హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇవాంకా హైదరాబాద్‌లో ఇలా, 500 కెమెరాలు: సదస్సుతో స్టార్టప్‌లకు 'మిలియన్ డాలర్ల్' ఛాన్స్

గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ ఈ నెల 29, 30 తేదీల్లో హైదరాబాదులో జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు వక్తలుగా వస్తున్నారు. 42 మంది వక్తలు పాల్గొననుండగా, అందులో 18 మంది మహి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ ఈ నెల 29, 30 తేదీల్లో హైదరాబాదులో జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు వక్తలుగా వస్తున్నారు. 42 మంది వక్తలు పాల్గొననుండగా, అందులో 18 మంది మహిళలు కావడం గమనార్హం.

ఇవాంకా పుణ్యమాని!: జనాలు ఆశ్చర్యపోతున్నారు.., ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతోందంటే..ఇవాంకా పుణ్యమాని!: జనాలు ఆశ్చర్యపోతున్నారు.., ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతోందంటే..

రియల్‌ రోల్‌ మోడల్‌.. ఇవాంకా ట్రంప్! మూడేళ్లు సహజీవనం, ఆపై పెళ్లి, తండ్రికి తోడుగా పాలిటిక్స్ లోకి..రియల్‌ రోల్‌ మోడల్‌.. ఇవాంకా ట్రంప్! మూడేళ్లు సహజీవనం, ఆపై పెళ్లి, తండ్రికి తోడుగా పాలిటిక్స్ లోకి..

పోలీసుల అత్యుత్సాహం: బిచ్చగాళ్లనుకుని.., ఇవాంకా ట్రంప్ వస్తుంటే మాత్రం.. చూసుకోవక్కర్లా?పోలీసుల అత్యుత్సాహం: బిచ్చగాళ్లనుకుని.., ఇవాంకా ట్రంప్ వస్తుంటే మాత్రం.. చూసుకోవక్కర్లా?

 సదస్సులో పలువురు మాట్లాడుతారు

సదస్సులో పలువురు మాట్లాడుతారు

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కూడా హాజరవుతున్నారు. దేశ, విదేశాలకు చెందిన ఆర్థికవేత్తలు, ఇన్వెస్టర్లు, కంప్యూటర్,మీడియా, వినోద రంగాలకు చెందినవారు మాట్లాడుతారు.

 టోనీ బ్లెయిర్ సతీమణి చెరీ బ్లెయిర్

టోనీ బ్లెయిర్ సతీమణి చెరీ బ్లెయిర్

బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెరీ బ్లెయిర్ రానున్నారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌కు ఆమె వ్యవస్థాపకురాలు. ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందా కొచ్చార్ హాజరవుతారు. నైజీరియాలో దాదాపు వంద సినిమాల్లో నటించిన ఆఫ్రికన్ నటి ఓన్యెకాచీ స్టీఫేనీ లీనస్ కూడా రానున్నారు.

పెట్టుబడులు రాబట్టుకునేందుకు

పెట్టుబడులు రాబట్టుకునేందుకు

ఇదిలా ఉండగా, సదస్సులో ఇప్పటికే పలు అంతర్జాతీయ స్టార్టప్‌లు భారీ పెట్టుబడులు రాబట్టుకునేందుకు పోటీ పడుతున్నాయి. వీటిలో కొన్నింటిని తుదిపోటీకి ఎంపిక చేసారు. ఈ నెల 8 నుంచి 24 వరకు ఆన్‌లైన్లో వీటిని వీక్షించి, ఆలోచనలకు ఓటు వసే అవకాశం కల్పించారు.

 స్టార్టప్‌లు మిలియన్ డాలర్లకు పోటీ పడొచ్చు

స్టార్టప్‌లు మిలియన్ డాలర్లకు పోటీ పడొచ్చు

మెరుగైన ఆలోచనలతో ఆకట్టుకునే వారికి అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ క్రెడిట్‌, పర్యవేక్షణ, అలైస్‌ డిజిటల్‌, సీ-5 యాక్సిలరేషన్స్‌, ఎయిర్‌బీఎన్‌బీ క్రెడిట్స్‌, డెల్‌ ల్యాప్‌టాప్‌, గూగుల్‌ క్రెడిట్స్‌, శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగే స్టార్టప్ ప్రపంచ కప్‌ పోటీల్లో దాదాపు మిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు పోటీ పడవచ్చు.

 ఇవాంకా గురించి డీజీపీ కార్యాలయం ప్రత్యేక నివేదిక

ఇవాంకా గురించి డీజీపీ కార్యాలయం ప్రత్యేక నివేదిక

ఇదిలా ఉండగా, ఇవాంకా ట్రంప్ కూతురు పర్యటన సందర్భంగా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. భద్రతకు సంబంధించి డీజీపీ కార్యాలయం ప్రత్యేక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది.

 ఏర్పాట్లు చూస్తోన్న ఎస్పీజీ

ఏర్పాట్లు చూస్తోన్న ఎస్పీజీ

అమెరికా సీక్రెట్ సర్వీస్‌తో పాటు భారత ప్రధాని మోడీకి రక్షణ కల్పించే ఎస్పీజీ ఆ ఏర్పాట్లు చూస్తోంది. రాష్ట్రానికి సంబంధించి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

 ఇవాంకా రాక ఇలా

ఇవాంకా రాక ఇలా

ఇవాంకా ట్రంప్ ఈ నెల 27న ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారు. నేరుగా వెస్టిన్ హోటల్ వెళ్తారు. 28న ప్రత్యేక కాన్వాయ్‌లో రోడ్డు మార్గంలో హెచ్ఐసీసీకి వెళ్లి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరవుతారు. అనంతరం ప్రధాని మోడీ ఆమెకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు ఇస్తారు.

 మూడు రోజుల ముందే హోటల్ స్వాధీనం

మూడు రోజుల ముందే హోటల్ స్వాధీనం

29న గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులకు విందు ఇస్తారు. ఇవాంకా 29న మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్తారు. ఆమె బస చేసిన వెస్టిన్ హోటల్‌ను అమెరికా భద్రతా అధికారులు పరిశీలించారు. మూడు రోజుల ముందే హోటల్‌ను స్వాధీనం చేసుకోనున్నారు.

 ఫలక్‌నుమా ప్యాలెస్ వద్ద 500 సీసీటీవీ కెమెరాలు

ఫలక్‌నుమా ప్యాలెస్ వద్ద 500 సీసీటీవీ కెమెరాలు

మోడీ, ఇవాంకా రాక నేపథ్యంలో తాజ్ ఫలక్‌నుమా వద్ద 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రముఖులు తాజ్ ఫలక్‌నుమాకు వెళ్లే సమయంలో కొద్ది గంటల పాటు చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ మూసివేయనున్నారు.

English summary
While the high-profile security teams comprising men from the US Homeland Security, Special Protection Group (SPG) and the Intelligence Bureau (IB) are piecing together security arrangements for the top leaders for the Global Entrepreneurship summit, the local polices say that they are being pestered with unacceptable demands from high-ranking Secret Services officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X