హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జాబ్ మేళా పేరుతో మోసం: అరెస్టు చేసిన పోలీసులు

జాబ్ మేళా పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన హైదరాబాదులోని ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వ్యక్తులను హైదరాబాదులోని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ గోనె సందీప్‌రావు వివరాలు వెల్లడించారు.

మల్లాపూర్‌కు చెందిన నెమలి కుమార్(25), మౌలాలి జవహర్‌నగర్‌కు చెందిన లింగాల సుమిత్(26) అద్విత సేవా ఫౌండేషన్ పేరుతో మెగా ఉద్యోగ మేళా ను ఫిబ్రవరి 26న ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కళాశాలలో నిర్వహించారు.

gang arrested for cheating jobless

ఈ మేరకు నిరుద్యోగుల నుంచి రూ.200 రిజిస్ట్రేషన్ చార్జీ వసూలు చేశారు. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు వచ్చారు. అయితే ప్రముఖ కంపెనీలు రాకపోవడం, సెక్యూరిటీగార్డులు, ఎల్‌ఐసీ ఏజెంట్ల వంటి ఉద్యోగాలు ఉండటంతో ఆగ్రహించిన నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు.

అనుమతులు లేకపోవడం, మోసం చేయడం, వారి నుంచి డబ్బులు వసూలు చేయడంపై పోలీసులు కేసు నమోదు చేసి నిర్వాహకులను అరెస్టు చేశారు.

English summary
Two persons arrested for cheating on the name of job mela at Uppal in Hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X