వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసుల నుంచి నయీంకు 25 లక్షల క్యాష్ రివార్డు: అప్పట్లో అదే అన్నం పెట్టింది

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: షాద్‌నగర్‌లోని జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్ స్టర్ నయీం హతమైన తర్వాత అతడి గురించి నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టాప్ నక్సల్ లీడర్లకు సంబంధించిన సమాచారం పోలీసులకు చేరవేసినందుకు గాను పెద్ద మొత్తం నగదు రివార్డులు అందుకున్నట్లుగా తెలుస్తోంది.

1993లో డిఐజి వ్యాస్‌ను ఎల్‌బీ స్టేడియంలో కాల్చి చంపడంతో నయీం పేరు రాష్ట్రమంతా మారు మ్రోగింది. ఆ తర్వాత ఓ ఆపరేషన్‌లో భాగంగా యాదగురి గుట్టకు వచ్చిన నయీంను ఫిబ్రవరి 12, 1993న పోలీసులు అరెస్ట్ అరెస్ట్ చేసి జైలులో పెట్టారు.
ఆ తర్వాత మే 2000న బెయిల్ విడుదలైన నయీం పోలీసుల ఇన్పార్మర్‌గా పనిచేశాడు.

మావో అగ్రనేతల కదలికలు, వారి డెన్‌లు, వ్యూహాలు పోలీస్‌ బాస్‌లకు పూసగుచ్చినట్లు వివరించి వారి ఏరివేతకు సహకరించాడు. మాజీ నక్సలైట్ ఈదన్న హత్య, పౌర హక్కుల నాయకులు పురుషోత్తం, ఆజం అలీ, కనకా చారి, మావోయిస్టు సాంబశివుడు హత్యల్లో నయీం గ్యాంగ్ హస్తం ఉందన్న ఆరోపణలున్నాయి.

పౌర హక్కుల నాయకులు పురుషోత్తం హత్య కేసులో నయీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ అతడి వల్ల ప్రయోజనం ఉందన్న కారణంగా అతడిని పోలీసులు ఏమీ చేయలేదు. పురుషోత్తం హత్య తానే చేశానని మీడియా ఎదుట నయీం అంగీకరించాడు. ఈ సందర్భంలో నక్సలైట్లకు వ్యతిరేకంగా యుద్దం సాగిస్తానని శపధం కూడా చేశాడు.

ఈ క్రమంలో 2000-09 మధ్య కాలంలో టాప్ నక్సల్ లీడర్ల గురించిన సమాచారం ఎప్పటికప్పడు పోలీసులకు చెప్పడంతో వారికి వ్యక్తిగతం బాగా దగ్గరయ్యాడు. టాప్ నక్సల్ లీడర్లకు సంబంధించిన సమాచారం పోలీసులకు చేరవేయడంలో నయీం కీలకపాత్ర పోషించాడు. అప్పట్లో టాప్ నక్సల్ తలకు పోలీసులు రివార్డు ప్రకటించేవారు.

ఈ క్రమంలో ఆ రివార్డును సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో మాజీ నక్సలైట్లను, నక్సలైట్ల అనుచరులను ఎన్నో ఇబ్బందులకు నయీం గురిచేసేవాడు. వారి వద్ద నుంచి సమాచారం సేకరించి గ్రేహౌండ్స్, సిబ్ అధికారులకు సమాచారం చేరవేసేవాడు. ఇందుకు ప్రతిఫలంగా నయీంకు పోలీసులు రివార్డును ఇచ్చేవారు.

ఒకానొక స్టేజిలో పోలీసుల రివార్డులపైనే నయీం ఆధారపడి పనిచేసేవాడని కూడా తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల నుంచి దాదాపు రూ. 25 లక్షల రివార్డుని పొందినట్లు తెలిసింది. కర్ణాటకలో నక్సలైట్లను ఏరివేసేందుకు అక్కడి పోలీసు ఉన్నాధారికారులకు ముఖ్యమైన సమాచారం అందించాడనే వాదన కూడా ఉంది.

