వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నయీం ఎన్‌కౌంటర్: పోలీసుల అదుపులో అత్త, బావమరిది, ఎంపీపీ

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: షాద్ నగర్‌లో సోమవారం ఉదయం గ్రేహౌండ్స్ పోలీసులు కాల్పుల్లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీం మృతదేహానికి పంచనామా నిర్వహించారు. షాద్‌నగర్, కొత్తూరు ఎమ్మార్వోలతో పాటు షాద్‌నగర్ ఆర్డీఓ సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పంచానామా ముగిసింది.

<strong>నయీం బాధితులెందరో: భార్య ఇంట్లో రూ.కోట్లు, లెక్కించే మెషీన్లతో పోలీస్</strong>నయీం బాధితులెందరో: భార్య ఇంట్లో రూ.కోట్లు, లెక్కించే మెషీన్లతో పోలీస్

పంచనామా పూర్తి అయిన అనంతరం నయీం మృతదేహాన్ని షాద్ నగర్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నయీం ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఉదయం నుంచీ నల్గొండ జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో నయీం గ్రీన్ టీషర్ట్, వైట్ పాయింట్ వేసుకుని ఉన్నాడు.

నిజామాబాద్‌కు చెందిన వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నయీం వాహనాన్ని పోలీసులు వెంబడించడంతో నయీం ఎక్కడున్నాడనే విషయం పోలీసులకు తెలిసింది. షాద్‌నగర్‌లో నయీం బస చేసిన ఇంట్లో కొంత మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నయీం కారు డ్రైవర్‌ కాల్పులు జరిపిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.

<strong>కేసీఆర్‌కు ఫిర్యాదులు: తెలుగు టీవీ ఛానెళ్లలో వైరల్‌గా నయీం ఎన్‌కౌంటర్ దృశ్యాలు</strong>కేసీఆర్‌కు ఫిర్యాదులు: తెలుగు టీవీ ఛానెళ్లలో వైరల్‌గా నయీం ఎన్‌కౌంటర్ దృశ్యాలు

Gangster naeem dead In shadnagar shootout

దీంతో పోలీసులు అతడి కోసం షాబాద్‌ వద్ద తనిఖీలు చేపట్టారు. ఇదిలా ఉంటే సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో నయీం ఒక్కడినే మట్టుబెట్టామని పోలీసులు అధికారికంగా ప్రకటించినప్పటికీ, షాద్‌నగర్ నివాసంలో నలుగురు మహిళలతో పాటు ఎనిమది మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

కాగా, రాజేంద్రనగర్‌ మండలం నెక్‌నాంపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని అల్కపురి టౌన్‌షిప్‌లో ఓ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. శంషాబాద్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ ఆధ్వర్యంలో అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు ఇంటిని ముట్టడించారు. అల్కపురిలో పోలీసులు చుట్టుముట్టిన టౌన్‌షిప్‌ నయీం బావమరిదిగా తెలుస్తోంది.

6 గంటల నుంచి నయీం ఇంట్లో సోదాలు

ఇంటిలో భారీగా నగదు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు నగదు లెక్కింపు మెషిన్లను తీసుకెళ్లారు. 6 గంటల నుంచి నయీం ఇంట్లో సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మెషిన్ల సాయంతో నగదుని లెక్కిస్తున్నారు. నయీం ఇంట్లో పెద్ద మొత్తంలో నగదుని పోలీసులు చేసుకున్నారు.

కోట్లు విలువ చేసే ల్యాండ్ డాక్యమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో భాగంగా నయీం ఇంట్లో ఓ రివాల్వర్‌తో పాటు 20 జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, నగలు, పలు కీలక పత్రాలు, ఆడీ కారు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు దేశయంగా తయారైన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల అదుపులో నయీం అత్త, బావమరిది

మరోవైపు నల్లొండ, భువనగిరిల్లో నయీం బంధువుల ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. నయీం అత్త, బావమరిదిని మిర్యాల గూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భువనగిరి, నల్గొండలోని నయీం ఇళ్లతో సహా పగిడిపల్లి ఎంపీపీ వెంకటేష్ ఇంట్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఎంపీపీ వెంకటేష్‌ను భువనగిరి పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

మూడు నెలలుగా నయీం మకాం అల్కాపురికాలనీలోనే

అల్కాపురికాలనీలోని తన నివాసంలోనే గ్యాంగ్ స్టర్ నయీం మూడు నెలలుగా నివాస మున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఇల్లు నయీం భార్య సాజిదాషహీన్ పేరుతో ఉన్నట్లు సమాచారం. ఈ కాలనీలోని కారు పార్కింగ్ స్థలాన్ని నయీం కబ్జా చేశాడని, ఈ నేపథ్యంలో సంబంధిత గ్రామ పంచాయతీ నోటీసులు కూడా ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

English summary
Gangster naeem dead In shadnagar shootout.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X