హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దంపతులకు షాక్: బతికి ఉండగానే చనిపోయారని పత్రాలు, భూమి హాంఫట్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. తొమ్మి ది మంది బ్రోకర్లు కుమ్మక్కయి స్థల యజమానులు బతికుండ గానే చనిపోయారని నకిలీ పత్రాలు సృష్టించారు. అందులో ఒకడిని వారసుడని పేర్కొంటూ నకిలీ ఫ్యామిలీ సర్టిఫికెట్ సంపాదించి 200 గజాల స్థలాన్ని విక్రయించారు.

ఆ స్థలం అసలు యజమాని తన ప్లాట్‌ను చూసేందుకు వెళ్లగా అసలు విషయం బయటపడింది. ఇది ఎప్పుడో అమ్మేశారని స్థానికులు చెప్పడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి సెర్చ్ ఈసీ తీయగా తాను, తన భార్య చనిపోయినట్లు నమోదైన పత్రాలను చూసి షాక్‌కు గురయ్యారు.

వెంటనే విషయాన్ని రాచకొండ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో 9 మంది ముఠా సభ్యులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఎల్‌బీనగర్‌లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయం లో సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు.

ఆ భూమి ఇదీ...

ఆ భూమి ఇదీ...

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కుంట్లూర్‌లోని సర్వే నం-242, 245, 246,247లోని ప్లాట్ నం.261లో 200 గజాల స్థలాన్ని కస్టమ్స్ విభాగానికి చెందిన మాజీ సూపరింటెండెంట్ వీ నాగేశ్‌రావు 1989లో కొనుగోలు చేసి తన భార్య జ్యోతి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు.

వారి కన్ను పడింది...

వారి కన్ను పడింది...

కుంట్లూరులో భూముల ధరలు పెరుగడంతో రియల్ బ్రోకర్ల కన్ను జ్యోతికి చెందిన స్థలంపై పడింది. 2015లో కుంట్లూరుకు చెందిన బ్రోకర్లు బాల్‌రాజు, సురేశ్ సికింద్రాబాద్ సీతాఫల్‌మండిలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ శ్రీధర్‌రెడ్డిని కలిశారు. జ్యోతితోపాటు ఆమె భర్త చనిపోయారని, ప్రస్తుతం ఆ స్థల యజమానులు ఎవరూ లేరని చెప్పారు.

పత్రాలు ఉన్నాయని...

పత్రాలు ఉన్నాయని...

ప్లాట్‌కు సంబంధించిన జిరాక్స్ పత్రాలు తమ వద్ద ఉన్నాయని, నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్ అమ్మి ఆదాయాన్ని పంచుకోవాలని పథకం వేశారు. స్థల యజమాని జ్యోతి, ఆమె భర్త నాగేశ్‌రావు డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను తీసుకురావాలని శ్రీధర్‌రెడ్డి సూచించాడు.

చేతులు కలిపిన ఉద్యోగి...

చేతులు కలిపిన ఉద్యోగి...

సురేశ్, బాల్‌రాజు జీహెచ్‌ఎంసీ సర్కిల్-9 బిల్ కలెక్టర్ వినయ్‌కుమార్‌ను సంప్రదించి విషయం చెప్పారు. వారితో చేతులు కలిపిన వినయ్‌కుమార్.. 2006 మే 6న జ్యోతి, 2004 ఆగస్టు 15న నాగేశ్‌రావు చనిపోయినట్టు నకిలీ డెత్ సర్టిఫికెట్లను తయారు చేశాడు. వీరి వారసుడిగా సురేశ్ పేరుమీద ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను కూడా రూపొందించాడు.

ఇలా సర్టిఫైడ్ కాపీలు

ఇలా సర్టిఫైడ్ కాపీలు

శ్రీధర్‌రెడ్డి ఈ సర్టిఫికెట్లతో హయత్‌నగర్ ఎస్‌ఆర్‌వో ఆఫీసులో దరఖా స్తు చేసి స్థలానికి చెందిన సర్టిఫైడ్ కాపీలను తీసుకున్నాడు. ఈ కాపీలతో శ్రీధర్‌రెడ్డి, బాలరాజ్, సురేశ్, వినయ్‌కుమార్ కలిసి లడ్డు పేరు మీద ఓ జీపీఏను సృష్టించారు. శ్రీధర్‌రెడ్డి ఈ జీపీఏ ద్వారా మధ్యవర్తి భూపాల్‌రెడ్డి సాయంతో సంజీవ్‌కుమార్‌సింగ్ అనే వ్యక్తికి రూ.5 లక్షలకు ప్లాట్‌ను విక్రయించారు. ఈ డబ్బును పైన పేర్కొన్న నలుగురితోపాటు, డాక్యుమెంట్ రైటర్, సాక్షులుగా సంతకాలు పెట్టినవారు పంచుకున్నారు.

పోలీసులు పట్టేశారు...

పోలీసులు పట్టేశారు...

నాగేశ్‌రావు ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి,...చల్లా శ్రీధర్‌రెడ్డి, మొగ ల్పు సురేశ్, ఆస్కా వినయ్‌కుమార్, కుంచలంటి లడ్డు, చిత్రాల జగదీశ్, ముత్యాల గోపీనాథ్, హరికృష్ణ, బద్దం భూపాల్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. సురేశ్, వినయ్‌కుమార్ ఇప్పటికే చంచల్‌గూడ జైలులో ఉన్నారు. వీరిద్దరిపై గతంలో పలు ఫోర్జరీ కేసులు ఉన్నాయి. మిగతా ఏడుగురిని మంగళవారం జైలుకు పంపారు. ఈ ముఠా ఇదే సర్వే నంబర్‌లో మరో రెండు ప్లాట్లను కూడా ఇదేవిధంగా డబుల్ రిజిస్ట్రేషన్ చేసినట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ ముఠా చేసిన రిజిస్ట్రేషన్లు రద్దవుతాయి ఈ ముఠాకు సబ్‌రిజిస్ట్రార్‌కు ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలోనూ విచారిస్తున్నామని సీపీ చెప్పారు.

English summary
A land grabbing gang has been arrested by police. The land grabbing has been taken place at Kuntlooru near Hayathnagar in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X