వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రాఫిక్ రూల్సు సామాన్యులకేనా..అధికారులకు వర్తించవా..?జీహెచ్‌ఎంసీ కమీషనర్ వాహానంపై పెండింగ్ చాలన్లు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఉల్లంఘన నిబంధనలు సామాన్యులకేనా...ట్రాఫిక్ నిబంధనలు ఉన్నత అధికారులకు వర్తించావా అంటూ ఏకంగా ఓ యువకుడు హైదరాబాద్ నగర కమీషనర్ వాహనంపై ఉన్న పెండింగ్ చాలన్లపై ప్రశ్నించాడు... పేరుకు పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహాన కల్పిస్తున్న పోలీసులు ప్రభుత్వ ఉన్నతాధికారుల విషయంలో మాత్రం చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టును పెట్టాడు..దీంతో దిగివచ్చిన సదరు అధికారి తన పెండింగ్ చాలన్ల మొత్తాన్ని చెల్లించాడు.

Recommended Video

మురికి కాలువలు శుభ్రం చేసిన పంచాయతీ సిబ్బంది
 పెండింగ్ చాలన్లపై పోలీసులకు షాక్ ఇచ్చిన నగర యువకుడు..!

పెండింగ్ చాలన్లపై పోలీసులకు షాక్ ఇచ్చిన నగర యువకుడు..!

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఓ నగర యువకుడు షాక్ ఇచ్చాడు. హైదరాబాద్ నగర ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా పలు చోట్ల అవగాహాన కల్పిస్తున్నారు...దీంతో పెండింగ్ చాలన్లపై నోటీసులు పంపిస్తూ వాహనదారులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు..నిబంధల పేరు మీద ప్రతి అంశానికి జరిమానాలు వేసి నడిరోడ్డుపై వసూలు చేస్తున్నారు..అయితే ఇదంతా ట్రాఫిక్ కష్టాలు, ప్రజలు మంచి చేయడం కోసమే అంటూ బిల్డప్ ఇస్తున్న పోలీసులు పెండింగ్ చాలన్లు ఉన్న ఉన్నత వర్గాలు, ఉన్నత అధికారులపై మాత్రం ఎలాంటీ చర్యలు తీసుకోవడం లేదు..

జీహెచ్‌ఎంసీ కమీషనర్ వాహనం సంగతేంటీ...?

జీహెచ్‌ఎంసీ కమీషనర్ వాహనం సంగతేంటీ...?

ఇందుకు సంబంధించి నగరంలోని ఓయువకు నేరుగా హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ కమీషనర్ దాన కిషోర్‌ను టార్గెట్ చేశాడు. ఈనేపథ్యంలోనే వేగం కన్నా ప్రాణం మిన్నా అంటూ ప్రజల్లో అవగహన కల్పిస్తు ఆ పేరుతో చలాన్లు వేస్తున్న పోలీసులకు చెక్ పెట్టాడు..ఈనేపథ్యంలోనే ప్రజలకు ట్రాఫిక్ నిబంధలపై ప్రజలకు అవగాహాన కల్పిస్తున్న పోలీసులు జర జీహెచ్‌ఎంసీ కమీషనర్ దాన కిషోర్ వాహానం పై ఉన్న పెండింగ్ చాలన్ల సంగతేంటని ప్రశ్నించారు..అయితే కమీషనర్ వాహానం పై రూ 6210 పెండింగ్ చాలన్లు ఓవర్ స్పీడ్ వల్ల విధించిన చాలన్లుగా నమోదయ్యాయంటూ నగరానికి చెందిన మోహిత్ పటేల్ తన ట్విట్టర్ లో పోలీసులకు తెలిపారు.

ట్వీట్‌తో కమీషనర్ వాహానం పెండింగ్ చాలన్లు చెల్లింపు

ట్వీట్‌తో కమీషనర్ వాహానం పెండింగ్ చాలన్లు చెల్లింపు

ఈనేపథ్యంలోనే ప్రజల కంటే ముందుగా అధికారుల్లో అవగాహాన కల్పించాలని పోలీసులను కోరారు. కాగా టీఎస్09 ఎఫ్ఏ 4248 అనే నంబర్‌పై రాజెంద్రనగర్‌లోని పలు ప్రాంతాల్లో కమీషనర్ వాహానానంపై ఆగస్టు 2018 నుండి ఏప్రిల్ 30 2019 మధ్య కాలంలో ఉన్న పెండింగ్ చాలన్లు ఉన్నాయి..దీంతో మెహిత్ పటేల్ ఈ విషయాలను జీహెహెచ్‌ఎంసీ కమీషనర్‌తోపాటు రాచకోండ సీపీ మహెష్ భగవత్, హైదారాబాద్ ,సైబారాబాద్ ట్రాఫిక్ పోలీసులతోపాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్‌కు సైతం ట్వీట్‌ను అటాచ్ చేశారు.కాగా విషయం బయటకు రావడంతో వెంటనే కమీషనర్ వాహానం పై ఉన్న మొత్తాన్ని చెల్లించారు.అయితే ఇందుకు కారణమైన డ్రైవర్‌ను త్రీవంగా మందలించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పినట్టు తెలుస్తోంది.

English summary
The Telangana state police’s e-challan website showed that the ghmc commissioner had six pending challans for his vehicle from August 8, 2018 to April 30, 2019,Dana Kishore was found to have several pending challans,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X