వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్ర‌బుల్ షూట‌ర్ కు ట్ర‌బుల్స్‌ : కేసీఆర్‌-హ‌రీష్ మ‌ధ్య గ్యాప్ పెరుగుతోందా: నెల రోజులుగా మాటల్లేవ్‌

|
Google Oneindia TeluguNews

Recommended Video

There Is No Communication Between KCR And Harish Eao? | Oneindia Telugu

టిఆర్‌య‌స్ లో ఏం జ‌రుగుతోంది. టిఆర్‌య‌స్ ట్ర‌బుల్ షూట‌ర్ హ‌రీష్ పరిస్థితి ఏంటి. కేసీఆర్ - హ‌రీష్ మ‌ధ్య గ్యాప్ పెరుగుతోందా. వీరిద్ద‌రి మ‌ధ్యా మాట‌లే క‌రువ‌య్యే ప‌రి స్థితి ఎందుకు వ‌చ్చింది. హ‌రీష్ అభిమానులు ఎందుకు ఆందో ళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. హ‌రీష్ విష‌యంలో పార్టీ అధినేత తీరు యాధృచ్చిక‌మా..వ్యూహాత్మ‌క‌మా...

ట్ర‌బుల్ షూట‌ర్ ను ప‌ట్టించుకోవ‌టం లేదా..

ట్ర‌బుల్ షూట‌ర్ ను ప‌ట్టించుకోవ‌టం లేదా..

తెలంగాణ‌లో రెండో సారి వ‌రుస‌గా అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత టిఆర్‌య‌స్ లో ప‌రిణామాలు వేగంగా మారుతున్నా యి. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే కేసీఆర్ వేస్తున్న వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌ల్లో హ‌రీష్ ను విస్మ‌రిస్తున్నార‌నే భావ‌న క‌లు గుతోంది. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల్లో గెలిచిన వెంట‌నే కేటీఆర్ కు పార్టీ వ‌ర్కింగ్ ప్రెడిసెంట్ ప‌ద‌వికి కేసీఆర్ క‌ట్ట‌బెట్టారు. ఈ ప‌రిణామంతె కేటీఆర్ కు భ‌విష్య‌త్ లో ఎటువంటి ప్రాధాన్య‌త ఇవ్వ‌బోయేదీ కేసీఆర్ చెప్ప‌క‌నే చెప్పిన‌ట్ల‌యింది. ఆ వెంట‌నే కేటీఆర్ స్య‌యంగా హ‌రీష్ ఇంటికి వెళ్లారు. త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. హ‌రీష్ సైతం తాను కేటీఆర్ కు పూర్తిగా స‌పోర్ట్ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. కేటీఆర్ కు ప‌ద‌వి అప్ప‌గించ‌టాన్ని హ‌రీష్ ఎక్క‌డా వ్య‌తిరేకించ‌లేదు. అయితే, ఆయ‌న అభిమానులు మాత్రం జ‌రుగుతున్న ప‌రిణామాల పై ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. అయినా..హ‌రీష్ మాత్రం వారి కి న‌చ్చ చెప్పి..పార్టీకి -కేసీఆర్ కు విధేయ‌త చాటుకున్నారు. ఈ క్ర‌మంలోనే త‌రువాతి కాలంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది..పార్టీలో కొత్త చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి.

నెల రోజులుగా మాటే క‌రువాయే..!

నెల రోజులుగా మాటే క‌రువాయే..!

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌..మాజీ మంత్రి హ‌రీష్ రావుల మ‌ధ్య గ‌త నెల రోజులుగా ఒక్కసారి కూడా మాట‌లు చోటు చేసుకో లేద‌ని స‌మాచారం. డిసెంబ‌ర్ 11న తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డైన రోజున ఇద్ద‌రు క‌లిసారు. ఒక‌రిని మ‌రొక‌రు అభినందించారు. ఆ త‌రువాత జ‌రిగిన ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకారానికి హ‌రీష్ హాజ‌ర‌య్యారు. కానీ, అక్క‌డ కేసీఆర్ తో ఎలాంటి సంబాష‌ణ‌లు జ‌ర‌గ‌లేదు. ఆ స‌మ‌యంలో కేసీఆర్ ప్ర‌త్యేంక‌గా కేటీఆర్‌- క‌విత కుటుంబాల‌తో రాజ్‌భ‌వ‌న్ వేదిక‌గా ఫొటోలు దిగారు. ఆ స‌మ‌యంలో సైతం హ‌రీష్ తో ఎటువంటి మాట‌లు చోటు చేసుకోలేదు. అప్ప‌టి నుండి ఇప్ప‌టి దాకా..ముఖ్య‌మంత్రి- హ‌రీష్ లు క‌లుసుకున్న సంద‌ర్బాలు లేవు. నీటిపారుదల శాఖ పై సమీక్ష చేసినా హరీష్ రావు కు ఆహ్వానం రాలేదు. హరీష్ రావును ఎమ్.పిగా పంపుతారా?లేక ఒక వేళ మంత్రిగా తీసుకున్నా నీటి పారుదల శాఖ ఇస్తారా? ఇవ్వరా అన్న చర్చ జరుగుతోంది. అయితే, హ‌రీష్ సన్నిహితుడికి కేసీఆర్ సివిల్ స‌ప్ల‌యిస్ ఛైర్మ‌న్ గా అవ‌కాశం ఇచ్చారు.

హ‌రీష్ అభిమానుల్లో ఆందోళ‌న‌..వాట్ నెక్ట్స్‌..!

హ‌రీష్ అభిమానుల్లో ఆందోళ‌న‌..వాట్ నెక్ట్స్‌..!

టిఆర్‌య‌స్ లో హ‌రీష్ కు వ్య‌తిరేకంగా ప‌రిణామాలు జ‌రుగుతున్నాయ‌ని..హ‌రీష్ అభిమానులు ఆందోళ‌న లో ఉన్నారు. పార్టీ కోసం స‌భ‌లోప‌లా..బ‌య‌టా హ‌రీష్ క్రియా శీల‌కంగా ప‌ని చేసిన విష‌యాన్ని వారు గుర్తు చేస్తున్నారు. పార్టీ గెలుపు కోసం చిత్త‌శుద్దితో క‌ష్ట‌ప‌డి ప‌ని చేసార‌ని అభిమానులు చెప్పుకొస్తున్నారు. కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ ముఖ్య నేత‌ల ను ఓడించ‌టానికి హ‌రీష్ వ్యూహాలు ఫ‌లించాయి. కేటీఆర్ ను రాజ‌కీయంగా ఉన్న‌త స్థాయికి చేరుకోవ‌టం కోసం హ‌రీష్ ను ప‌క్క‌న పెడుతున్నార‌ని ఆయ‌న అభిమానుల్లో ఆందోళ‌న క‌నిపిస్తోంది. అయితే, హ‌రీష్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఈ అంశాల పై ఎక్క‌డా స్పందించ‌లేదు. వ్య‌తిరేకంగా ఎక్క‌డా మాట్లాడ‌లేదు. అయితే, హ‌రీష్ సేవ‌ల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏ ర‌కంగా వినియోగించుకుంటారో చూడాలి. హ‌రీష్ అభిమానుల్లో ఎలాంటి రియాక్ష‌న్స్ వ‌స్తాయో చూడాల్సిందే...

English summary
What's going on in TRS..? Harish supporters feels that their leader not getting priority in Govt and Party activities. Sine last one month no communication between KCR and Harsih. It indicates Gap between both of them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X