నయీంను ప్రోత్సహించిన పోలీసులు

నయీంను ప్రోత్సహించిన పోలీసులు

నక్సలైట్లను ఏరివేసే క్రమంలో పోలీసులు కూడా నయీంను బాగా ప్రోత్సహించేవారు. పోలీసులు రివార్డులను దృష్టిలో పెట్టుకుని నయీం కూడా మాజీ నక్సలైట్లను పలు రకాల ఇబ్బందులకు గురి చేసి వారి వద్ద నుంచి సమాచారం సేకరించేవాడు. నయీంను పోలీసులు అన్ని విధాలా వాడుకున్నట్లు చివరకు అవసరం తీరిపోయాక అంతమొందించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

 పోలీసులకు ఇన్ఫార్మర్‌గా

పోలీసులకు ఇన్ఫార్మర్‌గా

ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి తెలిపిన సమాచారం మేరకు నయీం తన సేవలను ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా అందించాడు. ఒరిస్సా, ఛత్తీస్‌గడ్ లాంటి రాష్ట్రాల్లో నక్సలైట్ల ఏరివేతకు అక్కడి పోలీసులకు ఎంతగానో ఉపయోగపడ్డాడని తెలిపారు. పోలీసులకు ఇన్ఫార్మర్‌గా పనిచేస్తూనే 2009 నుంచి మాజీ నక్సలైట్లు, రౌడీషీటర్లతో కలిసి ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుని దందాలు, సెటిల్ మెంట్లు చేయడం మొదలుపెట్టాడు.

పోలీసులు బాస్‌లనే ఎదురించే స్థాయికి నయీం

పోలీసులు బాస్‌లనే ఎదురించే స్థాయికి నయీం

పోలీసులకు సహకరిస్తున్నాడనే ఒక్కే ఒక్క కారణందో నయీం దందాలు, సెటిల్‌మెంట్లను సైతం చూసిచూడనట్టు మిన్నుకుండిపోయారని ఆయన తెలిపారు. ఒకానొక సమయంలో పోలీసులు బాస్‌లనే ఎదురించే స్థాయికి నయీం ఎదిగాడు. దందాలు, సెటిల్‌మెంట్లలో పోలీసులకు వాటాలు ఇచ్చి సొంత మనిషిలా మారాడు.

 ఇద్దరు డీఎస్పీలకు నయీం వల్లే పదోన్నతులు

ఇద్దరు డీఎస్పీలకు నయీం వల్లే పదోన్నతులు

అంతేకాదు ఇద్దరు డీఎస్పీలకు నయీం వల్లే పదోన్నతులు లభించాయని పోలీసులు దర్యాప్తులో కూడా వెల్లడైంది. కోవర్టు నుంచి కోటీశ్వరుడిగా ఎదిగిన నయీంపై కూడా 100 కేసులు నమోదయ్యాయి. అయితే అతడిపై పోలీసులు రివార్డు ప్రకటించక పోవడం విశేషం.

 మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా నయీం

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా నయీం

హైదరాబాద్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లా పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా నయీం మారాడు. 2007లో ఓ సారి పోలీసులు పట్టుకుని కోర్టులో హాజరు పరిచినా తప్పించుకు పోయాడు. గుజరాత్‌లో వివాదాస్పదమైన సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులోనూ నయీం పేరు ప్రముఖంగా వినిపించింది.

సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో సాక్షిగా నయీం

సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో సాక్షిగా నయీం

సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో గ్యాంగ్‌స్టర్ నయీం ఒక్కడే సాక్షిగా ఉన్నాడు. సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్‌కు ముందు అతడిని తన భార్యతో పాటు ముంబై నుంచి హైదరాబాద్‌కు బస్సు ఎక్కించాడు.

English summary
Gangster Nayeem bagged the maximum cash rewards from the police for the heads of Naxal leaders. After his arrest on February 12, 1993 in connection with the murder of IPS officer N.S. Vyas’, he became an informer for the police and was released in May 2000 on bail. After his second arrest in connection with APCLC member K. Purushotham’s murder, he was used by the police for eliminating top Naxals or nabbing them alive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X