary
Bhagyanagar Ganesh Utsav Samithi (BGUS) general secretary Bhagwanth Rao, after attending a review meeting with home minister Nayani Narasimha Reddy at the Secretariat here on Tuesday, told reporters that the police put several conditions including obtaining affidavit from the organisers of pandals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X