మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జిల్లాలోనే రక్షణ లేదు: తల్లీకూతుళ్ల రేప్‌పై శోభా

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సొంత జిల్లా మెదక్‌లోనే మహిళలకు రక్షణ లేకుండాపోయిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శోభారాణి ఆదివారం విమర్శించారు. మెదక్ జిల్లా దుబ్బాకలో తల్లి-కుమార్తె పైన అత్యాచారానికి పాల్పడిన ఘటనపై విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లో స్నేక్ గ్యాంగ్, జూబ్లీహిల్స్‌లో మెడికోపై అత్యాచారయత్నం, రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో అటో గ్యాంగ్, కీసరలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై అకృత్యం, నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో విద్యార్థినిపై దాడి, ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో సామూహిక అత్యాచారం జరగడం చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఏ మేరకు భద్రత కల్పిస్తుందో అర్థమవుతోందన్నారు.

బతుకమ్మ పేరిట సంబురాలు చేసుకుంటున్న కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ లోకసభ సభ్యురాలు కల్వకుంట్ల కవితకు సాటి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ ప్రచారానికే పరిమితం కాకుండా తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలని, వారికి రక్షణ కల్పించాలన్నారు.

Gang rapes teen, mother

కాగా, రెండు రోజుల క్రితం తల్లి, కూతుళ్లపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన మెదక్ జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలో శుక్రవారం రాత్రి జరిగిన విషయం తెలిసిందే. సమాచారం మేరకు రామక్కపేటకు చెందిన డిగ్రీ చదువుతున్న 17ఏళ్ల విద్యార్థినితో పాటు ఆమె తల్లిపై కూడా దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

తల్లి, కుమార్తె ఇంటికి చేరుకొని శనివారం ఉదయం దుబ్బాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట డిఎస్పీ శ్రీ్ధర్‌రెడ్డి దుబ్బాక స్టేషన్‌కు చేరుకొని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని డిఎన్‌ఏ పరీక్షలకు పంపామన్నారు. ఎస్పీ సూచన మేరకు మహిళా సిఐతో దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు.

దర్యాప్తు పూర్తయ్యాక అత్యాచారానికి పాల్పడ్డ దుండగులను పట్టుకొని నిర్భయ చట్టం కింద కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఈ సంఘటనతో రామక్కపేట, దుబ్బాకల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తల్లి, కూమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డ దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శనివారం దుబ్బాక పోలీస్ స్టేషన్ ముందు దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆదివారం దుబ్బాక బంద్‌కు దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. కెసిఆర్ సూచనల మేరకు బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున 25వేల ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అందించారు.

English summary
A minor girl and her mother were gangraped in the Ramanakkapeta village of Medak district on Friday midnight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X