• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈటల వర్సెస్ గంగుల : నిండు నూరేళ్ళు బ్రతకాలంటూనే .. హత్య కుట్ర వ్యాఖ్యలపై నిరూపించాలని ఛాలెంజ్ !!

|

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో నిన్న పాదయాత్రను ప్రారంభించారు. కమలాపూర్ మండలం బత్తిని వారి పల్లె నుండి ప్రజాక్షేత్రంలోకి వెళ్లిన ఈటల రాజేందర్ తనపై హత్య కుట్రలు చేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక ఈ విషయాన్ని తనకు ఒక మాజీ నక్సలైట్ సమాచారం అందించారని ఈటల రాజేందర్ చెప్పడం తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.జిల్లాకు చెందిన మంత్రి ఈటల రాజేందర్ ను హతమార్చడానికి కుట్ర చేస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్ జిల్లా మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు.

  Gangula Kamalakar Rao Responded On Telangana Budjet
  ఈటల రాజేందర్ నిండు నూరేళ్ళు బ్రతకాలని తాను కోరుకుంటున్నా: గంగుల కమలాకర్

  ఈటల రాజేందర్ నిండు నూరేళ్ళు బ్రతకాలని తాను కోరుకుంటున్నా: గంగుల కమలాకర్

  ఈటల ఆరోపణలన్నీ అబద్ధాలేనని కేవలం ఎన్నికలలో సానుభూతి కోసం ఈటల ఇలా మాట్లాడుతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ కు తనకు రాజకీయ వైరం తప్ప వ్యక్తిగత కక్ష లేదని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. ఇదే సమయంలో ఈటల రాజేందర్ నిండు నూరేళ్ళు బ్రతకాలని తాను కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఇక ఈటలకు ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తుందని పేర్కొన్న మంత్రి గంగుల కమలాకర్ ఆరోపణల్లో వాస్తవం లేదని చెబుతూనే ఈటల ఆరోపణలపై త్వరగా నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.

  సీబీఐతో కానీ ఎన్ఐఏతో కాని విచారణ జరిపించుకోవచ్చన్న గంగుల కమలాకర్

  సీబీఐతో కానీ ఎన్ఐఏతో కాని విచారణ జరిపించుకోవచ్చన్న గంగుల కమలాకర్

  బిజెపిలో ఉన్న ఈటల రాజేందర్ హత్య కుట్రపై అవసరమైతే సీబీఐతో కానీ ఎన్ఐఏతో కాని విచారణ జరిపించుకోవచ్చని స్పష్టం చేశారు. మాజీ మావోయిస్టు ఏ మంత్రి పేరు చెప్పాడో ఈటల బయటపెట్టాలని డిమాండ్ చేసిన గంగుల కమలాకర్ విచారణలో తన పేరు ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. ఏ దర్యాప్తు సంస్థ విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. ఇక ఇదే సమయంలో కెసిఆర్ హయాంలో రాజకీయ హత్యలు ఉండవని, రాజకీయ ఆత్మహత్యలే ఉంటాయని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.

  ఈటల ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డు వేస్తానన్న మంత్రి

  ఈటల ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డు వేస్తానన్న మంత్రి


  ఈటలకు ఎలాంటి భయం అవసరం లేదని, ఆయన ప్రాణాలకు తన ప్రాణాలను అడ్డుపెట్టి కాపాడుకుంటా అని పేర్కొన్నారు. తనకు నేరచరిత్ర లేదంటూ గంగుల కమలాకర్ చెప్పుకున్నారు. ఇదే సమయంలో దళిత బంధు మాత్రమే కాదు రైతుబంధు పథకాన్ని కూడా ప్రభుత్వం హుజురాబాద్ నుంచి ప్రారంభించిందని, ఎన్నికలకు పథకాలకు సంబంధం లేదని గంగుల కమలాకర్ దళిత బంధుపై వస్తున్న విమర్శలపై స్పష్టత ఇచ్చారు.

  ఈటల వర్సెస్ గంగుల కమలాకర్ .. హుజూరాబాద్ రాజకీయం రసవత్తరం

  ఈటల వర్సెస్ గంగుల కమలాకర్ .. హుజూరాబాద్ రాజకీయం రసవత్తరం


  ఇక నిన్న తనపై హత్యకు కుట్ర జరుగుతోందని టీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డ ఈటల తన హత్య కోసం హంతక ముఠాతో జిల్లా మంత్రి చేతులు కలపాడని ఆరోపణలు గుప్పించారు. ఇదే సమయంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఈటల రాజేందర్ అరేయ్ కొడకల్లారా నన్ను చంపుతానని నయీమ్ బెదిరించినప్పుడే నేను భయపడలేదు, ఇప్పుడు మీ చిల్లర బెదిరింపులకు కూడా భయపడను అంటూ తేల్చి చెప్పారు. ఇప్పుడు తెలంగాణాలో ఈటల రాజేందర్ వర్సెస్ గంగుల కమలాకర్, హుజురాబాద్ ఉప ఎన్నిక పోరు తాజా పరిణామాలతో పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది.

  English summary
  Gangula Kamalakar responded on Etela Rajender comments on conspiracy to murder him. he asked to CBI or the NIA probe if necessary. Gangula Kamalakar, said he would resign from the ministry if his name was on trial.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X