వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నయీం ఘాతుకాలు: చెర పట్టే ముందు అమ్మాయిలకు మందు తినిపించేవాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గ్యాంగస్టర్ నయీం ఘాతుకాలు లెక్కకు మిక్కిలిగా వెలుగు చూస్తున్నాయి. నయీం సేకరించిన ఆయుధాలు, మత్తు పదార్థాలపై దృష్టి పెట్టిన అధికారులకు కొత్త విషయాలు తెలిసి వస్తున్నాయి. అమ్మాయిలను చెరపట్టే ముందు నయీం వారికి ఏదో మందు తినిపించేవాడని బాధితులు చెప్పారు. దీన్నిబట్టి నయీం మత్తు పదార్థాల రవాణాకు కూడా ఒడిగట్టాడా అనే విషయాన్ని తేల్చడానికి అధికారులు సిద్ధపడ్డారు.

నయీం గ్యాంగ్‌కు మారణాయుధాలు, మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై ఆరా తీస్తున్నారు. నయీం ఎనకౌంటర్‌ తర్వాత నమోదైన 100దాకా కేసులలో అక్రమ ఆయుధాలకు సంబంధించినవే అధికంగా ఉన్నాయి. తమకు పట్టుబడిన 90 మంది నిందితుల్లో చాలామంది నుంచి ఏదో ఒక ఆయుధా న్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నయీం మృతదేహంవద్ద ఒకటి, అతని ఇంటినుంచి మరొకటి ఏకే47లు లభ్యంకాగా ఇతర ఆయుధాలు, పేలుడుపదార్థాలను భారీ గా స్వాధీనం చేసుకున్నారు. నయీం కుటుంబ సభ్యులు, బంధువులు, ముఠా సభ్యుల ఇళ్లలోనూ ఆయుధాలు లభించాయి. దీంతో ఇవన్నీ ఎక్కడినుంచి సేకరించారన్న దానిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దృష్టి కేంద్రీకరించింది.

 నయీంకు దావూద్‌తో లింక్స్

నయీంకు దావూద్‌తో లింక్స్

ముంబై ముఠాలతోనే కాకుండా దుబాయ్‌లోని దావూద్‌ గ్యాంగ్‌తో నయీంకు సంబంధాలున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీంతో ఆయుధాలు అక్కడినుంచే సరఫరా అయిఉండవచ్చునని భావిస్తున్నారు. నయీం గ్యాంగ్‌పై ఇతర రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదడంతో ఆ వివరాలనూ తెప్పించుకుని సిట్‌ పరిశీలి స్తోంది.

అతన్ని ప్రశ్నించినప్పుడు ఇలా..

అతన్ని ప్రశ్నించినప్పుడు ఇలా..

నయీం అనుచరుడు ఫయాజుద్దీనను ప్రశ్నించినప్పుడు మత్తుపదార్ధాలను కొనుగోలు చేసి మహ్మద్‌ అబ్దుల్‌ ఫహీం, తోట కుమారస్వామి అలియాస్‌ టెక్‌ మధుకు అందజేసినట్లు వెల్లడించాడని తెలుస్తోంది. ఈ మేరకు కోర్టు అనుమతితో ఫహీం, టెక్‌ మధును సిట్‌ బృందం శనివారం కస్టడీకి తీసుకుంది. అక్రమ ఆయుధా లు, మత్తుపదార్ధాలతోపాటు చత్తీస్‌గఢ్‌లో గ్యాంగ్‌ వ్యవహారాలపై వీరినుంచి సమాచారం రాబట్టనున్నారు.

అల్కాపురిలో చిన్నారులపై అఘాయిత్యం

అల్కాపురిలో చిన్నారులపై అఘాయిత్యం

అల్కాపురిలోని నయీం ఇంట్లో కొంతమంది చిన్నారులను పోలీసులు గుర్తించారు. నయీం చాలాసార్లు తమపై అఘాయిత్యానికి పాల్పడేముందు ఏదో మందు తినిపించేవాడని ఆ చిన్నారులు పోలీసులకు తెలిపారు. దీంతో నయీం ముఠాలో ఎవరెవరు మత్తుపదార్ధాలను వినియోగించారు? ఎవరికైనా విక్రయించారా? అనే కోణంలోనూ సిట్‌ దర్యాప్తు చేస్తోంది.

పెరుగుతున్న బాధితుల సంఖ్య

పెరుగుతున్న బాధితుల సంఖ్య

కాగా, సిట్‌ను ఆశ్రయిస్తున్న బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సిట్‌ కంట్రోల్‌ రూంకు దాదాపు 500 ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. మరికొంత మంది నేరుగా ఫిర్యాదు చేస్తున్నారు. నయీం తమ భూములను లాక్కున్నాడంటూ ఇబ్రహీంపట్నం రైతులు కొందరు శుక్రవారం ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. నల్లగొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌లోని పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.

నయీం బెదిరింపులు తట్టుకోలేక విదేశాలకు..

నయీం బెదిరింపులు తట్టుకోలేక విదేశాలకు..

నయీం బెదిరింపులు తట్టుకోలేక దేశం వదలి వెళ్లామంటూ కొంత మంది విదేశాల నుంచి మెయిల్‌ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదుదారులు ఇచ్చిన ఆధారాల వాస్తవికత తెలుసుకునేందుకు సిట్‌ వాటిని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు తరలించింది. బలవంతపు వసూళ్లు, కిడ్నాపులు, బెదిరింపులకు పాల్పడిన కేసుల్లో నిందితులైన 12 మంది నయీం అనుచరులను పోలీసులు భువనగిరి కోర్టులో శుక్రవారం హాజరుపరిచారు.

నయీం ముఖ్య అనుచరులను ఇలా..

నయీం ముఖ్య అనుచరులను ఇలా..

నల్లగొండ జిల్లాజైలులో రిమాండ్‌లో ఉన్న ముఖ్య అనుచరుడు, భువనగిరి మున్సిపల్‌ కౌన్సిలర్‌ అబ్దుల్‌ నాజర్‌తో పాటు కత్తుల నాగరాజు, బచ్చు నాగరాజు, పులిరాజు, శివ నాగరాజు, సందెల ప్రవీణ్‌, రావుల సురేశ్‌, బెంజిమన్‌, మల్లేశ్‌, శ్రీకాంత్, ర్యాకల శ్రీనివాస్‌, మోహిన్‌లను కోర్టులో హాజరుపరచగా వారికి రిమాండ్‌ విధించడంతో తిరిగి నల్లగొండ జైలుకు తరలించారు.

English summary
Thota Kumaraswamy alias Tech Madhu, who is charged with supplying arms to Nayeem and his associates was arrested by the Bhongir police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X