హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐడియాలు పురుషుల అబ్బ సొత్తు కాదు!: ఇవాంకా-చందాకొచ్చర్ మధ్యలో కేటీఆర్

|
Google Oneindia TeluguNews

Recommended Video

GES 2017: Ivanka Trump

హైదరాబాద్: హెచ్ఐసీసీలో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్ రెండో రోజు వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు పాల్గొన్నారు. కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చార్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ బ్లెయిర్ పాలుపంచుకున్నారు.

మహిళా సాధికారత, వ్యవసాయం, పెట్టుబడులు, క్రీడలు తదితర అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. పలువురు ప్రముఖులు మాట్లాడనున్నారు. ఇవాంకా, చందాకొచ్చార్, కేటీఆర్‌లు మహిళా సాధికారత అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.

బాబు, కేసీఆర్ ప్రభుత్వాలపై రామ్‌చరణ్ సతీమణి ఉపాసన, గొప్ప అవకాశమని మంచు లక్ష్మీబాబు, కేసీఆర్ ప్రభుత్వాలపై రామ్‌చరణ్ సతీమణి ఉపాసన, గొప్ప అవకాశమని మంచు లక్ష్మీ

హెచ్ఐసీసీలో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్ రెండో రోజు వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు పాల్గొన్నారు. కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించారు.

 ఐటీ రంగంలో మహిళలకు ఎక్కువ అవకాశాలు

ఐటీ రంగంలో మహిళలకు ఎక్కువ అవకాశాలు

విభిన్న రంగాలలో మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారని ఇవాంకా చెప్పారు. మహిళలు ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలకు అండగా ఉంటున్నారని తెలిపారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మహిళలు సిద్ధంగా ఉండాలని చెప్పారు. సాంకేతిక రంగాలలో మహిళలకు అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. నూతన ఆవిష్కరణలు అన్ని ప్రయివేటు రంగాలలో వస్తున్నాయని చెప్పారు. మహిళల అభివృద్ధికి కుటుంబ సభ్యులు పూర్తిగా సహకరించాలన్నారు. నూతన పాలసీలు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీ రంగంలో మహిళలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు. మహిళలను ప్రోత్సహించేందుకు అమెరికా ప్రభుత్వ విద్యావ్యవస్థలో మార్పులు చేస్తోందని చెప్పారు.

మహిళల కోసం ప్రత్యేక విధానాలు లేవు

మహిళల కోసం ప్రత్యేక విధానాలు లేవు

మహిళల్లో ఆత్మస్థైర్యం నింపితేనే రాణించగలరని చందా కొచ్చార్ చెప్పారు. బిడ్డకు జన్మను ఇచ్చాక కొందరు మహిళలు కెరీర్‌ను కోల్పోతున్నారని చెప్పారు. అటువంటి పరిస్థితుల్లోను మహిళలు కెరీర్‌ను వదులుకోకూడదని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో గార్మెంట్స్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసే మహిళలను తాము ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. మహిళల కోసం ప్రత్యేక విధానాలు అంటూ ఏమీ లేవని చెప్పారు. మహిళలను విద్యావంతులను చేస్తే ఒక తరాన్నే విద్యావంతులను చేయవచ్చని చెప్పారు.

 సమర్థంగా వ్యవహరిస్తున్నారు

సమర్థంగా వ్యవహరిస్తున్నారు

భారత్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉందని చెర్రీ బ్లెయిర్ అన్నారు. భారత్‌ లాంటి దేశాల్లో మహిళా భాగస్వామ్యం ఉంటేనే వృద్ధి సాధ్యమవుతుందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు మహిళా శక్తి ఎంతో అవసరమన్నారు. గ్రామీణ మహిళలకు సూక్ష్మరుణాలు అధికంగా ఇవ్వాలన్నారు. వారిలో నైపుణ్యాభివృద్ధిని పెంచాలన్నారు. ఉద్యోగం, కుటుంబం నిర్వహణలో మహిళలు సమర్థంగా వ్యవహరిస్తున్నారన్నారు.

 తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు

తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు

మహిళలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మహిళలను ఇంటి వద్ద నుంచి పని చేసే అవకాశాలను కల్పిస్తున్నామని డెల్ ఈఎంసీ కరెన్ క్వింటోన్ అన్నారు. కాలానుగుణంగా పారిశ్రామిక విధానాల్లో మార్పులు తీసుకురావాలని, సాంకేతికత రోజురోజుకు స్మార్ట్‌గా మారుతోందన్నారు. ఐడియాలు పురుషుల అబ్బ సొత్తు కాదన్నారు.

English summary
The Global Entrepreneurship Summit in its second day today will begin with a session on "Workforce Development and Skills Training". Telengana Minister KT Rama Rao moderated a session with Cherie Blair, Ivanka Trump, Chanda Kochhar and Karen Quintos, Chief Customer Officer of Dell EMC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X