వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖగోళ అద్భుతం సూపర్ బ్లూ బ్లడ్ మూన్: చంద్రబాబు-కేసీఆర్‍‌లపై ప్రభావం!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: బుధవారం (జనవరి 31) చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది సాధారణ చంద్రగ్రహణం కాదు. సూపర్ బ్లూ బ్లడ్ మూన్ ఆకాశవీధిలో కనువిందు చేయనుంది. దాదాపు 150 ఏళ్ల తర్వాత ఇది మళ్లీ వస్తోంది.

ఈ చంద్రగ్రహణం కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. సూపర్ మూన్ అంటే సాధారణంగా కనిపించే దాని కన్నా చంద్రుడు మరింత పెద్దగా కనిపిస్తాడు. భూకక్ష్యకు దగ్గరగా వచ్చిన సమయంలో మనం దానిని చూడగలుగుతాం.

31న చంద్రగ్రహణం: ఆహారం ఎందుకు తీసుకోవద్దు?31న చంద్రగ్రహణం: ఆహారం ఎందుకు తీసుకోవద్దు?

ఖగోళ అద్భుతం సూపర్ బ్లడ్ మూన్

ఖగోళ అద్భుతం సూపర్ బ్లడ్ మూన్

కొద్దిగా నీలం రంగులో ఉండే బ్లూమూన్ రెండు మూడేళ్లకు ఓసారి దర్శనం ఇస్తుంది. కానీ పరిమాణంలో చాలా పెద్దగా ఉండి నీలం, ఎరుపు రంగు కలిసినట్టు ఉండేదే సూపర్ బ్లడ్ మూన్. దీనిని ఖగోళ అద్భుతంగా శాస్త్రవేత్తలు చెబుతుంటారు.

Recommended Video

Super Blue Blood Moon : సూపర్ మూన్, బ్లూ మూన్, బ్లడ్ మూన్ ఒక్కసారే !
నూటా యాభై ఏళ్లకు ఓసారి

నూటా యాభై ఏళ్లకు ఓసారి

1866లో సూపర్ బ్లడ్ మూన్ వచ్చింది. రేపు కనిపించిన తర్వాత మళ్లీ 150 ఏళ్లకు మాత్రమే ఇది కనిపిస్తుంది. రేపు చంద్రగ్రహణం ఉండటంతో మనం ఈ సూపర్ మూన్‌ను ఎక్కువసేపు చూడలేనిది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం

ఇదిలా ఉండగా, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారిపై ఈ చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మేషం, కర్కాటకం, ధనుస్సు, సింహరాశి వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.

తెలుగు రాష్ట్రాల సీఎంలపై ప్రభావం

తెలుగు రాష్ట్రాల సీఎంలపై ప్రభావం

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇద్దరూ కర్కాటక రాశికి చెందినవారే. దీంతో గ్రహణ ప్రభావం వీరిద్దరిపై బాగానే ఉంటుందని జ్యోతిష్య పండితులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఇరు రాష్ట్రాలలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ గ్రహణం ఇరువురిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆసక్తికర చర్చ సాగుతోంది.

English summary
Get ready for a rare lunar event that has kept the Internet abuzz from the beginning of the year. A Super Moon, Blue Moon and a total lunar eclipse can be seen on the evening of January 31.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X