• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వారిని చంపేయండి, లేదంటే నేనే చంపుతా: గ్యాంగ్ రేప్ విక్టిమ్

By Pratap
|

కరీంనగర్: తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన రాక్షసులను చంపేయాలని, పోలీసులు ఆ పనిచేయకుంటే తానే చంపేస్తానని, వారికి ఈ భూమి మీద బతికే హక్కు లేదని బాధితురాలు అన్నది. తన బాధ అర్థం కావడం లేదా, తాను నరకయాతన అనుభవించానని, అదంతా టీవీల్లో చూశారని ఆమె అన్నారు.

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులో కామాంధుల చేతిలో ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. పోలీసు కావాలనే ఆశతో కోచింగ్‌కు వెళ్లానని, కానీ అక్కడే తన బతుకు బుగ్గిపాలవుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె తన ఆవేదనను సాక్షి మీడియాతో పంచుకుది.

ఘటన వివరాలు ఇలా ఉన్నాయి - నిరుద్యోగులకు వీణవంక పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ ఉద్యోగాల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో 198 మంది ఎన్‌రోల్‌మెంట్ కాగా, 120 మంది ప్రస్తుతం శిక్షణకు హాజరవుతు న్నారు. వీరిలో మండల పరిధిలోని చల్లూరుకు చెందిన యువతితో పాటు శంకరపట్నం మండలం ఆముదాలపల్లికి చెందిన గొట్టె శ్రీనివాస్ (22) ఉన్నాడు. వీరు శిక్షణకు ఎన్‌రోల్‌మెంట్ చే సుకోకుండానే అప్పుడప్పుడూ వస్తున్నారు.

Gang Rape victim says she will ill the accused

పాత పరిచయంతో వారిద్దరూ స్నేహపూర్వకంగా ఉండే వారు. ఇంటర్‌లో యువతికి జూనియర్లయిన శం కరపట్నం మండలం కల్వలకు చెందిన ఇద్దరు వ్యక్తులు తరచూ వారిని కలిసేవారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 10న శిక్షణలో ఉన్న ఇద్దరు యువతులను శ్రీనివాస్ ద్విచక్రవాహనంపై తీసు కెళ్లాడు. ఇందులోంచి ఓ యువతి వాహనంపై నుంచి దూకి పరారవగా చల్లూరుకు చెందిన యు వతిని శంకరపట్నం మండల పరిధిలోని కన్నాపూర్ శివారులో గుట్టల వద్దకు తీసుకెళ్లాడు.

అప్ప టికే అక్కడ ఉన్న మైనర్లతో కలిసి యువతిని బం ధించి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఆపై ఫోన్‌లో చిత్రీకరించి ఆ తర్వాతా ఆమెను వేధించారు. మళ్లీ తమ కోరిక తీర్చాలని భయపెట్టారు. దీంతో విసిగిపోయిన యువతి తన బంధువులకు విషయం చెప్పింది. తీవ్రంగా పరిగణించిన బంధువులు అమ్మాయితో ఫోన్ చేయించి ముగ్గుర్నీ పిలిపించి చితకబాదారు.

Gang Rape victim says she will ill the accused

అదే రోజు సాయంత్రం స మాచారం తెలిసిన వీణవంక ఎస్‌ఐ కిరణ్, నింది తులను అదుపులోకి తీసుకొని విచారణ మొదలు పెట్టారు. సెల్‌ఫోన్లో దృశ్యాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి బాధిత యు వతిని, కుటుంబ సభ్యులను పిలిపించి ఆమెను వైద్యపరీక్షల కోసం పంపించారు. తన స్నేహితురాలు ఫోన్ చేసి చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలు ఆరోపించింది.

బాధితురాలి ఆవేదనను అర్థం చేసుకొని వెంట నే స్పందించామనీ, ఎక్కడా నిర్లక్ష్యం వహించలేదని డీఎస్పీ రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు. లైంగిక దాడి ఘటన తమనూ కలచివేసిందని బాధను వ్యక్తం చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా అందులో ఇద్దరికి గాయాలున్నందున వైద్యశాలలోనే చికిత్స కోసం ఉంచామనీ, మరో నిందితుడు మైనర్ కావడంతో కోర్టు ఆదేశాల మేరకు జువైనెల్ హోంకు తరలించామని వివరించారు. డీఎస్పీ వెంట జమ్మికుంటరూరల్, హుజూరాబాద్‌రూరల్ సీఐలు శ్రీనివాస్, ఎండీ గౌస్‌బాబా, వీణవంక ఎస్‌ఐ కిరణ్ ఉన్నారు.

వీణవంక ఘటనలో షాకింగ్ విషయాలు

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా వీణవంక గ్రామంలో జరిగిన గ్యాంగ్ రేప్ విషయంలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. తనను నిందితురు రేప్ చేయాలన్న ఉద్దేశ్యంతోనే కిడ్నాప్ చేశారని ఆమె ఆరోపించారు. తాను కిడ్నాప్ నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.

వీణవంక దుర్మార్గుల ఆగడాల పైన విచారణ కొనసాగుతోంది. ఈ ముగ్గురు నిందితులు గతంలో కలిసి నేరాలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అమ్మాయిలను వెంబడించి వేధించిన ఆధారాలు పోలీసులకు లభ్యమయ్యాయి. అందమైన అమ్మాయిలను మోసం చేయడం వీరికి అలవాడుగా మారింది. ఫిబ్రవరి 10వ తేదీ నిందితుల నుంచి తప్పించుకొని తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు చెప్పారు.

English summary
Gang Rape victim in Karimnagar said that she wants rape accused to be killed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X