హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇవాంకా పుణ్యమా అని.. ‘గోల్కొండ’ ప్రజల బాధలు తీరాయి!: ఎలాగంటే..?

మంగళవారం(నవంబర్ (28) ప్రారంభం కానున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్ ఈ రోజు తెల్లవారుజామునే నగరానికి చేరుకున్న విషయం.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ivanka Trump hyderabad Visit : Bar and Restaurants to be closed

హైదరాబాద్: మంగళవారం(నవంబర్ (28) ప్రారంభం కానున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్ ఈ రోజు తెల్లవారుజామునే నగరానికి చేరుకున్న విషయం తెలిసిందే.

ప్రపంచ 'ప్రత్యేక' విందుకు 'ఫలక్‌నుమా' రెడీ: మోడీ, ఇవాంకా, దిగ్గజాల రాకప్రపంచ 'ప్రత్యేక' విందుకు 'ఫలక్‌నుమా' రెడీ: మోడీ, ఇవాంకా, దిగ్గజాల రాక

అంతర్జాతీయ సదస్సు, ఇవాంకా రాకతో నగరంతోపాటు గోల్కొండ కోటను కూడా ప్రభుత్వం సుందరంగా తీర్చిదద్దింది. ఈ నేపథ్యంలో తమ ప్రాంతంలో దోమల బెడద సమస్య తీరిందని తెగ సంతోషపడుతున్నారు గోల్కొండ పరిసర ప్రాంతాల ప్రజలు.

అంతా కేసీఆరే చేశారు!: నగర వాసుల కళ్లల్లో 'మెట్రో' ఆనందంఅంతా కేసీఆరే చేశారు!: నగర వాసుల కళ్లల్లో 'మెట్రో' ఆనందం

 సందర్శకులకు అనుమతి లేదు

సందర్శకులకు అనుమతి లేదు

అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొంటున్న ఇవాంకా ట్రంప్‌తోపాటు 1500 మంది విదేశీ ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర సర్కారు విందు ఇవ్వనున్న నేపథ్యంలో గోల్కొండ కోటలో మంగళవారం నుంచి సందర్శకులకు అనుమతి నిరాకరించారు.

 రంగంలోకి జీహెచ్ఎంసీ సిబ్బంది

రంగంలోకి జీహెచ్ఎంసీ సిబ్బంది

సాయుధ పోలీసుల పహరా మధ్య గోల్కొండ కోటలో అధికారులు విందు ఏర్పాట్లు చేస్తున్నారు. గోల్కొండ కోటతోపాటు నలువైపులా దోమల బెడద ఎక్కువగా ఉండటంతో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం అధికారులు ఫాగింగ్ చేయడంతో పాటు హెర్బల్, కెమికల్స్‌ను స్ప్రే చేయించారు.

 దోమలకు నో ఫ్లైయింగ్ జోనే

దోమలకు నో ఫ్లైయింగ్ జోనే

భద్రత పరంగా గోల్కోండ కోటలో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా దోమల బెడద ఎక్కువగా ఉండటంతో వాటి నిర్మూలనకు అధికారులు పలు చర్యలు తీసుకున్నారు. వారంరోజులుగా దోమల నివారణకు స్ప్రే, ఫాగింగ్ చేయడంతో దోమల సమస్య పూర్తిగా తీరిపోయింది.

 ఇవాంకా పుణ్యమా అని..

ఇవాంకా పుణ్యమా అని..

అయితే, ఇవాంకా రాక పుణ్యమా అని తమ ప్రాంతంలో దోమల బెడద తగ్గిందని గోల్కొండ పరిసర ప్రాంతాల ప్రజలు సంతోషం వ్యక్తం చేయడం గమనార్హం. అప్పుడప్పుడు ఫాగింగ్ చేస్తున్నా దోమలు మాత్రం పోలేదని, ఇవాంకా వస్తుందని అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో దోమల లేకుండా పోయాయని స్థానికులు చెబుతున్నారు. కాగా, స్థానికంగా ఉన్న బార్లు, దుకాణాలను విందు నేపథ్యంలో మూసేయించారు.

 పరిమళాలు వెదజల్లే..

పరిమళాలు వెదజల్లే..

ఇప్పటికే పరిమళాలు వెదజల్లే లిక్విడ్స్‌తో స్ప్రేయింగ్‌ పనులు చేస్తుండగా విందురోజు ప్రత్యేక పరిమళాలతోపాటు దోమలను దరి చేరకుండా చేసే లెమన్‌గ్రాస్‌తో తయారు చేసిన ప్రత్యేక అగర్‌బత్తీలను గోల్కొండ కోటలో వినియోగించనున్నారు. లెమన్‌ గ్రాస్‌.. దోమల రెపెల్లెంటే కాక సుగంధం వెదజల్లడంతో సదరు అగర్‌బత్తీలను నాందేడ్‌ నుంచి తెప్పించారు.

English summary
Golconda fort is no flying zone for mosquitoes due to GES and Ivanka Trump Lunch party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X